పురస్కారాలు
పద్మభూషణ్ (1965)
ఇందిరాగాంధీ అవార్డు ఆఫ్ నేషనల్ సైన్స్ అకాడమీ (1980)
యునెస్కో కళింగ అవార్డు (1996)
పద్మవిభూషణ్ (2004 జనవరి 26)
ముఖ్య రచనలు
- The Structure of Universe (1977)
- Violent Phenomenon In the Universe (1982)
- From Black Clouds to Black Holes (1995)
- Seven Wonders of Cosmos (1999)
- Scientific Edge (2003)
విశ్వం ఎలా ఆవిర్భవించింది… ప్రాణికోటి ఎలా అవతరించింది… అనాదిగా మాన మేధస్సును తొలుస్తున్న ప్రశ్నలివి. వీటితోపాటు శాస్త్రజ్ఞులను ఇటీవల వేధిస్తున్న మరో ప్రశ్న… జీవం భూమి వరకే పరిమితమా… లేక గ్రహాంతరాల్లోనూ ప్రాణులున్నాయా… అన్నది.
కో పర్నికసం, గెలీలియో, న్యూటన్, ఐన్‌స్టీన్‌లతో పాటు ఆర్యభట్ట నుంచి మేఘనాథ్ సాహై, చంద్రశేఖర్ సుబ్రమణ్యం లాంటి ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు విశ్వావిర్భావానికి సంబంధించిన శాస్త్రవిజ్ఞాన అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. ఖగోళశాస్త్ర అధ్యయనం ద్వారా గ్రహాల ఉనికిని అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు ఆ తరువాత అంతరిక్ష యానాన్ని సుసాధ్యం చేశారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్దాంతానికి ఆధునిక కాలంలో జీవరసాయన శాస్ర్తం, కణజీవశాస్త్రం జత కుదిరింది. ఈ విధంగా ఖగోళ, జీవశాస్త్రాల మేలికలయికతో గ్రహాంతరాళాల్లో ప్రాణుల కోసం అన్వేష ఆరంభమైంది. దాని ఫలితమే కొన్ని రోజుల క్రితం నాసా ప్రయోగించిన మార్స్ ఎక్స్ ప్రెస్ అంగారకుడి దక్షిణద్రువంపై గడ్డకట్టిన మంచురూపంలో నీరు సమృద్ధిగా ఉందని ధ్రువీకరించడం. తర్వాత ప్రయోగించిన మార్స్ రోవర్ దానికి తోడుగా అపర్చ్యూనిటీ రోవర్ అంగారకుడిపై విజయవంతంగా దిగడంతో ఆ ప్రయోగాల ఫలితాల కోసం మానవాళి అత్రుతగా ఎదురుచూస్తోంది.
ఈ దిశలో పరిశోధనలు కొనసాగిస్తున్న శాస్త్రవేత్తల కోవకు చెందిన ప్రముఖుడు మనదేశపు ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్గీకర్. ఇటీవలే భారత ప్రభుత్వం ఈయన్ను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. శాస్త్ర అధ్యయనానికి పరిశోధనకు తెలివితేటలు మాత్రమే సరిపోవు. అసాధారణమైన విషయాలను ప్రకటించేందుకు అత్యంత ధైర్యం కూడా ఉండాలి అని భావించే నార్లీకరం జూలై 19, 1938లో మహారాష్ర్టలోని కొల్హాపూర్‌లో జన్మించారు. తండ్రి విష్ణువాసుదేవ నార్లీకర్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కుణ్ణంగా అధ్యయనం చేసిన గణితాచార్యులు. తల్లి సుమతి సంస్కృత పండితురాలు. బనారసం హిధూ విశ్వవిధ్యాలయంలో నుంచి బీఎస్సీ పట్టా. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్ర్తంలో ఎంఏ డిగ్రీ పొందిన జయంత్ విష్ణు నార్లీకర్ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ప్రెడ్ హోయల్ ఆధ్వర్యంలో కేంబ్రిడ్జి నుంచి 1963లో పీహెచ్డీ పొందారు. విద్యార్థి దశలోని మేధావిగా గుర్తింపు పొందిన నార్లీకర్ సైద్ధాంతిక భౌతికశాస్త్రానికి ఖగోళశాస్త్రానికి విశ్వసృష్టి శాస్త్రానికి ఎనలేని సేవలందిస్తున్నారు. శాస్ర్తలోకంలో ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న మహావిస్పోట సిద్ధాంతాన్ని కాదని ఇప్పటికీ తన గురువు ప్రెడ్ హోయల్తో ఉమ్మడిగా ప్రతిపాదించిన స్థిర స్థి సిద్ధాంతానికి మద్ధతిస్తున్నారు. 1966 నుంచి 1972వరకూ కేంబ్రిడ్జ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థిరాటికల్ అస్ట్రానమీలో అధ్యాపకుడిగా పనిచేసి నార్లీకర్ అప్పటికే తన మేధస్సు ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆ తరువాత స్వదేశంపై అభిమానంతో భారదేశానికి తిరిగివచ్చారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంఢమెంటల్ రీసెర్చ్‌లో 1972 నుండి 1988వరకూ అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ పూణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్గా ఉంటున్నారు.
అంతరిక్ష ప్రయోగంతో అనూహ్య ఫలితం
నార్లీకర్ జరిపిన పరిశోధనల్లో గ్రహాంతరాల్లో జీవం ఉందన్న ఆయన అంచనాకు ఈ ప్రయోగం బలం చేకూర్చింది. జనవరి 2001లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల సాయంతో హైదరాబాద్లో ఈ ప్రయోగం జరిగింది. ఇందులో బెలూన్కు అనుసంధానించిన పేలోడ్‌ను భూమి ఉపరితలం నుండి 41 కిలోమీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి ప్రయోగించి అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు. కోకస్ ఫంగల్ బాసిల్లస్‌ను పోలి ఉన్న ఈ జీవులు భూమికి సంబంధించినవి కావు. సూక్ష్మజీవులు భూమి నుంచి వాతావరణంలో ఇంత ఎత్తుకు వెళ్ళలేవు. కాబట్టి ఈ ప్రాణులు ఉతర గ్రహాలకు సంబంధించినవి అని నార్లీకర్ అంచనా వేశారు. అంటే జీవం భూమికి మాత్రమే పరిమితం కాకుండా గ్రహాంతరాళాల్లో కూడా ఉంటుందన్నది ఆయన ప్రతిపాదన అన్నమాట. ప్రాణి కోటి అవతరణ ఒక గొప్ప మలుపు తెచ్చిన ఈ ప్రయోగం ప్రస్తుతం అంగారకుడిపై జరుగుతున్న ప్రయోగాలకు నాందీ వాచకం.
సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమిపై తప్ప మానవుని ఉనికి ఎక్కడా ఉన్నట్లు అనిపించదు. విశ్వంలో ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రాణులు బూమి మీద ఉన్న జీవరాశుల రూపంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో రూపంలో ఉండవచ్చు అనే నార్లీకర్… ఆ రూపాలను ఊహించేందుకు సైన్స్ ఫిక్షన్ రచయితల సహాయ సహకారాలు అవసరం లేదని అంటారు. అనాధిగా వస్తున్న నమ్మకాలను కాదని శాస్ర్త లోకంలో కొత్త విషయాలను ఆవిష్కరించడానికి శ్రద్ధ, ఉత్సుకత, దైర్యం ఉండాలంటున్న నార్లీకర్ సైన్స్‌ని సామాన్య మానవుని ముంగిట్లోకి తీసుకువెళ్ళేందుకు మూఢవిశ్వాసాలను దూరం చేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇంగ్లీషు, మరాఠీ, హిందీ భాషల్లో సైన్సుకు సంబంధించిన అనేక కథలు, నవలలు రాయడంతోపాటు ఆయన భాషల వార్తాపత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. అంతేకాదు టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా సైన్స్‌పై అవగాహన పెంచే ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు.