alegzander

అలెగ్జాండర్ ప్లెమింగ్

శ్రాస్త వేత్తల జీవిత చరిత్రలు

అలెగ్జాండర్ ప్లెమింగ్
పెన్సిలిన్ ఇంజక్షన్ పేరు వింటే మనకుగుర్తొచ్చేది అలగ్జాండర్ ప్లెమింగ్. కుళ్ళిన పదార్థాలపై పెరిగే బూజుతో ఆయన అనేక ప్రయోగాలు చేసి పెన్సిలిన్ను కనుగొన్నారు. పెన్సిలియమ్ బూజు మొక్కల నుంచి తీసిన స్రావం వల్ల బాక్టీరియా నశించిపోవటాన్ని ప్లెమింగ్ గుర్తించారు. రక రకాల జబ్బులను కలిగించే బాక్టీరియాను నశించపచేసే ఔషధం బూజు మౌక్కలలో ుందని నిరూపించారు. రెండ ప్రపంచ యుద్ధ కాలంలో పెన్సిలిన్ ఉపయోగించటం వల్ల యుద్ధంలో గాయపడిన వేలాది మంది సైనికులను కాపాడ గల్గారు. తను కనుగొన్న బూజు స్రావాన్ని ఆయన పెన్సిలిన్ అని పేరు పెట్టారు.

పదొమ్మిది వందల ఏడులో ప్లెమింగ్ యంబిబియస్లో ఉత్తీర్ణులై బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత యఫ్.ఆర్.సి.యస్. ఉత్తీర్ణులైనారు. ఆ సమయంలో ఆయన ఎక్యూట్ బాక్టీరియా ఇన్పెక్షన్ అనే గ్రంథాన్ని వ్రాశారు. తన పుస్తకంలో రైట్ వాక్సిన్ థియరీకి ఫ్లెమింగ్ ప్రాముఖ్యతనిస్తూ వ్రాశారు. అయితే అందులో ఏదో లోపముందని ఆయన గ్రహించారు. రైట్ వాక్సిన్ థియరీ ప్రకారము సూక్ష్మజీవులను నిర్జీవంగా శరీర రక్తనాళాల ద్వరా ప్రవేశ పెట్టడం జరగాలి. ఈ విషయాన్ని నిరూపించేందుకు ప్లెమింగ్ తన శరీరాన్నే అందుకు ఎంచుకున్నారు. ఒక శనివారం నాడు స్టఫిలోకోకై అనే నిర్జీవ బాక్టీరియాను తన శరీరంలోకి ఎక్కించుకొన్నారు. ఆదివారం జ్వరంతోపాటు తలనొప్పి కూడా వచ్చింది. వ్యాధి నిరోథక పెరిగినట్లు ఆయనకు అనిపించలేదు.ఈసారి నేరుగా రక్తనాళాలలోకి కాకుండా చర్మానికి ఇంజక్ట్ చేసుకొన్నారు. ఈసారి వ్యాధి నిరోథకత పెరిగినట్లు గ్రహించారు. తన ఊహే నిజమైంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రైట్తో పాటు ప్లమింగ్ కూడా కెప్టన్గా రీసెర్చి సెంటర్లో చేరారు. ఈ ప్రయోగాలు సైకికుల సహాయార్థం ఏర్పాటు చేయబడింది. రైట్ వ్యాక్సిన్ థెరపి సైన్యంలో ఎందరో ప్రాణాలను కాపాడింది. కాని గాయాలు తగిలిన వారికి చికిత్స చేయడం సమస్యగా మారింది. తన ప్రయోగశాలలో కృత్రిమంగా గాయాన్ని పరీక్షనాళికలో సృష్టించి ప్రయోగాలు జరిపారు. మందులు ఈ గాయాలను మాన్పడం లేదని గ్రహించారు.

పంతొమ్మిది వందల ఇరవై రెండు డాక్టర్ ఎలిసన్తో కలిసి ప్రయోగాలు జరిపారు. ఆ సమయంలో ఇన్ ఫ్లూయంజా వైరసం మీద ్రపయోగాలు చేస్తున్నారు. మానవ శరీరంలో సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తి ఉందని గ్రహించారు. ఆ తర్వాత కన్నీళ్ళతో ప్రయోగాలు జరిపి కన్నీళ్ళకు సూక్ష్మ జీవులను నాశనం చేసే శక్తి ఉందని గ్రహించారు. ఆ తర్వాత లాలాజలం, జుట్టు, గోళ్ళు, చనుబాలు, పత్రం వృంతాలపై ప్రయోగాలు జరిపి వాటిలో కూడా సూక్ష్మ జీవులను నాశనం చేసే శక్తి ఉందని గ్రహించారు. ఆ పదార్థానికి ఆయన లైసోజో్మ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అనేక జీవులపై ప్రయోగాలు జరిపి వానపాము ఉత్పత్తి చేసే జిగురుతోను,కోడి గ్రుడ్డు, తెల్లసొనలోను, అనేక మొక్కలలోను లైసోజోమ్స్ ఉన్నట్లు ఆయనకనుగొన్నారు.

ఒక రోజు ప్రయోగ శాలలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చొన్నాడు.ఆ సమయంలో ప్రైన్ అనే పరిశోధకులు వచ్చారు. ఆయనకు తను ప్రయోగం చేస్తున్న పెట్రిప్లేట్లో బూజును చూపించి బూజు తన చుట్టూ ఉన్న ప్రదేశంలో పసుపు పచ్చగా మారటాన్ని గూర్చి వివరించారు. అంటే బూజు స్రవించిన ద్రవం వల్ల స్టఫిలోకొకై బాక్టీరియా పెరుగుదల అరికట్టబడుతుందని వివరించారు. ప్రైసం మాత్రం ఆ విషయాన్ని అంతటితో వదలలేదు. ఆ పెరిగిన బూజుపై అనేక ప్రయోగాలు చేశారు. దాదాపు అన్ని ప్రయోగాల్లో బూజు బాక్టీరియాను చంపటం ఆయన గ్రహించారు. ఆ బూజుకు ఆయన పెనిసీలియమ్ క్రిపోజీనమ్గా భావించారు. కాని అమెరికన్ శాస్ర్తవేత్త దాయ్ ద్వారా అది పెనిసీలియమ్ నొటెటమ్ అని తెలుసుకొన్నారు.

తన ప్రయోగాశాలలో పెద్ద ఇంకు బేటర్ను తయారు చతేసుకొని రోజుకు ఇరవై క్యూబిక్ సెం.మీ బూజు స్రావాన్ని తయారు చేయగల్గారు. ఈ స్రవాన్ని ఎలుకల మీద, కుందేళ్ళమీద ప్రయోగించి ఎటువంటి దుష్పలితాలు కలగడం లేదని గ్రహించారు. తాను కనుగొన్న బూజు స్రావాన్ని అలెగ్జాండర్ ప్లెమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టారు.

అయితే ఈ పెన్సిలిన్ను శుద్ధి చేయనిదే మనుష్యుల మీద ప్రయోగించలేమని తెలుసుకొన్నారు. అయితె పెన్సిలిన్ను శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఫ్లోరి చైన్ అనే ఇద్దరు శాస్ర్తవేత్తలు తీసుకొన్నారు. పెన్సిలిన్ను కనుగొన్నది సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయితే ఆ మందు రసాయనిక స్వభావాన్ని కనుగొన్నది ఫ్లోరి, చైన్ శాస్ర్తవేత్తలు. అందువల్లనే పంతొమ్మది వందల నలభైఐదులో ఈ ముగ్గురికి కలిపి నోబెల్ బహుమతి ప్రకటించారు. పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు పన్నెండువ తేదీన ది టైమ్స్ పత్రిక సెన్సిలిన్ పై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. పంతొమ్మిది వందల నలభైరెండులో యుద్ద సమయంలో పెన్సిలిన్ చూపిన అద్భుత ఫలితాలను చూసి ప్రపంచ శాస్ర్తవేత్తలు దాని ప్రాముఖ్యతను గ్రహించారు. ఫ్లెమింగ్ అప్పటి బ్రిటిష్ రవాణా మంత్రి కలిపి పెన్సిలిన్ అవస్యకతలను వివరించి ఆయన సహాయం కోసం ఆర్థించారు. ఫలితంగా పంతొమ్మిది వందల నలభై రెండులో సెప్టంబర్ ఇరవైఐదున జనరల్ కమిటీ ఆప్ పెన్సిలిన్ ఏర్పడింది. ఐదు పెద్ద మెడికల్ సంస్థలు పెన్సిలిన్ ఉత్పత్తి చేయటానికి ముందుకు వచ్చాయి. పంతొమ్మిది వందల నలభైరెండులో అధిక మొత్తంలో పెన్సిలిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యింది. ప్రపంచ దేశాలన్నీ పెన్సిలిన్ ప్రాముఖ్యన్ని గ్రహించాయి.దానితో సర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ పేరు ప్రపంచమంతా మారు మ్రోగింది.ప్రతి రోజు ప్రశంసల ఉత్తరాల వర్షంతో నిండి పోయేది.ఆయన టెలిపోన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రశంసలతో మారు మ్రోగింది. ఆయన అవార్డుల గుర్చి వ్రాయాలంటే ఒక చాతాండంత అవుతుందంటే అతశయోక్తికాదు. దాదాపు ముఫై యూరోపియన్ మరియు అమెరికన్ యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *