సీతాకోక చిలుకలు

ఉపాధ్యాయ లోకం బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

సీతాకోక చిలుకలు

పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన కీటకాలు సీతాకోక చిలుకలు. దీనికి ముఖ్య కారణం వీటి రంగు రంగుల రెక్కలే. సీతాకోక చిలుకలను వర్ణించని కవి బహుశా ఉండరేమో… ఏ సాహిత్యంలో వెతికినా సీతాకోక చిలుకల వర్ణన మనకు కనిపిస్తుంది. ఇవి లెపిడొపెటెరా వర్గానికి చెందిన కీటకాలు. గ్రీకులో చారల రెక్కలు ముఖ్యమైన తేడా. ఇవి బీటల్ పురుగుల తర్వాత అత్యంత పెద్ద కీటక వర్గం. వీటిలో ఒక లక్షా యాభై వేల రకాలున్నాయి. వీటిలో ఇరవై ఎనిమిది వేల జాతులు సీతాకో చిలుకలైతే మిగతావి మాత్‌లు. సీతాకో చిలుకలకు మాత్ లకు తేడాలను గమనిద్దాం. సీతాకోకచిలుకల రెక్కల రంగులు మంచి రంగులలో వుంటాయి. మాత్ రెక్కల రంగులు పేలవంగా వుంటాయి. సీతాకోక చిలుకలు నిలకడగా ఉన్నప్పుడు రెక్కలను ఆడించవు. మాత్లు రెక్కలను తెరుచుకొని వెనుక వైపుకు వంచుతాయి. సీతాకోక చిలుక గుడ్లు చెట్ల ఆకుల క్రింద కనిపిస్తాయి. కానీ మాత్ గూడ్లు నెలలోను, లేదా భూమి లోపల ఉంటాయి.

దీని జీవిత చక్రం చాలా విచిత్రంగా వుంటుంది. సీతాకోక చిలుక జీవిత చక్రం నాలుగు దశలుగా ఉంటుంది. మొదటిది గుడ్డు దశ. రెండవది లార్వా దశ, ప్యూపాదశ, ప్రౌఢ దశ, విచిత్రమైన విషయం ఏమిటంటే కాటర్‌ పిల్లర్ దశలో (లార్వా దశ) ఇది మొక్కల ఆకులను తింటూ మొక్కలకు హాని కల్గిస్తుంది. అదే ప్రౌఢ దశలో సీతాకోక చిలుకలు మొక్కల ఫలదీకరణానికి ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఇవి తమ శరీర ఉష్ణోగ్రత ఎనభైఆరు డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఎగురగలవు. వీటి వేగం వాటి స్సీసిస్ ని బట్టి మారుతూంటుంది.వేగంగా ఎగిరే సీతాకోక చిలుకలు గంటకు ముపై మైళ్ళు ప్రయాణించగలవు. కొన్ని గంటకు ఐదు మైళ్ళు మాత్రమే ప్రయాణించగలవు. ఇవి తమ శత్రువులను తప్పించుకోవటానికి రక రకాల విన్యాసాలు చేస్తాయి. శత్రువుల కంటబడతే అవి వేగంగా దూసుకొని పోగలవు. శత్రువులను ఏమార్చటానికి తన రంగుకు సరిపోయే పరిసరాల్లో కదలకుండా గడిపేస్తుంది. ఆకుల మధ్య వీటిని గుర్తించటం చాలా కష్టం.

వీటిరెక్కలు వింత వింత రంగుల్లో అందంగా మెరిసి పోతుంటాయి. దీనికి ముఖ్యకారణం దీని రెక్కల మీద పొలుసులు లాంటి పొడి ఉండటమే. ఈ పొలుసులపై కాంతి పడి వ్యతీకరణం చెందుతుంది. అంటే ఒకే కాంతి కిరణం రెండుగా విడిపోయి మరలా కలవడమన్నమాట. ఇలా కాంతి వ్యతీకరణం చెందటం వల్ల మనకు రకరకాల రంగుల్లో కనిసిస్తాయి. తమ శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవటానికి శీతాకాలంలో మంచి డార్కు రంగులలోను, సమ్మర్ సీజన్లలో కొంత రంగు తక్కువగాను మార్చుకుంటాయి. వెట్ సీజన్లలో వీటి రెక్కలపై పెద్ద పెద్ద రంగుల మచ్చలు కనిపిస్తాయి. ఇవి శత్రువులను ఏమార్చటానికి, జత కట్టడానికి ఎంతో సహాయపడతాయి. ఇవే మచ్చలు డ్రై సీజన్లో కొంత తక్కువ రంగులో వుంటాయి. శాస్ర్తజ్ఞులు ఈ విధంగా రంగులు మారేందుకు దోహదపడే జీన్స్ కారకాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కలర్ పిగ్ మెంట్లను తయారు చేయటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగావాటి ఆకారం సైజు, రంగు దానికి సహాయపడే శారీరక విభాగం మొదలైన అంశాలను పరిశీలించటానికి మార్ఫలాజికలం ఎవల్యూషన్ అంటారు. సీతాకోక చిలుకలపై జనటిక్స్ పరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా వలస వెళ్తాయని ఆలస్యంగా తెలుసుకొన్నారు. అయితే పక్షుల్లాగా అన్నీ వేరు వేరు దిక్కులకు వెళ్ళక ఒకే దిక్కుకు గుంపులుగా వలస వెళ్తాయి. అంతేకాదు, పక్షులు ప్రతికూల వాతావరణంలో వలస వెళ్తే అలాంటి వాతావరణం తగ్గుముఖం పట్టే కాలంలో ఇవి వలస వెళ్తాయి. ఉత్తర ఆఫ్రికా, పశ్చమ ఐరోపాల్లోని కొన్ని తెగల సీతాకోక చిలుకలు గుడ్లు పెట్టేందుకు కొత్తరకం వృక్ష జాతుల్ని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తాయి. మోనార్క్, హక్ మత్, క్లాడ్ లెస్ సల్వర్, సిల్వర్-వై, పెయిటెట్లేడి, బోంగోగ్ వంటి తెగల సీతాకాకో చిలుకలు విదేశాలకు వలస వెళ్తాయి. కెనడ, అమెరికా దేశాల నుంచి కోట్ల సంఖ్యలో మోనార్క్ సీతాకోక చిలుకలు మెక్సికోకు చేరుకుంటాయి. అయితే ఈ వలస వెళ్ళినవన్నీ తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో మరణిస్తాయి. ఈ చనిపోయిన కీటకాల సంతతి స్వస్థలాలకు చేరుతాయి. ఈ విధంగా నాలుగు తరాలు మారి ఐదో తరం మోనార్క్లు స్వస్థలాలకు చేరుకుంటాయి. ఇది వాటికి ఎలా సాధ్యమవుతుందో శాస్ర్తజ్ఞులకు అంతు చిక్కడం లేదు.

మెక్సికోలోని బ్రోవర్ అనే పరిశోధకుడు పాతికేళ్ళుగా సీతాకోక చిలుకపై పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తట్టుకోలేక వేల సంఖ్యలో అవి చనిపోతుంటాయి. అయిన వాటిని లెక్కలు కట్టడానికి చనిపోయిన వాటి మీదే ఆధారపడుతారట. 1977లో చనిపోయిన సీతాకోక చిలుకల సంఖ్య ఎంతో తెలుసా… పదికోట్లు. 2003లో చనిపోయిన వాటి సంఖ్య 27.30 కోట్లు. ఈ లెక్కన మెక్సికోకు వలస వచ్చే సీతాకోక చిలుకల సంఖ్య అర బిలియన్ పైనే అని ఆయన లెక్కలు వేసి చెప్తున్నారు.

ఇంకొక విచిత్రమైన విషయమేమిటంటే అవి ప్రయాణించేటప్పుడు పెద్ద గాలి వీచినా వాటికేమి ప్రమాదం జరగదు. ఎంత వేగంగా గాలి వీచినా దానికి మూడు రెట్లు వేగంతో దూసుకొని పోగలవు.

ఇటీవల రెక్కలకు చెవులుండే సీతకోక చిలుకలను అమెరికా శాస్ర్తవేత్తలు గుర్తించారు. వాటిని హెలికానియోరియో సీతాకోక చిలుకలు అంటారు. ఇవి తమ శత్రువులను పసిగట్టడంలో ఉపయోగపడుతాయి. ఇవి తమ కాళ్ళతో అల్ర్టా వైలెట్ రేస్ ను గుర్తించగలవు. వాటి కాళ్ళలో సెన్స్ ఆర్గాన్స్ వుంటాయి. వీటి సహాయంతో ఆహారాన్ని గుర్తించి (తేనెను) అది తీసుకోవచ్చో లేదో తెలియజేస్తాయి. ఇవి మనకు ముక్కులోను, నాలుగమీద ఇవి ఉంటాయి. దీని శరీరంపై ఉండే ఫర్ స్పర్శ జ్ఞానాన్ని కలిగి వుంటుంది. ఇవి నర్వ్ సెల్ ద్వరా బ్రెయిన్ కు సమాచారాన్ని అందిస్తుంది.

కాటర్ పిల్లర్ స్టేజిలో ఇవి తమని కాపాడుకోవటానికి రక రకాల విన్యాసాలు, రంగులను కల్గివుంటాయి. చాలా వరకు ఇవి ఆకుపచ్చ రంగుల్లో ఉండి చెట్ల మధ్య కనబడకుండా తప్పించుకొంటాయి. కొన్నింటికి శరీరంపై పెద్ద పెద్ద కళ్ళుండి పాముల్లాగా భయం గొల్పేవిగా వుంటాయి. కొన్ని రకాల సీతాకోక చిలుకలు విషపూరితమైనవి. వీటిని తిన్న పక్షులు అనారోగ్యానికి గురవుతాయి

వీటి శిలాజాలు చాలా అరుదు. కాని ఇవి నూటమూఫై మిలియను సంవత్సరాల చరిత్ర ఉందని పుష్పించే మొక్కల కాలం నాటి నుంచి వుండి వుంటాయని శాస్ర్తజ్ఞులు అంచనా వేశారు.

మీరు కూడా మీపరిసర ప్రాంతాలలో లభించే సీతాకోక చిలుకలను గమనించండి. వాటి రంగులు, ఏ మొక్కలకు అవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఏ చెట్లపై గుడ్లు పెడ్తున్నాయి. వాటి వివిధ దశలను పరిశీలించండి. పరిశీలించేటప్పుడు వాటికి హాని కలగకుండా చూడండి. మీ పరిశీలనలు మాకు పంపితే ఎంపికైన వాటిని ప్రచురిస్తాయి. మీ పరిశీలనకు సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *