ఆకాశయానాన్ని సాధ్యం చేసిన రైట్ సోదరులు

శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు

రెప్పపాటులో ఆకాశంలోకి ఎగిరి అంతరిక్షం అంతుచూసి, భూమండల పరిధుల్ని చుట్టి రావాలన్న కోరిక మనిషికి యుగాల నుంచీ ఉంది. అయితే అది నెరవేరటానికి మరెన్నో యుగాలు ఆగాల్సిన వచ్చింది.ఒక మనిషిలో పుట్టిన కోరిక అతనికే పరిమితం కాదు. అదొక జ్వాలలా అందరినీ తాకుతుంది. అప్పుడే దానిని సాధించటానికి అవసరమైన సామాజిక శక్తి సిద్ధిస్తుంది. ఆకాశయానం విషయంలో రైట్ సోదరుల రూపంలో ఆశక్తి వెల్లడైంది.

మనిషికి మొదట అలవడేది అనుకరణ విద్య, అనుకరణ లేనిదే మనిషి మనిషి కాలేడు. పక్షుల కిలకిలారావాలు… సెలయేటి గలగలలు.. అరణ్యాల్లో సింహ గర్జనలు… ఆకాశాన హరివిల్లులు… లక్ష నక్షత్రాల వులుగు… కోటి జలపాతాల పాటలు… శతకోటి కడలి తరంగాల మోతలు… మనిషికి కనిపిస్తాయి, వినిపిస్తాయి. జిజ్ఞాసను రేపుతాయి. సమస్త ప్రకృతి శక్తులూ తనలో అవహించి అమేయ బలసంపన్నుడు కావాలని మనిషి తపనపడతాడు. సంగీతాన్ని, మంత్ర తంత్రాలను, విజ్ఞానాన్ని, కళలనీ మనిషి ఈ తపనతోనే సృష్టించాడు. ఇప్పటికీ వృద్ధి చేస్తున్నాడు. రెప్పపాటులో ఆకాశంలోకి ఎగిరి అంతరిక్ష అంతుచూసి, భూమండల పరిధుల్ని చుట్టి రావాలన్న కోరికి మనిషికి యుగాల నుంచి ఉంది. అయితే అది నెరవేరటానికి మరెన్నో యుగాలు ఆగాల్సి వచ్చింది. ఒక మనషిలో పుట్టిన కోరిక అతనికే పరిమితం కాదు. అదొల జ్వాలలా అందరినీ తాకుతుంది. అప్పుడే దానిని సాధించటానికి అవసరమైన సామాజిక శక్తి సిద్ధిస్తుంది. ఆకాశయానం విషయంలో రైట్ సోదురుల రూపంలోఆశక్తి వెల్లడైంది. ఏరో డైనమిక్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇంజిన్, డిజైన్, ఇంధన సాంకేతిక పరిజ్ఞాన అభివృదగ్ధి కీలక దశకు చేరుకున్న సమయంలో రైట్ సోదురులు తమ పరిశ్రమను ఆరంభించారు. ఇద్దరూ ఆజన్మాంతం బహ్ర్మచారులుగానే జీవించారు. పని, పరిశోధనే ఊపిరిగా బతికారు. గాలిలోకి మనిషి నిపాయంగా ఎగిరి విహరించి రావాలి. దేశాల ఎల్లలను నిమిషాల్లో, గంటల్లో మనిషి దాటాలి. దీన్నెలా సాధించాలి? వారి మనస్సుల్లో నిరంతరం ఇవే ఆలోచనలు! ఇవే ప్రశ్నలు!

1867 ఏప్రిల్ 16న విల్‌బర్గ్ రైట్, 1871 ఆగస్టు 19న ఆర్‌విల్లే రైట్ జన్మించారు. తండ్రి చర్చి బిషప్. చిన్నతనం నుంచీ ఇద్దరికీ యంత్రాల మర్మాన్ని తెలసుసుకోవాలన్న గాఢమైన ఆసక్తి ఉండేది. స్వీయ విద్యతో మెట్టుమెట్టుగా ఎదిగారు. మొదటగా ముద్రణా యంత్రాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త డిజైన్‌ని రూపొందించారు. ఆ తర్వాత సైకిళ్ళు అమ్మే వ్యాపారాన్ని చేపట్టారు. ఎవరో తయారు చేసిన సైకిళ్ళని అమ్మటం ఎందుకని… సొంతంగా సైకిళ్ళను రూపొందించి అమ్మకాలను ఆరంభించారు. విమానాలను రూపొందించటానికి చేసిన ప్రయోగాలకు అవసరమైన డబ్బు ఈ వ్యాపారం వల్లే సమకూరింది.  ఇంజిన్ లేని విమానాలను (గ్లైడర్స్) రూపొందించి ఎన్నో ప్రయోగాలు చేసిన జర్మనీ శాస్త్రవేత్త ఒట్టో లిలెన్‌తాల్‌ 1896లో మరణించటం వారిని కదిలించింది. లిలెన్ తాల్‌ ప్రయోగాలపై వచ్చిన పుస్తకాలను వారు అప్పటికే చదివారు. విమానాన్ని గాలిలో ఎగిరించగలం, గాని దాని గమనాన్ని మనకు కావలసిన ట్లుగా నియంత్రించ లేకపోతున్నాం. లిలెన్‌తాల్‌ మరణానికి అదే కారణమని వారు నిర్ణయానికి వచ్చారు. పక్షులు గాలిలో తమకు ఇష్టం వచ్చిన దిక్కులకూ, కిందికి పైకి ఎలా సురక్షితంగా ప్రయాణించ గలుగుతున్నాయని నెలల తరబడి ఇద్దరూ ఆలోచించారు. వైమానిక విజ్ఞానంపై అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని మొత్తం చదివారు. 1899లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఆకాశంలో విమానం విజయవంతంగా ప్రయాణించాలంటే మూడు అక్షాలపై నడిచే విధంగా దానిని రూపొందించాలని భావించారు. విమానం పైకి ఎగరాలన్నా… కిందకి దిగాలన్నా… ఒక వైపు నుంచి మరొక వైపునకు తిరగాలన్నా… పక్షిలాగా రెక్కల మాదిరిగా పనిచేసే సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందించాలని అనుకున్నారు. ఏకకాలంలో రెండు, మూడు పనులు జరగటానికి కూడా ఇది అత్యవసరమని భావించారు. ఇందుకోసం మొదట విమాన యానాన్ని నియంత్రించగలగాలి. రెక్కలను నిర్థిష్ట పద్ధతిలో కదపటం ద్వారా పక్షులు ఆకాశంలో తమ కదలికలని నియంత్రించుకోగలుతున్నాయని భావించారు. 1899లో రైట్ సోదరులు ఒక రెక్కపై మరో రెక్క ఉండే యంత్రాన్ని తయారు చేశారు. యాంత్రికంగా రెక్కల కదలికలని నియత్రించే ఉపకరణాలను కూడా దానికి అమర్చారు. దీంతో కావాలనుకుంటే ఒక వైపు పైకి, మరో వైపు కిందకి అది ఒరగటానికి లీలైంది. ఒక దిశ నుంచి మరో దిశకు తిరగటానికి కూడా మార్గం సుగమమైంది. గాలి ఒత్తడి కారణంగా అవసరమనుంటే యథాతథ స్థితికి రావటానికి సాధ్యపడింది. యాంత్రిక శక్తితో నడిచే విమానాన్ని రూపొందించటానికి ముందుగా 1900, 1901, 1902 సంవత్సరాల్లో ఒక రెక్క ఉండే మూడు గైడర్లని తయారు చేశారు. మూడో దానిని  మాత్రం అన్ని కదలికలను నియంతా్రించే విధంగా రూపొందించారు. కిందకి దికటానికి, పైకి ఎగరటానికి వీలుగా ఎలివేటర్‌ని కూడా అమర్చారు. యాంత్రిక శక్తితో నడిచే విమానాన్ని తయారు చేయటానికి వారు ఎన్నో ఇబ్బందులని అధిగమించాల్సి వచ్చింది. శక్తిమంతంగా పని చేసే ప్రొపెల్లర్స్‌ని స్వయంగా డిజైన్ చేసి రూపొందించారు. తేలికపాటి ఆటోమొబైల్ ఇంజిన్ కూడా స్వయంగా రూపొందించుకోవాల్సి వచ్చింది. మార్కెట్లో ఉన్న ఆటోమొబైల్ ఇంజిన్లు విపరీత బరువుతో ఉండేవి. చివరి ఎలాగైతేనేం ఇంధన శక్తితో నడిచే విమానాన్ని తయారు చేశారు. కిల్ డేవిల్ హిల్స్ దగ్గర దానిని ప్రయోగించారు. మనిషి వేల ఏళ్ళ నుంచి నిరీక్షిస్తున్న అద్భుత ఘడియలు చూడాల్సిందిగా రైట్ సోదరులు ప్రజలని కోరారు. గాలిలోకి ఎగరటం ఏమిటీ? అంటూ చాలా మంది పెదవి విరిచారు. ఐదుగురు మాత్రం వచ్చారు. 1903 డిసెంబర్ 17న ఉదయం విమానం గాలిలోకి ఎగిరింది. మొటిసారి 12సెక్లను మాత్రమే ప్రయాణించింది. చివరి సారి 59 సెకన్లలో 852 అడుగుల దూరం ప్రయాణించింది. ఈ అద్భుత ప్రయోగాన్ని ప్రపంచం మొదటి పట్టించుకోలేదు. రెండోసారి ప్రయోగానికి రైట్ సోదరులు పత్రికా విలేఖరులను ఆహ్వానించారు. వారు కూడా రైట్ సోదురుల ప్రయోగంపై అపనమ్మకంతోనే వచ్చారు. దురదృష్టవశాత్తు అప్పుడే ఇంజిన్‌లో లోపం తలెత్తి విమానం ఎగరలేదు. రైట్ సోదురుల ప్రయోగంలో పసలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయినా నిరాశపడకుండా మళ్ళీ విమానాన్ని ఎగిరించారు. చుట్టు పక్కల ప్రజలు దానిని చూడటానికి వచ్చేవారు. 1904లో మెరుగైన ఇంజిన్తో మరో విమానాన్ని తయారు చేసి ప్రయోగం చేశారు. విమానాన్ని టాస్ వేసి రైట్ సోదరులు  తేల్చుకునేవారు. 1905లో మరింత మెరుగైన విమానాన్ని తయారు చేశారు. ఎటుకావాలనుకుంటే అటు తిరిగి, అరగంట సేపు గాలిలో ప్రయోణించగలిగేలా దానిని రూపొందించారు. సైకిల్ వ్యాపరంలో వచ్చిన డబ్బనంతా విమానాల తయారీకే ఉపయోగించారు. పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని భావించారు. ఇతరులు తమ విమాన తయారీ పరిజ్ఞానాన్ని తెలుసుకుని పేటెంట్ హక్కలు పొందే అవకాశం ఉందన్న భయంతో మూడేళ్ళ పాటు తమ బహిరంగ ప్రయోగాలని నిలిపివేశారు. కొత్త విమానాలను, ఇంజిన్లను తయారు చేసినా గోప్యంగా ఉంచారు. మరోవైపు అమెరికా రక్షణశాఖ రైట్ సోదరుల ప్రయోగాలు మిలిటరీ ప్రయోగాలకు పనికి రావని తేల్చి చెప్పింది. యూరప్లో వారి ప్రయోగాలకు మంచి ఆదరణ లభించింది. విమానాల తయారి కోసం యూరప్‌లో ఒక ఒప్పందం కుదిరింది. అమెరికా రక్షణశాఖ కూడా చివరికి రైట్ సోదురుల విచిత్ర యంత్రాన్ని కొనటానికి అంగీకరించింది. 1908 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ వందసార్లు తమ వైమానికి ప్రయోగాలకు రైట్ సోదురులు చూపించారు. ఇతరులని కూడా విమానంలో తీసుకెళ్ళారు. ఎక్కువలో ఎక్కువగా రెండు గంటల ఇరవై నిమిషాల పాటు విమానాన్ని నడిపారు. నిరంతర ప్రయోగాలతో వైమానికి విజ్ఞానంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావటంతో 1909 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు వచ్చింది. పలు దేశాల్లో విమానాలని ప్రయోగించి చూపారు. 1911 వరకూ విమానాల తయారీలోవారికి తురుగు లేదు. తర్వాత క్రమంగా యూరప్ దేశాలు సొంతగా విమానాలను తయారు చేసుకోవటం ఆరంభించాయి. టైఫాయిడ్ జ్వరంతో విల్‌ బర్గ్ 1912లో చనిపోయారు. 1948 వరకూ జీవించిన ఆర్‌విల్లే వైమానిక శాస్ర్త అభివృద్ధికి ఎంతోగానో తోడ్పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *