సర్ ఐజాక్ న్యూటస్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

సర్ ఐజాక్ న్యూటస్

సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 15, 1642 – మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణఇత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగినవాడు. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్ర్తం మరియు అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.

సర్ ఐజాన్ న్యూటన్ ఊల్స్ తోర్ప్, లింగన్ షైర్, ఇంగ్లాండ్‌లో డిసెంబర్ 25, 1642వ సంవత్సరమున జన్మించాడు. ఆరోగ్యం సహకరించ పోయినప్పటికి న్యూటన్ 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించి మార్చి 20, 1727న కెన్సింగ్టన్ పట్టణము నందు మరణించారు.

న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నప్పుడు న్యూటన్ చాలా బరువుతక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్ళంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జనానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద మూడు సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ కేవలం ౩ సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ, తాతల వద్ద పెరగటం జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. న్యూటన్ 10సంవత్సరముల వయ్సులో ఉన్నప్పుడు తన సవతి తండ్రి కూడా మరణించాడు. అతని తల్లి ఊల్ప్ తోర్ప్‌కు తిరిగి వచ్చారు. ఆమె వ్యవసాయం మరియు పశువులపై ఆసక్తి తీసుకోవడం ప్రారంభించారు.

12ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రాన్థమ్‌లోని గ్రామర్ స్కూలుకు పంపబడ్డారు. అక్కడ అతని స్నేహితులలో చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. న్యూటన్ గ్రామర్ స్కూల్లో ఉన్నప్పుడు తన మేథోశక్తితో అందరిని ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీలో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు.

న్యూటన్ ట్రినిటి కాలేజీ, కేంబ్రిడ్జి వద్ద విద్యార్థిగా ఉన్నప్పుడు అతన తల్లి గ్రామంలో సహాయం కోసం కబురు చేశారు. న్యూటన్ 17వ సంవత్సరములో ఉన్నప్పుడు ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జి నుండి ఊల్స్ తోర్ప్ తిరిగి రావడం జరిగినది. పల్లెలో నివసిస్తున్నప్పుడు న్యూటన్ గొర్రెల మందలు మేస్తుండగా కాపలా కాసేవారు. ఈ పనిని న్యూటన్ చాలా అసహ్యించుకునేవారు. అనేక సార్లు న్యూటన్ గణితశాస్ర్త సమస్యలలో మునిగిపోవడంతో ఒకటి లేదా రెండు గొర్రెలు ఎల్లప్పుడూ తప్పించుకొనేవి. తన అజాగ్రత్త వలన తీవ్రంగా మందలింపబడేవాడు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు న్యూటన్‌ను ఉన్నత విద్యను అభ్యిసించడానికి విశ్వవిద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లికి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ తిరిగి జూన్ 1661లో మరోసారి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్ర్తాల అధ్యయనం ప్రారంభించారు.

న్యూటన్ పేద విద్యార్థి అవటం వలన సహ విద్యార్థులు (ధనవంతులు) న్యూటన్‌ను నిందించి ఆటపట్టించేవారు. కానీ  అతి తక్కువ కాలంలోనే న్యూటన్ అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్థ్యంతో తన తోటి విద్యార్థుల గౌరవం పొందారు. తదుపరి కాలంలో న్యూటన్ విశ్వవిద్యాలయంలో మిలిగిన స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రిక్యులేషన్ పొందారు. కానీ స్కాలర్ షీప్ పొందటంలో విఫలమయ్యారు. ఇలా జరగడం, తద్వారా ఖర్చులు పెరగడంతో న్యూటన్ చాలా కలవరపడ్డారు.

స్కాలర్‌ షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని ఆయన గ్రహించారు. న్యూటన్ ఎంతో ప్రయత్నించినా మార్కులు తక్కువ వచ్చిన  కారణంగా స్కాలర్‌ షిప్ మీద ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యలు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్‌ షిప్‌ ఇచ్చారు. న్యూటన్ ఆనందానికి అవధులు లేవు. ఈ వచ్చిన అవకాశాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నారు. అతని పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా నిమగ్నమయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్ యూనివర్సటీలో గ్రీకు, లాటిన్, హిబు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితిలను ఎంచుకున్నారు. లైబ్రరీలో న్యూటన్ తరుచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులురాసిన, తయారు చేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.

న్యూటన్ 1669లో ట్రినిటీ కాలేజీలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో రాసుకున్నారు. ఆ పుస్తకాలు న్యూటన్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేస్తూ ఇప్పటికి ఎంతో ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. న్యూటన్ 1665లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోనే అనేక ప్రాంతాల్లో ప్లేగు మహమ్మారినబడి వేల మంది మరణించారు. ఆ అంటువ్యాధుల వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేయబడినది. అప్పుడు న్యూటన్ ఊల్స్ తోర్ప్‌కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో ఆయన Fluxion యొక్క ఆలోచన మరియు కాంతి మరియు రంగు యొక్క పునాదులు వేశారు. అదే సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా 1687లో ప్రచురించబడినది. న్యూటన్ 1667లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669లో కేంబ్రిడ్జి నుండ మాస్టార్స్ డిగ్రీ పొందార. అదే సంవత్సరంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా నియమించబడ్డారు.

ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజ గణితం మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు Fluxion యొక్క ప్రత్యక్ష విలోమ పద్దతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. కాంతి యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి అనే ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి యొక్క అనేక ఇతర లక్షమాలను అధ్యయనం చేశారు.

రాయల్ సొసైటీ అధ్యక్షుడు “రాబర్ట్ హుక్” 1703లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు ఆ శాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ దైవీ శాస్త్రం మీద రచనలు ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవారు.  తీవ్రమైన చర్చలలో ఒక్కొక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు. న్యూటన్ క్రీడలు, వ్యాయామంపై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పంతొమ్మది గంటలు అధ్యయనంలో గడిపేవారు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్‌గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. న్యూటన్ నిజాయితీ మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్ మార్చి ౨౦, 1727న 84సంవత్సరాల వయసులో మరణించాడు. అతనిని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఖననం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *