సి.వి. రామన్ (1888-1970)

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

సి.వి. రామన్ (1888-1970)

రామన్కు లభించిన గౌరవ పురస్కారాలు

1924 -రాయల్ సొసైటీ పెలోషిప్ ఎఫ్ఆర్ఎస్

1929 -బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్

1930 -నోబెల్ పురస్కారం

1941 -ప్రాంక్లిన్ పతకం

1954 -భారతరత్న

1957 -లెనిన్ శాంతి బహుమతి

1917 -ఐఏసి గౌరవ కార్యదర్శి

1993 -48 భారతీ విజ్ఞాన సంస్థ ఐఐఎస్సీ బెంగుళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఎస్సీ డైరెక్టర్

రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని

కాంతి వివర్తనము

అకాస్టిక్ నాద తరంగ శాస్త్రం

ఆప్టికా దృగ్గోచర కాంతి శాస్త్రం

ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు

స్ఫటికముల భౌతిక విజ్ఞానం

పుష్పాల రంగుల – అవగాహన

వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలతో శబ్ధ తరంగాలు

పత్రికలు

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం.

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్

కరెంట్ సైన్స్ జర్నల్

యూరప్ నుండి కోల్‌కత్తాకు 1921లో ఓడలో వస్తున్న తరుణంలో సి.వి.రామన్‌కు ఒక కొత్త ఆలనచో వచ్చింది. సముద్రానికి నీలి రంగు ఎలా వచ్చింది… ఆకాశంలోని రంగే సముద్రంలోను ప్రతిభింబిస్తుంది. అనేది అప్పటి వరకు ఉన్న సిద్ధాంతం సూర్యకాంతి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంలోని వివిధ వాయువులు సూర్యకాంతి కిరణాలను చెదరగొడతాయి. అలా విక్షేపం చెందిన వాటిలో నీలిరంగు కాంతి తరంగాలు తక్కువ పొడవు ఉండటం వల్ల ఆకాశం నీలంగాను, ఆ నీలి వర్ణమే సముద్ర జలాలకు ప్రతి ఫలించి సముద్రం నీలంగా కనబడుతుంది అని లార్ట్రెలి ప్రతిపాదించారు. అయితే తన వద్ద ఉన్న నికెల్ పట్టకం (ప్రిజం)తో అప్పటికప్పుడు ప్రాథమిక పరిశీలన చేసి సముద్రనీల వర్ణం ఆకాశపు నీలి రంగు ప్రతి ఫలించటం వల్ల కాదు ఇందుకు వేరే కారణం ఉంది అని ప్రయోగాలను ప్రారంభించారు.

కలకత్తాకు చేరగానే తన ఊహను నిరూపించుకోవటానికి ద్రవాలు వాయువులలో పారదర్శక ఘన పదార్థాలలో కాంతిని పంపి వాటి పరిక్షేపణం గురించి విస్తృతంగా పరిశోధనలు చేశారు. ……సం॥లో ఎక్స్ కిరణాలు పదార్థాల గుండా ప్రసరించినప్పుడు వాటి స్వభావం మారుతుంది అని రాంట్జన్ కనిపెట్టారు. ఇందుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి (….) లభించింది. ఎక్స్ కిరణాలతో రాంట్జన్ ఎఫెక్ట్ నిజమైనప్పుడు కాంతి కిరణాలతో కూడా ఎందుకు వర్తించదు అదే స్ఫూర్తితో రామన్ తన ప్రయోగాలను కొనసాగించారు. ఆ తర్వాత ఆయన ఆలోచనలే నిజమైనాయి. 1928లో మార్చి 16న బెంగుళూరులో దక్షిణ భారతశాస్త్ర సంఘఙం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సి.వి.రామన్ తను కనిపెట్టిన కొత్త సిద్దాంతాన్ని ప్రపంచానికి వెల్లడించారు. అదే చివరకు రామన్ ఎఫెక్ట్గా రూపుదిద్దుకుంది. కేవలం రూ. 200ల విలువగల పరికరంతో రామన్ ఎఫెక్ట్‌ను రుజువుచేశారు. ఏదైనా ఒక పారదర్శకమైన (ట్రాన్పారెంట్) పదార్థం గుండా ఘన, ద్రవ, వాయువు తెల్లని కాంతి కిరణాలను ప్రసరింపచేసినప్పుడు ఈ పదార్థం స్వభావం మారుతుంది.. అని రామన్ తన పరికరం స్ర్పే క్ర్టోస్కోప్ ద్వారా నిరూపించారు.

తెల్లని కాంతి కిరణాన్ని సేంద్రియ రసాయనిక ద్రవ్యం బెంజీన్ గుండా ప్రవేశపెట్టినప్పుడు ఆ కాంతి కిరణం తన మార్గాన్ని మార్చుకున్నట్లు రామన్ స్ప్రేక్ట్రోస్కోప్ ద్వారా గుర్తించారు. అంటే అన్ని రకాల పదార్థాలలో కాంతి కిరణాలను ప్రసారం చేయటం ద్వారా ఆయా పదార్థాల భౌతిక, రసాయనిక, ధర్మాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనినే రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాం. ఈనాడు స్ర్పేక్ర్టోస్కోప్ పెద్ద శాస్త్ర విభాగమయింది.

రామన్ ఎఫెక్ట్ను ఉపయోగించి కేవలం 10ఏళ్లలో రెండు వేల రసాయనిక సమ్మేళనాల ధర్మాలను కనుగొన్నారు. స్పటికాల నిర్మాణం, గులాజీలు అన్నీ రంగుల్లో ఎలా పూస్తున్నాయి. వజ్రాలు వివిధ రంగుల్లో ఎందుకు ప్రకాశిస్తున్నాయి. రాళ్ళు అన్ని రంగుల్లో ఎందుకు ఉంటాయో మొదలగు విషయాలను రామన్ ఎఫెక్ట్ ద్వారా కనుగొన్నారు. లేజర్ కిరణాలను కనుగొన్న తర్వాత రామన్ ఎఫెక్ట్ పరిధి మరింత పెరిగింది. ఫార్మారంగం బయాలజీ పొల్యూషన్ స్టడీస్, ఇండస్ట్రియాలం కెమిస్ట్ మొదలగు విభాగాల్లో రామన్ ఎఫెక్ట్‌ను ఉపయోగించి వివిధ పదార్థాల స్వభావాలను కనుక్కొని కొత్త సమ్మేళనాలను రూపొందిస్తున్నారు.

ఆయన కృషికగి ఫలితంగా 1929లో బ్రిటిషు ప్రభుత్వం రామన్‌కు నైట్ హుడ్ బిరుదును ప్రకటించింది. 1930 ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి రామన్‌కు రామన్ ఎఫెక్ట్‌కు లభించింది. ఇప్పటికీ రామన్ ఒక్కరే భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. అంతేకాదు అప్పట్లో ఆసియా ఖండంలో సైన్స్‌లో నోబెల్ బహుమతి పొందినవారిలో మొట్టమొదటి వారు సి.వి. రామన్.

ఇక రామన్ జీవిత చరిత్రలోకి వెళ్ళదాం। సి.వి.రామన్ 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. ఆయనతండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్యతరగతి కుటుంబఁ. ఆయన ప్రాథమిక విద్యను విశాఖ పట్టణంలో (అప్పుడు విజయనగరం) పూర్తి చేశారు. ఆయన తండ్రి భౌతికశాస్ర్త ఉపాధ్యాయుడు కావటం వల్ల రామన్‌కు భౌతికశాస్ర్తం పట్ల మక్కువ కలిగింది.

రామన్ చిన్నప్పటి నుండే తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకొన్నారు. తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆపరీక్షలోనే భౌతికశాస్ర్తంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆయన 1903లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 1904కు బి.ఏ, 1907కు ఎం.ఏ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన 18సం॥రాలకే యూనివర్సిటీ విద్యను పూర్తి చేశారు. ఆయన చదువుకొనే రోజులలోనే ప్రయోగాలు నిర్వహించి తన ప్రయోగాల ఫలితాలను ప్రముఖ పత్రికలకు పంపేవారు. 1906లో ఆయన వ్రాసిన పరిశోధనా వ్యాసం లండన్‌లోని ప్రముఖ ఫిలాసాఫికల్ పత్రికలో ప్రచురితమైంది.

1907లో అసిస్టెంట్ అకౌంట్స్ జనరల్‌గా, ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో కలకత్తాలో ఉద్యోగం లభించింది. ఆ సమయంలోనే కాకతాళియంగా ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్‌ను సందర్శించటం జరిగింది. దాదాపు 1917దాకా ఆయన ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాలలో ప్రయోగాలు చేస్తూ తన పరిశోధనా వ్యాసాలను ప్రముఖ పత్రికలకు పంపేవారు. ఆ సమయంలో దాదాపు 30 పరిశోధనా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. 1917లో అషితోషం ముఖర్జే ఆహ్వానంపై ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సీటిలో (పాలిట్) ప్రొఫెసర్గా చేరారు.

కలకత్తా యూనివర్శిటీలో చేరినప్పటికే తన పరిశోధనలను కొనసాగించారు. 1933వరకు అక్కడే ఉండి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో డైరెక్టర్గా చేరారు. దాదాపు 1948 వరకు అక్కడే పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత సొంత సంస్థ స్థాపనకై కృషి చేశారు. తను దాచుకొన్న సొమ్ము, నోబెల్ ప్రైజ్‌కు లభించిన సొమ్మును సంస్థ స్థాపనకే ఖర్చు చేశారు.

రామన్ రిసెర్టి ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఆర్ ఐ)

1934లో ది ఇండియన్ అకాడమీ ఆప్ సైన్సెస్ దాదాపు 160 మంది ఫౌండేషన్ ఫెలోస్‌తో ప్రారంభించారు. ఆ సంస్థలో పౌండల్ ప్రెసిడెంట్గా తన జీవితాంతం వరకు కొనసాగారు.

1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్నతో సత్కరించింది. 1957లో సోవియట్ యూనియన్ ఇంటర్నేషనల్ లెనిన్ ప్రైజ్‌తో సత్కరించింది. ఇంకా ఇవే కాక మెకన్సీ మెడల్ ఆఫ్ రోమ్, హుగస్ మెడల్  ఆఫ్ రాంల్ సొసైటీ లండన్, ప్రాంక్లిన్ మెడల్ ఆఫి ఫిలడెల్పయా మొదలగు గౌరవాలు ఆయనకు దక్కాయి.

ఎన్నో పరిశోధనలు చేసిన రామన్ విజ్ఞాన శాస్ర్త అవగాహన కేవలం ప్రయోగశాలలో లేదా పరికరాలతో వికశించదు. స్వతంత్ర ఆలోచన నిరంతరం పరిశ్రమ ఇవే విజ్ఞాన శాస్ర్తానికి పునాదులు అని ఆయన తెలిపారు.  

నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ధ తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. బాతీయ సంగీత వాద్యాలైన వయోలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ధతరంగాలు ఏవిధంగా శృతి పేయమైన శబ్ధాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్‌లు లభించాయి

1928 ఫిబ్రవరిలో ఆయన రామన్ ఎఫక్ట్‌ను కనుగొన్న సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదిన జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్‌డే)గా ప్రకటించింది.

రామన్‌కు భారతరత్న పురస్కారం అభించినప్పుడు ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ర్టపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామాన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శన. మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నా్ను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా థీసిస్ పని వాయిదా వెయలేను. క్షంతవ్యుడను. ఈ ఉత్తరం సర్ రామన్‌కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థలో రిటైర్ అయిన వెంటనే బెంగుళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970 నవంబర్ 21 తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *