ఆల్ర్ఫెడ్ నోబెల్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

 

 

ఆల్ర్ఫెడ్ నోబెల్

నోబెల్ పేరు బహుశాల వినని వారుండరేమో. ప్రపంచ ఖ్యాతి గాంచిన నోబెల్ బహుమానం ప్రతి యేటా భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, శరీర ధర్మ్ శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో విశేష ప్రతిభ చూపిన వారికి అందజేస్తారు. ఈ నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసింది ఆల్ర్ఫెడ్ నోబెల్  1901 నుంచి ఈ బహుమానాన్ని ఇస్తున్నారు. ఆల్ ఫ్రెడ్ బెర్నాండ్‌ నోబెల్ వర్థంతి రోజు ఈ బహుమానాన్ని బహుకరిస్తారు.

ఆల్ర్ఫెడ్ నోబెల్ 21, 1833లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జన్మించారు. నోబెల్ తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ మిలటరీ ఇంజనీరు. పరిశోధకుడు, ప్రేలుడు పదార్థాల నిపుణుడు. తల్లి కరోలైన్ ఆండ్రియెట్టా నోబెల్ స్వీడన్‌కు చెందిన లింఫౌటిక్‌ వెజనల్‌ ను కనుగొన్న అలోఫ్‌ రెడ్‌చెక్‌ సంతతికి చెందిన ఆమె  1842లో నోబెల్ తన తల్లి, తమ్ముడితో కలిసి తన తండ్రి దగ్గరకు సెంట్‌ పీటర్‌ బర్గ్ చేరుకున్నారు. ఈ రోజులలో నోబుల్ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆయన ఎక్కువగా ట్యూటర్ల సహాయంతోనే విద్యనభ్యసించారు. తన తండ్రి ద్వారానే నోబెల్ పరిశోధనలపై ఆశక్తి పెంచుకున్నాడు. తన 16వ యేటనే ఆయన రసాయనిక శాస్ర్తవేత్తగా ఎదిగారు. ఇంగ్లీష్, ప్రెంచి, జర్మని, రష్యన్, స్వీడిష్ బాషలలో ధారాళంగా మాట్లాడగల్గేవారు.

1950లో రసాయన శాస్త్రం అధ్యయనం కోసం ఆయన పారిస్ చేరుకున్నారు. అక్కడ నుండి అమెరికా చేరుకొని నాలుగు సఁవత్సరాలు జూన్ ఎరిక్‌సన్‌తో కలిసి పరిశోధనలు జరిపారు. ఆ తర్వార తన తండ్రితోపాటు ఫ్యాక్టరీలో పనిచేయాటనికి పీటర్స్ బర్గ్ చేరుకున్నారు. అయితే 1859లో వ్యాపారం దివాలా తీయటంతో తిరిగి వారి కుటుంబం స్వీడన్ చేరుకొంది. స్వీడన్ చేరుకొన్న తరువాత ఆయన నైట్రో గ్లిజరిన్ (ద్రవ ప్రేలుడు పదార్థం)పై పరిశోధనలు కొనసాగించారు. 1864లో ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరిగే సమయంలో ప్రేలుడు సంభవించి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు నోబెల్ సోదరుడు కావటం విచారకరం. అప్పుడు స్వీడన్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తిరిగి నిర్మించటానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు ఆయనను అందరూ పిచ్చి శాస్త్రజ్ఞుడు అని పిలిచేవారు. అయితే ఆయన నిరుత్సాహపడి తన ప్రయోగశాలను ఆపేయలేదు.

నైట్రోజన్ “ కిసెర్‌గర్‌ ”  అనే రసాయన పదార్థంలో కరిగించి నిలువ చేస్తే ఎటువంటి ప్రమాదము ఉండదని తన పరిశోధనలలో కనుగొన్నారు. దీనినే డైనమేట్‌గా పిలిచారు. ఈ డైనమేట్‌ను 1867లో బ్రిటన్‌లోను, 1868లో అమెరికాలోను పేటెంట్‌ను పొందారు. ఆ తర్వాత శక్తివంతమైన డైనమేట్‌ జిలాటిన్‌ను ఉపయోగించి తయారు చేశారు. 1887లో పొగలేని నైట్రోగ్లిజరిన్ “ బారిస్‌టైట్‌” ను రూపొందించారు. ఇదే “గన్‌పౌడర్‌” పేరుతో వాడకంలోకి వచ్చింది. డైనమేట్‌ను కనుగొన్న తర్వాత నోబెల్ ఫ్యాక్టరీ ద్వారా అమితమైన ధనాన్ని సంపాధించాడు. నోబెల్‌ 1898లో తను చనిపోయే నాటికి 90 లక్షల అమెరికన్ డాలర్లను మిగిల్చి పోయారు. ఈ నిధి మీద వచ్చే వడ్డీతో నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆయన వీలునామా రాశారు. నోబెల్ బహుమతి కన్నా ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బహుమతిగా ఇచ్చే ధనం ఎక్కువగా ఉన్నప్పటికి నోబెల్ బహుమతిని ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. తన ఆస్తిపాస్తుల ద్వారా లభించే వడ్డీని ఐదు భాగాలుగా విభజించి భౌతిక, రసాయనిక శాస్త్రం, వైద్యం లేదా శరీర ధార్మశాస్త్రం,సాహిత్యం, ప్రపంచశాంతికి కృషి చేసిన వారికి ఇవ్వాలని నోబెల్ తన వీలునామాలో వ్రాశారు.

ఆర్థిక శాస్త్రంలో 1969 నుంచి ఇవ్వటం మొదలు పెట్టారు. నోబెల్ తన వీలునామాలో ఖచ్చితమైన నిబంధనలు చేశారు. యోగ్యత, అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని స్వీడన్ దేశస్తులు అయినా కాకపోయినా బహుమతి తప్పక ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు.

భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన నోబెల్ బహుమతిని స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ వైద్య శాస్త్రానికి లేదా శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన బహుమతిని స్టోక్‌హోమ్‌లో ఉన్న కరోలిన్ ఇనిస్టిట్యూట్ వారు నిర్ణయిస్తారు. సాహిత్య బహుమానాన్ని అకాడమీ ఆఫ్ స్టాక్ హోమ్‌ వాళ్ళు నిర్ణయిస్తారు. శాంతి బహుమానాన్ని పార్లమెంటు నుంచి ఎన్నుకోబడిన ఐదుమంది సభ్యులు నిర్ణయిస్తారు. నామినేషన్‌ను ఇద్దరు ప్రతిపాదించాలి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదికి ఆయా కమిటీలకు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలోగాఆయా కమిటీలు తమ ప్రతిపాదనలను నోబెల్ అకాడమీకి సమర్పిస్తాయి. నవంబర్ 15నాటికి ఎవ్వరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యవహారమంతా చాలా నిక్కచ్చిగా, రహస్యంగా జరుగుతాయి. అయితే కొన్ని సందర్భాలలో అపశృతులు కూడా దొర్లాయి.

నోబెల్ బహుమతికి ఒక బంగారు పథకము, సైటేషన్ ఇవ్వబడతాయి, బహుమతి ధనం ఫెడరేషన్‌కు లభించే ఆదాయం మీద ఆధారపడి ఉంటుఁది. ఒకే రంగంలో ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లయితే బహుమతి మొత్తం అందరికీ సమానంగా పంచబడుతుంది. 1901లో నోబెల్ బహుమతి విలువ 42,000 అమెరికన్ డాలర్లు.

నోబెల్ గణిత శాస్ర్తానికి బహుమతి ఎందుకు నిర్ణయించలేదో వివరించలేదు. ఈ రోజు అన్నీ రంగాలు గణిత శాస్ర్త సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నాయి. బహుశం సైన్సు ఇన్ని రంగాలకు విస్తరిస్తుందని నోబెల్ ఊహించి ఉండరేమో. అదేవిధంగా శాస్త్రీయ ప్రతిపాదనలకు కూడా నోబెల్ బహుమతికి చోటు లేకుండా పోయింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాలు నోబెల్ బహుమతిని అందుకొన్నాయి. మనదేశ విషయానికి వస్తే భౌతిక శాస్ర్త కేటగిరీలో 1930లో లభించింది. ఇంతవరకు 74 సంవత్సరాల పాటు తిరిగి లభించలేదు. సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ బహుమానాన్ని అందుకొన్నారు. భారతదేశంలో పుట్టి అమెరికా పౌరసత్వం స్వీకరించిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌కు, హరిగోవింద్ ఖురానాకు నోబెల్ బహుమతి లభించింది.

మొట్ట మొదటి నోబెల్ గ్రహీతలు రాయింట్జెన్‌ (భౌతిక శాస్త్రం), వాంట్ హాఫ్ (రసాయనిక శాస్త్రం), చెహ్‌రింగ్ (వైద్య శాస్ర్తం)లో బహుమతులు అందుకున్నారు. అయితే అనేక మంది గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఇంకా అనేక మంది ఈ అవార్డును అందుకోలేకపోయారు. అయితే శాస్త్ర విజ్ఞాన ప్రపంచంలో నోబెల్ బహుమతి కంటే వాళ్ళు మానవాళికి చేసిన సేవలు శాశ్వతంగా ఉండిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *