కళలు విద్యలో ఒక భాగం

తల్లితండ్రుల లోకం

కళలు విద్యలో ఒక భాగం. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం,  ఇవన్ని కలగలిపి బోధించినప్పుడే తరగతిగదిలో ” లైవ్” వస్తుంది.  కాని ఇవి బోధనలో అసలు లేకుండా పోయాయి.  ముఖ్యంగా ప్రైమరి తరగతులలో ఈ కళల ద్వారా భోదించతటం చాలా అవసరం.  కాని ఇక్కడ సంగీతమంటె, నాట్యమంటె,  డ్రామా అంటె మేము వాటిని నేర్చుకోవాలికదా!  అని టీచర్లు ప్రశ్నించుకోవచ్చు. ఒక పాటని లెదా రైమ్ ను కొద్దిగా రాగయుక్తంగా పాడుతూ, భావయుక్తంగా అబినయిస్తు పాడితె చాలు.  అంతకంటె వేరే అవసరం లేదు,

ప్రతి పాఠశాలలో రైమ్స్ నేర్పిస్తున్నారు.  కాని వాటిని బట్టి పట్టించటం,  ఒప్పచెప్పమనటం జరుగుతొంది.  టీచరు ఎటువంటి ఆక్క్షన్ లేకుండా డల్ గా భావంతో పని లేకుండా చెప్పుకొని పోతున్నారు.  ఇది ప్రతి పాఠశాలలో నిత్యం జరిగే ప్రక్రియ. అలా కాకుండా కొంత వైవిధ్యంతో చెప్తే పిల్లలు బాగా ఆనందిస్తారు. టీచరుకు కొద్దిగ మక్కువ ఉంటె సరిపోతుంది.  జై సీతారాం గారు తెలుగులో ఎన్నో పాటలను సరళంగా, ప్రతి టీచరు చాలా సులభంగా పాడే విధంగా రాశారు. ఊదాహరణకు సితారాం గారి ఈ పాటను చూడండి

” పిల్లి, పిల్లి ఏమంటావ్ ?

మ్యావ్….. మ్యావ్……..

కాకి, కాకి ఏమంటావ్ ?

కావ్….   కావ్…..

ఇలా సాగుతుంది.  ఈ పాటను కొంత భావయుక్తంగా పాడితే, మీరు రెండోసారి పాడే సరికి క్లాసు నిండా పిల్లులు, కాకులు తయారౌతాయి. ఆవు….  ఆవు…. ఏమంటావ్ ?  అనగానె  క్లాసునిండా ఆవులు తయారౌతాయి. ఇంతకంటె “లైవ్” క్లాసు ఉంటుందా ? ఈచిన్న పాటలో గానం, నృత్యం, డ్రామా మూడు ఇందులొ వచ్చేశాయి.

ఇంతకు మునుపు రోజులలో “బుజ్జన గుళ్ళు” ఆటలు, అమ్మ, నాన్నా ఆటలు ఆడేవారు.  ఇప్పుడు అలాంటి ద్రుశ్యాలు మనకు ఏ ఇంట్లోను కనపడవు.  ప్రొద్దున లేచింది మోదలు ఉరుకులు, పరుగులు.  ప్రొద్దున్నే ట్యూషను, మరలా సాయంత్రందాకా బడి, మరలా సాయంత్రం ట్యూషను, హోంవర్క్ ఇలా బండగా సాగిపోతుంది.  పిల్లవాడు నేర్చుకొనె క్రమమంతా ఇలాంటి ఆటలా ద్వారానె నేర్చుకుంటాడు. బొమ్మలు పెట్టుకుని, తనలొ తను మాట్లాడుకొంటు, బొమ్మలను లాలిస్తు, జొల పాటలు పాడుతూ ఎంతో సహజంగా మాటలు, భాష నేర్చుకుంటాడు.  ఈ సహజమైన ప్రక్రియను తల్లిదండ్రులు క్రురంగా అణచి  వేస్తున్నారు.  ఒక వేళ పిల్లవాడు సహజంగా అటువంటి ఆటలు ఆడుతుంటే  “” ఏమిటిరా.. వెధవ ఆటలు ?”  అంటు వాడి సహజమైన పెరుగుదలను ఆపేస్తున్నారు. చదువు చెప్తున్నాం అంటు బండగా రుద్దించటం,రాయించటం, బండగా పలికించటం – ఇవన్ని నిత్య క్రుత్యాలే!

పిల్లలు సహజంగా నేర్చుకొనె ఈ ప్రక్రియలనె క్లాసు రూములో కూడా ఎంతొ సహజంగా నేర్పించవచ్చు.  వీటికి “లేర్నింగ్ మెథడ్స్” అని ఇంకోటని పెర్లు పెట్టాల్సిన అవసరం లేదు.  టేచరుకు కొంచెం ఇంట్రస్టు ఉంటె చాలు. ఈ కళారూపాలను వెలికి తేవచ్చు.

డ్రామా ద్వారా పిల్లవాడు భాష నేర్చుకొంటాడు.  అది ఏ భాషైనా కావచ్చు.  భాషను నేర్పించటానికి డ్రామా ను ఒక సాధనంగా మనం ఉపయొగించుకోవచ్చు.  ఆది ఏ సబ్జక్టు అయినా కావచ్చు.  ఉదాహారణకు సాంఘీకశాస్త్రంలోని పోస్టాఫీసు పాఠం తీసుకొందాం ! ఈ క్లాసు ప్రారంభించాడానికి ఒక రోజు ముందు కొన్ని పోస్టుకార్డులు, ఒక అట్ట పెట్టెకు ఎర్ర కాగితం అంటించి రెడి చేసుకొంటె సరిపోతుంది.  కొంతమంది పిల్లలను ఒకరు పోస్టుమాన్ గా,  ఇంకొకరు పోస్టుమాస్టరుగా, కొంతమంది పోస్టు కార్డులు కొనెవారుగా, మిగతా వాళ్ళు ఉత్తరాలు రాసే వాళ్ళుగా, ఇలా అందరిని నియమించండి.  అప్పుడు ఏదో ఒక విషయం మీద పిల్లలను రాయమనాలి.  ఇక్కడ భాష ఎలా ఉంది, తప్పులు ఎన్ని ఉన్నాయి అని చుడాల్సిన పనిలేదు. టీచరు ఎలా చేయాలో చెప్తె సరిపోతుంది. టీచరు ఎలాంటి ప్రయాస పడనవసరం లేదు. ఈ డ్రామా చెస్తున్నప్పుడు మాట్లాడడం ద్వారా , కార్డు లో రాస్తున్నప్పుడు భాషను నేర్చుకుంటారు.  ప్రక్కరోజు ఇదే విషయాన్ని చర్చించి, ఆ విషయన్ని నాటకంగానో, వ్యాసంగానో రాయమని చెప్పండి.  ఇక ప్రశ్న జవాబులతొ పని ఏముంటుంది?  “పోస్టుకార్డు…  పోస్టుకార్డు…. పోయివస్తావా…..ఢిల్లినుంచి…. గల్లిదాకా పోయివస్టావా……….అని జై సీతారామ్ పాటతో ఆనాటి క్లాసు ను ముగించవచ్చు.  ఇక ప్రశ్న జవాబులతో పని ఏముంటుంది ?

ఒక కథను డ్రామా లాగ చేయించటమ్, ఆ కథనే మరలా రాయమనటం చేసినప్పుడు బట్టిపట్టే విధానంతో పని ఏముంటుంది ?  మనకు భాషను చక్కగా మాట్లాడడం, రాయటం, చడవటం కావాలి.  ఇవన్ని ఈ ప్రక్రియ ద్వారా జరిగిపోతాయి.  ఇక భాష గురించి ప్రత్యేక క్లాసులు అవసరమ్ ఉందా ?

 

ఇదే విషయాన్ని మాథ్స్ క్లాసులో కూడా చేయవచ్చు.  క్లాసు రూమును ఒక చిల్లర కొట్టు గానో, ఫాన్సి షాపుగానో మార్చి వేయండి.  బోర్డు మీద కొన్ని వస్తువుల పేర్లు గాని, బొమ్మలు గాని వేసి, ప్రక్కన వాటి ధరలు వేయండి.  ఇప్పుడు పిల్లలను వాళ్ళకు కావల్సిన వస్తువులను ఎంచుకొని పట్టీలను తాయారు చేయమనండి. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కో పట్టి తాయారు చేస్తాడు.  క్రింది ఉదాహారణలను గమనించండి.

 

పెన్సిలు        –            ౩ -౦౦                                      రబ్బరు        –            ౨ -౦౦

స్కేలు         –            ౪- ౦౦                                      స్కేలు         –            ౪- ౦౦

 

పై న చూపిన విధంగా ఏన్నొ రకాల కూడికలు తయారౌతాయి.  నీవు పది రూపాయలు తీసుకొని వెళ్ళవు. ఇక ఎంత మిగులుతుండి ? అని అడిగినప్పుడు భాగహారం కాడా నేర్పించవచ్చు.  కొన్ని వస్తువులను ఉంచి, వాటికి ధరల పట్టిలను ఉంచి పట్టిలను తయారు చేయమనవచ్చు.  దీన్నంతా కొనేవాళ్ళుగా, అమ్మే వాళ్ళుగా ఒక డ్రామా లాగా క్లాసు రూములో చేయించవచ్చు.  ఇలా ప్రతి క్లాసులొను, సబ్జక్టులొను కళలను ఉపయొగించుకోంటు పాఠాలు చెప్పవచ్చు.

టీ.వి. రామకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *