పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్ నా అభిప్రాయం ప్రకారం చదువు నేర్పడానికి ఒక వయస్సు ఉంది. అదే బాల్యం. ఆ సమయంలో శరీరం, మనసు పెరగడానికి ప్రకృతిలో మనకు కలయిక ఉండాలి. ఎట్టి అడ్డంకులు ఉండకూడదు. అది కప్పి, మూసి పెట్టే వయస్సు కాదు. అప్పుడు నాగరికత ఎంత మాత్రం అవసరం లేదు. కానీ బాల్యంనుంచే ఈ నాగరికతతో యుద్ధం ప్రారంభమవుతూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతోంది. పిల్లవాడు బట్టలు విప్పి పారేద్దామని […]

Continue Reading

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన అమ్మ తర్వాత అంత అందమైన పేరేది?  ………….. టీచర్! ఆమె న్యూజిలాండ్‌లో పాతికేళ్ళు మెయిరీలకు చదువు చెప్పింది. మెయిరీలంటే నీగ్రోల్లాంటి వారు. యూరోపియన్ల కంటే వెయ్యేళ్ళు ముందు నుంచీ భూమి తల్లిని నమ్ముకొని బతుకుతున్నా తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళ సర్వస్వం దోచుకొన్నాక జన్మభూమిలోనే జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్ళు. 81శాతం తెల్లవాళ్ళ మధ్య బిక్కు బిక్కుమంటూ చిక్కుకుపోయిన వాళ్ళు. సెల్వియా వీళ్ళ హృదయాల్ని తట్టి లేపుతుంది. వాళ్ళ కళ్ళలో కాంతిధారలు కురిపిస్తుంది. […]

Continue Reading

హుకుం

హుకుం ఏయ్! సీతాకోక చిలకల్లారా! మీకు స్కూలు బ్యాగులిస్తాం తగిలింకోండి ఇక ఇష్టం వచ్చినట్టు ఎగరడం మానుకోండి! ఓయ్! నదులూ వొళ్ళు దగ్గర పెట్టుకొండి ఏమిటా వంకర్లు ఏమిటాగలగలలు? చక్కగా పరుగెత్తండి! నిశ్శబ్దంగా ప్రవహించండి రే! చేప పిల్లలూ పిళ్ల చేష్టలు మానండి పిచ్చిగంతులు వెయ్యకండి ఈతలపోటీల్లో మల్లే నేరుగా ఈదండి! ఏమోయ్ పువువలూ ఏమిటి రంగులు? యూనిఫార్మ్ తొడుక్కోండి ఒక్కలాగే… అందరూ ఒక్క లగే వుండాలి. సరేనా?              – జపాన్ పఠక్

Continue Reading

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్ మా పాప ఇంకా ఏడాది దాటని పిల్ల. ఆ పిల్లకు ఒక ప్లాస్టిక్ విజిల్ అంటే చెప్పలేని ఇష్టం. ఎప్పుడూ దాంతో ఆడుకొంటుండేది. ఒక రోజు నేను ఆ విజిల్‌న తీసుకొని మా పాప చూస్తుండగానే దాని రంధ్రాల్ని వేళ్ళతో మూస్తూ తెరస్తూ ఊదసాగాను. మా పాప కూడా ఆ సంగీతం పట్ల ఆసక్తి ఉన్నట్టుగానే అన్పించింది. నావైపే చూస్తూ కూచుంది. ఒకటి రెండు నిమిషాలు ఇలా గడిచాక […]

Continue Reading

పరీక్షలు – పిల్లలు – సృజనాత్మకత

‘పరీక్షలు’… మన దృష్టిలో ఇవి పిల్లల్ని బయపెడతాయి. పిల్లల్ని బడి నుంచి దూరంగా తరిమివేస్తాయి. కానీ ‘పరీక్ష’లను ‘పరీక్ష’లుగా కాకుండా ఓ ‘విభిన్న’ కోణంలో చూడగలికితే అసలు పరీక్ష అంటే ఏమిటో తెలుస్తుంది… పరీక్ష యొక్క అవసరం తెలుస్తుంది… పరీక్షలను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో అర్థమవుతుంది. పరీక్షలకు, పిల్లలకు మధ్య ఎల అవినాభావ సంబంధం తేటతెల్లమవుతుంది.   నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఓ కఠోరమైన వాస్తవం. అసలు ఇప్పటి పిల్లలు పరీక్షలను ఇష్టపడుతున్నారు. పరీక్షల ద్వారా తమ […]

Continue Reading

కథల కాణాచి……

విద్యలో  ముఖ్యమైన అంశాలు 1) సాహిత్యం, 2) కథలు, 3) చిత్రలేఖనం (డ్రాయింగ్), 4) పుస్తక పఠనం. ఈ నాలుగు అంశాలు పిల్లవాని సృజనాత్మకతకు సంబంధించినవి. సాహిత్యం అది ఏ భాషలోనైనాకావచ్చు. మంచి విలువులతో కూడిన సాహిత్యం చదివినపుడు పిల్లల మనోభావాలలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తమను తాము ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. సున్నత భావాలను మనసులో చొప్పించడం జరుగుతుంది. ఒక కవిత ద్వారా ఒక అద్భుత విషయాన్ని గ్రహించవచ్చు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర లేదా సంఘటనలు […]

Continue Reading