ఆర్యభట్టు

శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు

ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా)లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాకా ఆర్యభట్టు పై (॥) విలువను కనుగొన్నాడు. గణితంలో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్‌లను ఇతను “జ్యా” మరియు “కొ జ్యా”గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పేట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్ట ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను “ఆర్డువేరియస్” అని, అరబ్బులు “అర్జావస్” అని వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనేవారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్‌ను సందర్భించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట “కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు” అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.

ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు. గణిత శాస్త్రవేత్త వరాహమిహురుడికి సమకాలికుడిలా భావిషస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన స్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండేవాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తుంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ లేకపోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన, ఆయన పుస్తకం ఆర్యభట్టియం కూడా . 23ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో చాలా విశేషాలతోపాటు ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషి చేశాడు.

ఆర్య భట్టుడు నిస్సందేహంగా శాలివాహన శకం ఐదవ శతాబ్ధానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్థారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీ.శ. 426లో జన్మించాడని ఆర్యభట్టీయమనే గ్రంథాన్ని క్రీ.శ. 499లో వ్రాసాడని చెప్పవచ్చును.

ఆర్యభట్టుడు ఎప్పుడూ కూడా ఆకాశంవైపు చూస్తూ కంటికికనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకి గల వ్యత్యాసాన్నిగుర్తించి చాలా విచారించి దేవుని గూర్చి తపస్సు చేసేడట. దాని ఫలితమే దశ గీతిక అనే చిన్న గ్రంథం ఈయన ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు రెండు – దశాగీతిక, ఆర్యాష్టోత్తరశతకము. ఈ దశ గీతికలో పదమూడు శ్లోకాలున్నాయి. ఇవన్నీ వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డావి. ఈ గ్రంథంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చి పెట్టాడు. గణితపాదం,కాలక్రియ పాదం, గోలార్థ ప్రకాశిక అనేవి మూడు ఆర్యాష్టత్తర శతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టుని గ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతి ప్రకాశిక వ్రాసిన సూర్యదేవదీక్షితుడు, కేరళకు చెందిన నీలకంఠసోమయాజి.

ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రంలో అనేక రచనలు చేశాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని ఇప్పుడు లేవు. అతని ముఖ్యమైన రచన “ఆర్యబట్టీయం” అని గణిత, ఖగోళ శాస్త్రాల గురించి వివరించబడింది. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తారంగా ప్రస్తావించడమే కాకుండా ఈ రచన కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని “అష్మకతంత్రా” అని పిలిచేవాడు. ఆర్యశతాష్ట (108 శ్లోకాలు కలిగినది అని అర్థం) అని కూడా వ్యవహరించబడేది.

ఆర్యభట్టీయాన్ని గీతికాపాద, గణిత పాత, కళాక్రియ పాద, గోళ పాద అనే నాలుగు భాగాలు రాశారు. ఈ ‘ఆర్యభట్టీయం’ అనే రచనకు ఆయన స్వయంగా పేరేమి పెట్టలేదు. ఇది తరువాత తరంవారు చేసిన పద ప్రయోగమే. అత్యంత క్లుప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు ప్రకటించారు. ఈ గ్రంథంలో ‘పై’ విలువ ఖచ్చితంగా 31416 అని ప్రకటించారు. గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట ఈ విధంగా వివరించారు. ”త్రిభజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంతో అర్థ భాగానికి సమానం”.

భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఆర్యభట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేశాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకరంలో పడుతుంది. కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిద్ధాంతాల ఆధారంగానే. కాని అప్పట్లో ప్రజలలో ఈ సిద్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృద్ధి చెందలేదు.

భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన “గోళాధ్యాయం”లో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయం ప్రకాశం కానే కాదని అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్యగ్రహణాలను ఖచ్చితంగా లెక్కకట్టాడు.

భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23గంటల 56 నిమిషాల 41 సెకనులుగా లెక్కగట్టాడు. ఈనాటు ఆధునిక లెక్కల ప్రకారం అది 23గంటల 56 నిమిషాల 4091గా తేలింది.

భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రాహానికి ఇతనిపేరే పెట్టారు.

ఆర్యభట్టుడు భూగోళః సర్వతోవృత్తః అని వ్రాసాడు. భూగోళ మనే మాటలో ఇమిడి ఉంది. భూమి యొక్క వర్తులత్వం. భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు. ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని చెప్పాడు. నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈ భూమే తిరుగుతూ నక్షత్రాల యొక్క గ్రహాలయొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది. కాని ఈ సిద్దాంత మప్పటి ప్రజాభిప్రయానికిన్నీ ప్రాచీన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండేకొరకో వెంటనే మళ్ళీ భూమి తిరక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలు, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ వ్రాశాడు. ఆర్యభట్టుని భూభ్రమణ సిద్దాంతం మారోజుల్లోనే బ్రహ్మగుప్తనిచే ఆక్షేపింపహబడింది.

భూమి మొదలగు గ్రహాలయొక్క గతి పూర్తి వృత్తంలో లేదనీ దీర్ఘవృత్తంగా ఉందనీ తెలియజేసిన వారిలో మొదటి హిందువుడు ఆర్యభట్టుడే. సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని గ్రహించక ఆర్యభట్టుడు, చంద్రుడు భూచ్చ్హాయలోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్ని కూడా తెలియపరిచాడు. ఇదీకాక ఈ చంద్రుడు మొదలయిన గ్రహాలు స్వయం ప్రకాశములు కావనీ, సూర్యకంతి వల్లనే ప్రకాశిస్తున్నాయని చెప్పినవాడు కూడా ఆర్యభట్టుడేని, నక్షత్రాలని కూడా వాటితో చేర్చాడు.

భూమికాకర్షణశక్తి ఉందని అన్ని మాటల్లో చెప్పకపోయినా అతనికావిషయం తెలుస్తున్నట్లుగా చెప్పబడింది. భాస్కరుడు మాత్రం ఆకర్షణశక్తి అనే పదాన్ని వాడాడు.

భూమి చుట్టుకొలత, వ్యాసమూ మొదలైనవి ఆర్యభట్టుడు ఇచ్చిన కొలతలకున్నూ, ఇప్పటి నవీన శాస్త్రజ్ఞల పరిమాణాలకు దగ్గరగా ఉన్నాయి.

ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లామిక్ స్వర్ణయుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డాయి. అల్-ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనలో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *