ఐజాక్ అసిమోవ్ (1920-92)

శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు

దేశం: రష్యా

విద్యాభ్యాసం: అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డి

వృత్తి: బోస్టన్ విశ్వవిద్యాలయం (అమెరికా)లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, రచనా వ్యాసంగం.

 

ముఖ్య రచనలు:

  1. Robot (1950)
  2. Naked Sun (1957)
  3. Foundation Troilogy (1963)
  4. Understanding Physics (3vols. 1966)
  5. Asimov’s Guide to Bible (2vols. 1968)
  6. Asimov’s Guide to Shakespeare (2vols. 1970)
  7. Asimov’s Guide to Science (2vols. 1972)
  8. Extra Terrestrial Civiliztion (1979)
  9. I, Asimov (Autobiography) (1991)

 

విశ్వయాత్రికుడు।

మానవ మేధాసంపత్తికి,ఆలోచనా పటిమకు, ఊహశక్తికి అవధులు లేవని తన రచనల ద్వారా చాటిన మహాజ్ఞాని ఐజాక్ ఆసిమోవ్. శాస్త్రరంగంలో సంచార విజ్ఞాన సర్వస్వంగా కీర్తి సాధించారు. అసిమోవ్‌కు వివరణలో అఖండడు అనే మారుపేరు కూడా ఉంది. జీవ రసాయనశాస్త్రంలో మాత్రమే విద్యనభ్యసించిన అసిమోవ్ ఏ విషయాన్ని గురించి రచనలు చేశారు. అని అడగడం కంటే ఏ విషయంలో చేయలేదు.. అని అనడంలో ఎంతైనా ఔచిత్యం ఉంది. ఇహం నుంచి పరం దాకా ఈ మేధావి రచించని ఇతివృత్తం. వివరించని విషయం లేదు. ఆసిమోవ్ తన రచనల్లో ఐన్ స్టైన్ సాపేక్ష సిద్ధాంతం.

 

విశ్వవ్యాపనం, డైనోసార్ భవిష్యత్తు, కాలయంత్రం నిర్మాణం, కృష్ణ బిలాలు, మర మనిషి, గ్రహాంతర సీమల్లోని నాగరికత మొదలైన విషయాలను తనదైన శైలిలో వివరించారు. మామూలు మాటలకు, భావాలకు అందని భౌతిక రసాయనిక, భూగర్భ, నక్షత్ర, జీవ, భూగోళ, గణిత, విశ్వసృష్టి శాస్త్రాల భావనలను గిమ్మిక్కులు లేకుండా సామాన్య పాఠకుడూ కూడా సులభంగా అర్థఁ చేసుకోగల రచనలు చేశారు. ఎనిమిది సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు పాల్ ఫ్రెంచ్ అనే కలం పేరుతో పుస్తకాలు రచించారు. అసిమోవ్ రచనలు వాటిని చదివేవారి ఆలోచనాసరళికి శాస్త్ర దృక్పథాన్ని నిర్ధేశిస్తాయి. ఆయన రచించిన 470పైచిలుకు గ్రంథాలు, సైన్స్ ఫిక్షన్ నుంచి బైబిల్ చరిత్ర వరకు సైన్సు పాఠ్యపుస్తకాల నుంచి షేక్‌స్పియర్ రచనలపై వ్యాఖ్యానాలు, లిమరిక్కుల వరకు, విజ్ఞాన సర్వస్వాలు, అనేక వందల వ్యాసాలు చదవడానికి ఒక జీవిత కాలం అవసరమేమో…

 

1939లో ప్రచురితమైన తొలిరచన మరోనెడ్ ఆఫ్ వెస్టా లఘు కథ నుంచి అసిమోవ్ తన ఊహల్లోని అంతరిక్ష నౌకలో అసంఖ్యాకమైన కాంతివేగాలతో పయనించి తను సృష్టించుకున్న అత్యద్బుతమైన నక్షత్ర సామ్రాజ్యాన్ని తన జీవితకాలం నిరాఘాటంగా పరిపాలించారు.అసిమోవ్ రాసిన పౌండేషన్ ఎంపీర్, రోబోట్ సిరిస్ పుస్తకాలు ఆయన దృష్టిలో మరో ప్రపంచానికి దారి చూపే వెలుగుబాటలు. ఆయన సిద్ధాంతాలు, ఆయన ప్రతిపాదించిన నాలుగు రోబోటిక్స్ నియమాలు, మనోచరిత్రకు సంబంధించిన బావనల్లాగే నూతన శకానికి నాందీ వాక్యాలు తన ఊపల్లో విశ్వాంతరాల్లోకి తొంగిచూసిన ఈ రోదసీ యాత్రికునికి నిజజీవితంలో ప్రయాణమంటే అస్సలు ఇష్టం లేదు. అమెరికాలోని మన్‌హట్టన్‌లోని తన సొంత ఇంట్లో వాక్యాల కోసం పదాలు కూర్చుకుంటూ రచనా వ్యాసంగంతో కాలం గడపడంలో ఆనందం ఉందంటారు. హేతువుకు అందని ఆహ్లాదం కలిగించే ఎల్లలు లేని లోకం మానవ మేథస్సు అని నిరూపించిన మహనీయుడు ఐజాక్ అసిమోవ్.

 

ముఖ్య భావనలు

ఎ) విశ్వంలో మహుళ లోకాలను, అక్కడి నాగరికతను ఊహించిన అసిమోవ్ నేను ఎక్కువగా ప్రయాణం చేయలేదు. ప్రఖ్యాత వ్యక్తులనూ కలవలేదు. నా రచనల్లో పాత్రల్లాగా మరణం నుంచి తృటిలో తప్పించుకోనూ లేదు. నేను చేసిందల్లా ఇక్కడ నా డెస్క్ దగ్గర కూర్చొని నా ఊపల్లో నింపాదిగా తేలిపోతూ నాకు తృప్తినిచ్చే రచనలు చేశాను అంటారు.

 

బి) నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం క్రీడల్లో సామర్థ్యం చూపేవారిని సహాధ్యాయులు అమితంగా అభిమానిస్తారు. కానీ మేథాసంపత్తిని ప్రదర్శించేవారిని మాత్రం ద్వేషిస్తారు.

 

సి) ఏదో ఉప్పటికి ఉత్తేజాన్నిచ్చే నవలలు తప్ప మానసికోల్లాసాన్ని, శాస్తానందాన్ని ఇచ్చే సారస్వతాన్ని ఈతరం వాళ్ళు ఎందుకు అభిమానించరో అర్థం కాదు. దేశం క్రమంగా దిగజారుతుంది.

 

డి) రోదసిలో నక్షత్రాల్ని చేరే పయనాన్ని వర్ణించిన అసిమోవ్ నా అంతట నేనెప్పుడూ ఆకాశంలో పయనించాలని అనుకోను. కారణం విమాన ప్రమాదం జరిగితే దానికి లభించే అసామాన్యమైన ప్రాచుర్యం. వివరణ ఎప్పుడూ విమాన ప్రయాణం చేయకూడదు అనే నా భావాన్ని బలపరుస్తాయి అంటారు.

 

ఇ) ఒక రచయిత పాఠకులకు అభిమాన రచయితగా ఎలా కాగలుగుతారు… అన్న ప్రశ్నకు మొట్టమొదటగా రచయితగా, రచనా వ్యాసంగంపై ఎనలేని వ్యామోహం, భావావేశం ఉండాలి. అంటే నా ఉద్ధేశం గ్రంథాన్ని రచించాలనే ఆలోచనకు, గ్రంథం పూర్తిచేసేనాటికి ఉన్న మధ్యకాలంలో రచయితకు అత్యంత భావావేశం ఉండాలి.

 

ఎఫ్) నేను నాస్తికుణ్ని కాకుండాఉండి ఉంటే దేవుడుని – మానవులను వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కాకుండా వాళ్ళు సాధించే జీవినవిధానాన్ని బట్టి కాపాడే రక్షకుడుగా నమ్ముతాడు. ఎప్పుడూ దేవుడూ… దేవుడూ… అని మాటల్లో స్మరిస్తూ తప్పుడు పనులు చేసే ప్రవక్తలకన్నా నిజాయితీ తత్ర్పవర్తనగల నాస్తికుణ్నే దేవుడు ఇష్టపడతాడని నా ఉద్దేశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *