పిల్లలు ఎలా నేర్చుకుంటారు ?

ఉపాధ్యాయ లోకం బ్లాగ్

పిల్లలు ఎలా నేర్చుకుంటారు ?

తల్లిదండ్రులు, ఉపాద్యాయులు చదవవలసిన ఇంకొన్ని పుస్తకాలను గూర్చి తెలుసుకుందాం.

మేం పిల్లలం – జై సీతారాం :

పిల్లలకోసం అనేక మంది కవులు బాల గేయాలు రాశారు. అయితే చాలా గేయాలు తరగతి గదిలో చెప్పడానికి అనువుగా ఉండవు. ఇంగ్లీషు రైమ్స లాగా సులభంగా పాడుకునే గేయాలు తెలుగులో చాలా తక్కువనే చెప్పాలి. ఆలాంటి కొరతను జై సీతారాం గారు తీర్చారని చెప్పాలి. పిల్లలు ఆనందించే విధంగా, ఉపాధ్యాయులు చాలా సులభంగా పాడే విధంగా ఉంటాయి ఈ గేయాలు. ఎంతో సృజనాత్మకంగా, భావయుక్తంగా, లయ బద్దంగా ఉంటాయి. స్వతహాగా ప్రధమిక ఉపాధ్యాయుడైన జై సీతారాం పిల్లలకు అందిచిన ఒక అద్భుత కానుక ఈ గేయాలు.

పిల్లలలో, ఊహశక్తిని‌, పరసరాల పట్ల ప్రేమని, వ్వక్తులు, వృత్తుల పట్ల గౌరవాన్ని, భాషపట్ల అభిమానాన్ని ఈ గేయాలు పెంపొందిస్తాయి. ప్రతీ ప్రాధమిక ఉపాద్యాయుని దగ్గర, తల్లిదండ్రుల దగ్గర తప్పక ఉండవలసిన పుస్తకమిది. పిల్లలకోసం, ఉపాద్యాయులకోసం ఎన్నో మంచి పుస్తకాలు అందిస్తున్న “మంచి పుస్తకం”  ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

తెలుగు – అధ్యాపనవిధానం – సత్తిరాజు కృష్ణారావు.:

భాషా బోధనా పద్దతులలో ఇప్పటికీ మనం పిల్లిమెగ్గలు వేస్తున్నాం! ఇప్పటికి భాషా భోధనా పద్దతిలో నిర్దష్టమైన ప్రణాలికలు లేవనే చెప్పాలి. 1954 లో “ఆంధ్రాధ్యాపకము” అనే పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.  కృష్ణారావు గారు తెలుగు పాఠ్యపుస్తక కమిటీలో 10 సంవత్సరాలు సభ్యులు గా ఉన్నారు. భాషా బొదనా పద్దతులను శాస్తీయ అవగాహనతో వివరిస్తుందీ  పుస్తకం.  ఇప్పటికీ ఇవి ఆధునిక పద్దతులే ! ఇప్పటికీ ఆచరించతగ్గవే! ప్రాధమిక  భాషాబోధన ఉపాధ్యాయులకు ఇది ఒక ప్రామాణిక గ్రంధమని చెప్పాలి.

ఇంత మంచి గ్రంధాన్ని తిరిగి ముద్రించిన “మంచి పుస్తకం” వారిని అభినందించాల్సిందే! తెలుగు భాషాభిమానుల దగ్గర,  ప్రాధమిక ఉపాధ్యాయుల దగ్గర తప్పక ఉండవలసిన పుస్తకమిది. బౌధనా కళాశాలలో ఒక ప్రామిణిక గ్రంథంగా ఉంచదగ్గ పుస్తకం. ఈ పూస్తకంలో ఇంకొక విశేషమేమంటే ప్రతీ అధ్యాయం వెనుక పరిశీలనాంశాలను ఇచ్చి మెదడుకు మేత కల్పిస్తారు.

“భాషకు కావలసిన అంశం దేనినుంచైనా తీసుకోవచ్చు. అది ఆయా తరగతిలోని పిల్లలకు అనుకూలంగా మాత్రం  ఉండాలి. అంశం వారి జీవితంతో సంబంధపడినపుడే అనుకూలిస్తుంది. భాషా ప్రణాలిక ఎంత స్పష్టగా ఉంటే ఉపాధ్యాయుల మార్గం అంత తేలిక.  పిల్లలు మాట్లాడటం వల్ల వారి భాషాపరిమితులు, స్వభావం తెలుస్తుంది.  దీనిలో పిల్లల కుటుంబాల ప్రభావం ఎంతో కనబడుతుంది. పిల్లలు మాట్లాడే భాష నిర్దుష్టంగా ఉంటే వారి రాత కూడా స్పష్ఠంగా ఉంటుంది.  పిల్లల ఆటపాటలు, నిత్యజీవితం, వ్యాపకాలు, చేతి పనులు, చిత్రలేఖనం, నాటకం, కథలు మొదలైనవన్ని భాషా కృషికి తరగని సామగ్రిని ఇస్తాయి. వాటిని ఉపయేగించాల్సిన నేర్పు మనది” అంటారు కృష్ణమూర్తి.

మాతృభాష – ప్రాధమిక విద్య : డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ :

ఈ మధ్య ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడియం  మీద వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రాధమిక స్థాయిలో మాతృభాష ప్రాముఖ్యతను శాస్రీయ బద్దంగా వివరించిన ఈ పుస్తకాన్ని ప్రతీ ఒక్కరు చదవవలసిన అవసరం వుంది.

“అసర్ – 2005 నివేదిక ప్రకారం ప్రాధమిక విద్య పూర్తయ్యె సరికి దాదాపు సగంమందికి చదవటం, రాయటం రాదు. దీనిలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు మినహాయింపు ఏమీ లేదు. పిల్లవాడి అభివృధ్ధిలో “జనిటిక్ ఎపిస్టెమాలజీ” ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది నాలుగు దశలలో ఉంటుంది. ఈ నాలుగు దశలలో ఏ ఒక్క దశలో అయినా అభివృద్ధి కుంటుపడిందంటే, మిగతా దశలలో దాని ప్రభావం తప్పక ఉంటుంది. మొత్తం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. దీనిలో మొదటి దశ ప్రాధమిక విద్యా దశ. ఈ దశలో ఏర్పడే ప్రజ్ఞా విశేషాలు ముందు ముందు మనిషి ప్రవర్తనకు, ఆలోచనా విధానానికి పునాదిగా ఉంటుంది. ఈ దశలో మాతృభాష  ప్రధాన పాత్ర పోషిస్తుంది.” అంటారు శ్రీనివాస తేజ.

ప్రాధమిక స్థాయిలో మన విద్యావిధానంలో ఉండే లోపాలను ఎండగడుతుందీ పుస్తకం. వృత్తిరిత్యా మానసిక వైద్యులైన శ్రీనివాస తేజ గారు, శాస్రీయ దృక్పథంతో ప్రాధమిక విద్యాదశలో పిల్లలు ఎదుర్కొనే అనేక అంశాలను చర్చిస్తారు. ప్రాదమిక విద్యాదశలో  మాతృభాష ఔచిత్యాన్ని శాస్రీయ బద్దగా వివరిస్తారు ఈ పుస్తకంలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *