అదృశ్య విశ్వంలో విజ్ఞానాన్వేషి గెలీలియో

శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు

గెలీలియో పరిశోధనలతో సూర్యకేంద్ర సిద్ధాంతానికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చర్చి సైద్ధాంతిక పునాదులు కదిలిపోవటం ఆరంభమయ్యాయి. దీనిని చర్చి భరించలేకపోయింది. విచారణ నిమిత్తం 70ఏళ్ళ వయస్సులో గెలీలియోని రోమ్‌కి పిలిపించి విచారించింది.

ప్రగతిశీలం కాలం. సంఘర్షణ దాని మూలం. పరిణామం దాని నైజం. అయితే ఏ మార్పూ అందరికీ మోదం కాదు. అందరికీ ఖేదం కాదు. కొత్త పాతల మేలు కలయిక కూడా ఎంతో సంఘర్షణ లేనివాడు కళ ఉండదు! శాస్త్రం ఉండదు! వికాసమే ఉండదు! కొందరిలో ఈ సంఘర్షణ పసిఫిక్ సముద్రమంత లోతూ, ఎవరెస్టు శిఖరమంత ఎత్తూ ఉంటుంది. దీనిని అనుభవించిన వారే దేన్నైనా సృష్టించగలరు… ఆవిష్కరించగలరు… గెలీలియో నూటికి నూరుపాళ్ళూ ఈ లక్షణాలున్న గొప్ప శాస్త్రవేత్త ఖగోళ శాస్ర్తమే కాదు చలన, శక్తి సిద్దాంతాలకు గెలీలియో అందించిన తోడ్పాటు ఎంతో ఉంది. ప్రయోగాల ద్వారా ప్రతిపాదనలకు రుజువులు చూపించిన శాస్త్రవేత్తల్లో గెలీలియో ఆధ్యుడు. కొపర్నికస్ విధంగా ఆయన రూపించారు. దాంతో చర్చి వేధింపులను భరించాల్సి వచ్చింది.

ఇటలీలోని పిసాలో 1564 ఫిబ్రవరి 15న గెలీలియోలో జన్మించారు. సైన్సుతో పాటు సంగీతం, చిత్రకళ, సాహిత్యం ఆయనకు అభిమాన విషయాలు. సూటిగా, శక్తిమంతంగా భావాలను వ్యక్తీకరించే ప్రజ్ఞ గెలీలియో సొంతం. అవివాహితుడైనా స్త్రీ ప్రేమకు ఆయన దూరంగా ఉండలేదు. తన ఇంటి బాధ్యతులు చూసే మరినా గాంబ అనే మహిళతో జీవితాన్ని పంచుకుని ముగ్గురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. మరినా వేరి వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయినా పిల్లల బాధ్యతను ఆయనే స్వీకరించారు. వైద్యశాస్ర్తాన్ని అభ్యసించటానికి 17ఏళ్ళ వయస్సులో పిసా యూనివర్సిటీలో చేరారు. సైన్స్‌తో బాటు తాత్విక, మత సిద్ధాంతాల పట్ల కూడా గెలీలియోకు ఆసక్తి ఉండేది. ఒకరోజు చర్చిలో ఉండగా పై కప్పునకు వేలాడుతున్న లైట్ల గుత్తికి ఉన్న లోలకం (పెండ్యులం) అటూ ఇటూ ఊగటంపై ఆయన దృష్టి పడింది. తన నాడీ స్పందనలను లెక్కవేసుకుంటూ లోలకం ఎలా ఊగుతుందో పరిశీలించారు. ఒకవైపు నుంచి మరొక వైపునకు లోలకం వెళ్ళి రావటానికి పట్టే సమయంలో లేడా లేదని గ్రహించారు.

లోలక చాపం పరిరిధి తగ్గినా ఒక వైపు నుంచి ఇంకో వైపునకు రావటానికి పట్టే సమయంలో మార్పులేదని అర్థమైంది. ఇది విచిత్రంగా అనిపించి ఇంటకి వెళ్ళి విభిన్న బరువులు గల వాటికి లోలకాల గమనాన్ని పరిశీలించి చూశారు. చర్చిలో పరిశీలించిన విధంగానే ఫలితాలు వచ్చాయి. దీని ద్వరా గతిశాస్త్రం (డైనమిక్స్) మౌలిక, సూత్రాలను కనుగొన్నారు. భౌతికశాస్త్ర అధ్యయనానికి గణితశాస్ర్తాన్ని ఉపయోగించటం గెలీలియోతోనే మొదలైంది. ఏ భావాన్నైనా వివేచించి సవాల్ చేయటం గెలీలియో నైజం. దీని వల్ల అధ్యాపకుల అగ్రహానికి గురైనా ఆనాడు గొప్ప గణితశాస్త్రవేత్తగా పేరుపొందిన అస్టిలియో రిస్సీ అభిమానాన్ని పొందారు. స్కాలర్ షిప్ లభించకపోవటంతో డిగ్రీ తీసుకోకుండా 1586లో ఫ్లోరెన్స్‌కి వెళ్ళారు. పట్టుదలే ప్రాణవాయివైన గెలీలియో నిరాశకు లోనుకాకుండా గణితశాస్త్రం లోతుల్లోకి వెళ్ళారు. అదే ఏడాది తన ప్రయోగాలను వివరిస్తూ కరపత్రాన్ని ప్రచురించారు. మూడేళ్ళ కాంట్రాక్టుపై పిసా యూనివర్సిటీలో గణితశాస్ర్త అధ్యాపకుడిగా 1589లో ఉద్యోగం లభించింది. తోటి అధ్యాపకులతో విభేదాలు వచ్చాయి. 1591లో తండ్రి మరణించటంతో కుటుంబ బాధ్యత నెత్తిమీద పడింది. ఒక మిత్రుడి సిఫార్సుతో పడువా యూనివర్సిటీలో మంచి జీతంతో ఉద్యోగం లబించింది. తన గణితశాస్ర్త సూత్రాలు ఆచరణలో ఎలా ఉపయోగమో చెబుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. దేశదేశాల నుంచి విద్యార్థులు వాటిని వినటానికి వచ్చేవారు. కొండల్లో తుపాకీని పేల్లచినప్పుడు వచ్చే శబ్ధం మనిషికి చేరేందుకు పట్టే సమయాన్ని నాడీ స్పందన ఆధారంగా లెక్కవేసి చెప్పేవారు. గడియారాలు లేని రోజుల్లో గెలీలియోకు మరో మార్గం లేదు. ఒకపైపును విజిల్ ఊదినట్లుగా ఊదితే వచ్చే ప్రతిధ్వనిని వర్ణించి ఎంత వేగంతో శబ్ధ తరంగాలు ప్రయాణిస్తాయో లెక్కకట్టవచ్చని చెప్పారు. జంతువుల ఎముకలని తీసుకువచ్చి గట్టి కట్టడాల నిర్మాణాలకు డొల్ల ఉన్న రాళ్ళను కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

ఎక్కువ బరువున్న వస్తువులు తక్కువ బరువున్న వాటికంటే తొందరగా నేలపై పడతాయన్న ఆరిస్టాటిల్ సూత్రీకరణను వందేళ్ళు మారుమాటకుండా అందరూ అంగీకరించారు. దీనిలో నిజమెంతో తెలుసుకోవటానికి పిసాలోని కొంచెం వాలుగా వంగిన టవర్పైకి వెళ్ళి ఒకే నమూనాలో ఉన్న పెద్ద తుపాకీ గుండునూ, మరొక చిన్న తుపాకీ గుండునూ ఒకేసారి వదిలి గెలీలియో పరిశీలించి చూశారని ఒక కథనం ఉంది. బరువులో తేడా ఉన్నా రెండు వస్తువులు ఒకే వేగంతో కింద పడతాయని గెలీలియో భావించారు. ఒక నెమలి ఫించాన్ని, రాయిని ఒకేసారి వదిలితే రాయి ముందుగా నేలపై పడటం మనుషులందరి అనుభవం. దీనికి కారణం వస్తువుల బరువుల్లో లేడా కాదని వాయు నిరోధమే కారణమని గెలీలియో ప్రతిపాదించారు. దీనినే గెలీలియో ఏకరీతి వేగవృద్ధి సూత్రంగా పరిగణిస్తారు. అడ్డంకులు లేకపోతే ఇందులో లేడా ఉండదని సూత్రీకరించారు. కొపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్థించటం కోసం భూ ఉపరితలంపై ఉన్న వస్తువులపై భూభ్రమణం ఎలాంటి ప్రభావం చూపించదని పేర్కొన్నారు. సముద్రం అటుపోటులకు భూభ్రమణమే కారణమని చెప్పారు.

టెలిస్కోప్ని గెలీలియోనే మొదట కనిపెట్టారని చెప్పటానికి కచ్చితమైన ఆధారాల్లేవు! ఫ్లాండర్స్‌లో అద్దాలను తయారు చేసే వ్యక్తి ఒక పైపులో లెన్స్‌ని అమర్చి ఎంతో సుధూర ప్రాంతాలను కూడా చూడగలుగుతున్నాడని 1609లో గెలీలియో విన్నారు. ఆ పరికరాన్ని గురించిన వర్ణనలతో గెలీలియో టెలిస్కోప్‌ని తయారు చేసుకున్నారు. టెలిస్కోప్‌తో చంద్రుడినీ, పాలపుంతలోని నక్షత్రాలనూ, గ్రహాలనూ గెలీలియో చూశారు. భూ ఉపరితలం లాగానే చంద్రుడి ఉపరితలం కూడా ఎగుడుదిగుళ్ళతో ఉందని గెలీలియో పేర్కొన్నారు. ఒకరాత్రి బృహస్పతి గ్రహం దగ్గరలో మూడు కొత్త నక్షత్రాలు గెలీలియోకు కనిపించాయి. మరి కొన్ని వారాల తర్వాత నాలుగోది కూడా ఆయనకు కనబడింది. నిజానికవి బృహస్పతికి ఉపగ్రహాలు. గెలీలియో గౌరవార్థం వాటికి గెలీలియన్ మూన్స్ అని పేరు పెట్టారు. వీటిని కనుగొనటం కొపర్నికస్ సిద్ధాంతానికి బలం చేకూర్చింది. దీంతో విశ్వానికి భూమి కేంద్రం కాకపోతే… చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్నించే వారి నోళ్ళకు తాళం పడింది. తర్వాత బుధగ్రహాన్ని టెలిస్కోప్తో నిశితంగా పరిశీలించారు. చంద్రుడి లాగే బుధుడు కూడా మొదట నెలవంక… తర్వాత పూర్ణ బింబం… మళ్ళీ నెలవంక లాగా కనపడటం ఆయనను ఆశ్చర్యపరించింది. దీంతో బుద్దగ్రహానికి కూడా స్వయం ప్రకాశం లేదన్న నిర్ణయానికి వచ్చారు. తన నిర్ధారణలను క్రోడీకరస్తూ 1610లో ద మెసెంజర్ ఆఫ్ ద స్టార్స్ గ్రంథాన్ని ప్రచురించారు. దీంతో ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

గెలీలియో పరిశోధనలతో సూర్యకేంద్ర సిద్ధాంతానికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చర్చి సైద్ధాంతిక పునాదులు కదలి పోవటం ఆరంభమయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించి 1616లో సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని రోమన్ చర్చి బహిరంగంగా ఖండించింది. 1632లో గెలీలియో డైలాగ్ ఆన్ ద టూ చీఫ్ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న గ్రంథాన్ని ప్రచురించారు. దీనిని చర్చి భరించలేకపోయింది. విచారణ నిమిత్తం 70ఏళ్ళ వయస్సులో గెలీలియోని రోమ్‌కి పిలిపించారు. క్రైస్తవ భావాలకు విరుద్ధంగా సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రబోధించి దైవ దుషకుడిగా వ్యవహరిస్తున్నారని అభియోగం మోపారు. ఒక్కసారి టెలిస్కోప్‌ని చూస్తే మీకే నిజం తెలుస్తుంది అని గెలీలియో ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. టెలిస్కోప్‌నే తప్పు పట్టారు. దైర్యంగా తన భావాలను వ్యక్తీకరించటం తప్ప గెలీలియోకు లౌక్యం తెలియదు. దోషిగా ప్రకటించి చర్చి ఆయనకు కారాగార శిక్ష విధించింది. తనను హింసించి చంపుతారనే భయంతో కొపర్నికస్ సిద్ధాంతాన్ని ఆమెదించటం లేదని గెలీలియో ప్రకటించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటికి వస్తూ ఏది ఏమైనా భూమి తిరుగుతునే ఉంటుంది అని గొణుక్కుంటూ వెళ్ళిపోయారు. కారాగారంలో పెట్టకపోయినా ఆయన రాసిన అన్నీ గ్రంథాలపై నిషేధం విధించారు. శేష జీవితమంతా గృహ నిర్బంధంలోనే గడిపి 1642 జనవరి 8న కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *