అపర ధన్వంతరి ఎల్లాప్రగడ సుబ్బారావు

శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు

ఒకనాడు ప్రాణాంతకంగా నిల్చిన ‘స్ర్పూ’ వ్యాధి ప్రస్తుత తరానికి తెలియకుండా పోవటానికి మూల కారకుడు సుబ్బారావే. బోదకాలు, ఇసినోఫిలియా వంటి వ్యాధులకు ఉపయోగపడే ‘హెట్రాజెన్’, క్షయవ్యాధి నివారణిగా పేర్కొనే ‘ఇనోనెక్స్’, కలరా. టైఫాయిడ్, ప్లేగు, అతిసారం…. తదితర వ్యాధులకు దివ్యౌషధంలా ఉపయోగపడే ‘టెట్రాసైక్లిన్’ యాంటీ బయాటిక్‌లతో పాటు పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్‌ను అరికట్టే ‘మెథాట్రెక్సేట్’లు సుబ్బారావు అవిరళ పరిశోధనల ఫలాలు.

 

వైద్యశాస్త్రంలో ప్రతిఏటా నోబెల్ బహుమతిని ఎంపిక చేసే స్టాక్ హోంలోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోకి అడుగుపెట్టగానే అందర్నీ ఆకర్షిస్తుందో తైలరవర్ణ చిత్రం. ఎంతగొప్పవాడో… ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందో… అనుకుంటారు చూసినవాళ్ళంతా. గొప్పవాడేగాని ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. బహుశాల అందుకు ప్రాయశ్చిత్తంగా ఫోటో తగిలించారేమో! ఆ మహనీయుి పేరు ఎల్లప్రగడ సుబ్బారావు. బీదరికంలో పుట్టి ఆకుంఠిత దీక్షతో భీమవరం నుంచి బోస్టన్‌చేరి జీవితాన్ని వైద్య పరిశోధనలకు అంకింతం చేసిన తెలుగు బిడ్డ ఎల్లాప్రగడ. ఎన్నో వ్యాధులకు దివ్యౌషధాలు కనిపెట్టిన అపర ధన్వంతరి!

ఎల్లాప్రగడ సుబ్బారావు 1835 జనవరి 12న పశ్చిమగోదావరి జిల్లా బీమవరంలో జన్మించాడు. ఏడుగురు సంతానంలో సుబ్బారావు నాలుగోవాడు. తండ్రి జగన్నాథం రెవెన్యూ ఇన్‌స్పక్టర్గా పనిచేసి గడువుకు ముందే పదవీ విరమణ చేయటంతోకుటుంబం బొటాబొటీ సంపాదనతో భారంగా గడిచేది. పాఠశాలకు వెళ్ళాలంటే సుబ్బారావుకు బండలు మోసినంత కష్టంగా ఉండేది. తరచూ క్లాసులు ఎగ్గొట్టి పారిపోయి వచ్చేసేవాడు. కాశీలో తీర్థయాత్రికులకు అరటి పళ్ళమ్మితే లక్షల రూపాయలు సంపాదించవచ్చని విని పదమూడేళ్ళ వయస్సులో బంధువుల కుర్రాడితో కలసి కాశీ పారిపోయేందుకు యత్నించాడు. తల్లి వెంకమ్మ ఆ యత్నాన్ని వమ్ము చేసింది. జగన్నాధం ఆరోగ్యం దెబ్బతినటంతో కుటుంబం మోదుకూరుకు మారింది. 1911లో మెట్రిక్యులేషన్ పరీక్షల్లో సుబ్బారావు ఫెయిల్ అయ్యాడు. దీంతో రాజమండ్రి ఉంటున్న పెద్దన్నయ్య పురుషోత్తం వద్దకు పంపించారు. అక్కడే చిలకమర్తి లక్ష్మీనరసిహం, కందుకూరి వీరేశలింగంగార్ల శిష్యరికం లభించింది. కానీ మెట్రిక్యులేషన్ పరీక్షలో మాత్రం మళ్ళీ తప్పాడు. అయినా తల్లి పట్టు విడవకుండా సుబ్బారావును ఎంతో కష్టపడి మద్రాసులోని పిందు హైస్కూల్‌కు పంపించింది. 1913లో తండ్రి చనిపోవటంతో సుబ్బారావు చదువు అర్థంతరంగా ఆగిపోయేలా కన్పించింది. అయితే తల్లి తన పుసైలతాడు అమ్మి సుబ్బారువు ప్రయాణానికి మద్రాసులో చదువుకు డబ్బు సమకూర్చింది. దీంతో చలించిపోయిన సుబ్బారావు మళ్ళీ జీవితంలో ఎన్నడూ పరీక్ష తప్పలేదు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా పాసయ్యాడు. గణితంలో డిస్టింక్షన్ వచ్చింది. అంతా గణితం ఆనర్స్ చేయమని ప్రోత్సహించినా తాను మాత్రం మాద్రాసు మెడికల్ కాలేజీలో చేరాడు. తద్వారా డాక్టరై సన్యాసిగా రామకృష్ణమిషన్‌లో సేవలందించాలన్నది ఆశయం. తల్లి అనుమతి ఇవ్వకపోవటంతో సన్యాసి కావటానికి వీల్లేకపోయింది. దీంతో మెడిసిన్‌పై దృష్టినిలిపాడు. కాలేజీలో టర్మ్ ఫీజు కట్టాడానికి డబ్బులేకపోవడంతో కాకినాడలో బంధువుల వద్దకు వెళ్ళారు. ఆనపర్తికి చెందిన కస్తూరివారి కుటుంబం సాయం చేయటానికి అంగీకరించి, తమ అమ్మాయి శేషగిరిని పెళ్ళి చేసుకోవాలని కోరింది. ఏ విషయం చెప్పకుండానే సుబ్బారావు మద్రాసు తిరిగివచ్చాడు. హఠాత్తుగా స్ర్పూ వ్యాధి (ఆహారనాళల్లో పండు) బారినపడ్డాడు. ఆ కాలంలో స్ర్పూ వచ్చిందంటే బతకటం కష్టమనేవారు.ఆయితే ఆయుర్వేద మందులతో సుబ్బారువు ఎలాగోలా గట్టెక్కాడు. తర్వాత 1919, మే 10న పన్నెండేళ్ళ శేషగిరితో సుబ్బారావు వివాహమైంది.కట్నం కింద రూ. 1200లు ఇచ్చారు.

గాంధీజీ సహాయనిరాకరణోద్యమంతో ప్రభావితుడైన సుబ్బారావు విదేశీ దుస్తుల్ని బహిష్కరించారు. ఖద్దరు ధరించి కాలేజీకి వెళ్ళారు. దీంతో శేవతజాతీయుడైన సర్జరీ ప్రొఫెసర్ సుబ్బారావుపై మండిపడ్డారు. చివరరకు అన్నింటిలో మంచి మార్కులతో పాసైన సుబ్బారావుకు సర్జరీలో మాత్రం బొటాబొటి మార్కులు వేశారు. ఫలితంగా ఎం.బి.బి.ఎస్. డిగ్రీ కాకుండా అంతకన్నా తక్కువదైన ఎల్.ఎం.ఎస్ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ప్రాక్టీసు కన్నా పరిశోధనపై దృష్టిపెట్టిన సుబ్బారావు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో పైచదువుల కోసం భారతీయులంతా బ్రిటన్‌కు వెళ్ళేవాళ్ళ కాని బ్రిటిషర్లంటే గిట్టని సుబ్బారావు మాత్రం అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. హార్వర్డ్ మెడికల్ కాలేజీకి లేఖరాశారు. సానుకూలంగా స్పందన వచ్చింది. కానీ చేతిలో డబ్బులేదు. ఇంతలో దురదృష్టవశాత్తూ అన్నయ్య పురుషోత్తం స్ర్పూ వ్యాధితో మరణించారు. వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా అదేవిధంగా కన్నుముశాడు. ఈ రెండు మరణాలు సుబ్బారావును తీవ్రంగా కలచివేశాయి. ఎలాగైనా ఈ వ్యాధికి మందుకనుగొనాలనే పట్టుదల సుబ్బారావులో పెరిగింది. కొన్నాళ్ళపాటు మద్రాసులోని ఆయుర్వేద కాలేజీలో పనిచేశారు. అప్పుడే శేషగిరి కాపురానికి వచ్చింది. ఆయుర్వేద కాలేజీలో పరిశోధనలకు అనువైన వాతావరణం లేని కారణంగా రాజీనామా చేసి సుబ్బారావు అమెరికా వెళ్ళే యత్నాలు మొదలెట్టారు. మామగారి కుటుంబం సాయం చేయటంతో పాటు కాకినాడలోని ఓ ఛారిటీ సంస్థ ఆదుకోవటంతో 1923 సెప్టెంబరులో అమెరికాకు ప్రయాణమయ్యారు. బీమవరం నుంచి బోస్టన్ వెళ్ళిన సుబ్బారావు మళ్ళీ భారతావనిపై మునితేలుతూ ఎల్లలు మరిచిపోయారాయన. సుబ్బారావు వెళ్ళిన కొన్ని నెలలకు శేషగిరి మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ తొమ్మిది నెలలు బతికి మర్పి వ్యాధితో మరణించాడు. ఈ వ్యాధికి కూడా తర్వాతి కాలంలో సుబ్బారావే వాక్సిన్‌ను కనుగొన్నారు.

తన దగ్గరున్న డబ్బులు ఎందుకూ సరిపోవన్న విషయం అమెరికాలో అడుగుపెట్టాకగాని సుబ్బారావుకు అర్థం కాలేదు. దీంతో బోస్టన్‌లోని ఒక ఆస్ప్రత్రిలో మూత్రశాలల్ని, పేషెంట్ల బెడ్‌పాన్లను శుభ్రం చేయటంలాంటి పనిలో చేరారు. రాత్రంతా కష్టపడుతూ పగలంతా కాలేజీలో చదువుతూ ఒక్కోమెట్టేపైకెక్కారు. తన ప్రతిభతో ప్రొఫెసర్ల మన్నన పొందుతూ స్కాలర్‌షిప్లు సాధిస్తూ పరిశోధనలు సాగించారు. 1924లో తొలిసారిగా సుబ్బారావు పేరు ప్రపంచానికి తెలిసింది. డాక్టర్ ఫిస్కే సాయంతో శరీర కణాల్లోని భాస్వరాన్ని సరిగ్గా, తేలిగ్గా నిర్థారణ చేసే రేపిడ్ కెలొరిమెట్రిక్ మెథడ్ను ఆవిష్కించారు. ఇదే ఫిస్కే సుబ్బారావు పద్ధతిగా పేరొందింది. ఆ తర్వాత శరీరంలోని కఁడరాల శక్తికి మూలపదార్థం ఆడినోసిన్ ట్రై ఫాస్పేట్ (ఎ.టి.పి) అని నిర్థారించి, జీవరాశి భౌతిక ప్రక్రియలను నిర్ణయించేది ఇదేనని వెల్లడించారు. 1922లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు తప్పని దీంతో రుజువైంది. అయినా సుబ్బారావుకు నోబెల్ బహుమతి లభించేలదు. 1930లో సుబ్బారావు హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి పి.హెచ్.డి పట్టా పొందారు. తన పరిశోధనలన్నీ ఒకెత్తైతే ఉష్టప్రాంతాల్లో వ్యాపించే స్ర్పూ వ్యాధిని అరికట్టే ఫోలిక్ యాసిడ్ విటమిన్‌ను కనుగొనటం సుబ్బారావు జీవితంతో అత్యంత ఆనందమయమైన ఘటన. ఒకనాడు ప్రాణఆంతకంగా నిల్చిన స్ర్పూ వ్యాధి ప్రస్తుత తరానికి తెలియకుండా పోవటానికి మూల కారకుడు సుబ్బారావే. అంతేకాదు… బోదకాలు, ఇసినోఫియాలియాల వంటి వ్యాధులకు ఉపయోగపడే హెట్రాజెన్, క్షయవ్యాధి నివారిణిగా పేర్కొనే ఇనోనెక్స్, కలరా, టైఫాయిడ్, ప్లేగు, అతిసారం తదితర వ్యాధులకు దివ్యౌషధంలా ఉపయోగపడే టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్లతో పాటు పిల్లలో బ్లడ్ కాన్సర్‌ను అరికట్టే మెథాట్రెక్సేట్, అరియోమైసిన్‌లు సుబ్బారావు అవిరళ పరిశోధనల ఫలాలు ఎన్ని ఆవిష్కరణలు చేసిన ఎన్నడూ తనకూ అవార్డులు రావాలని గానీ, పేరురావాలని గానీ సుబ్బారువు పాకులాడలేదు. లేడర్లే సంస్థ సుబ్బారావును డైరెక్టర్గా నియమించింది. తుదిశ్వాస విడిచేదాకా ఆయన సంస్థ డైరెక్టర్గా ఉన్నారు. అక్కడే ఎన్నో పరిశోధనలు చేశారు. లేడర్లే సంస్థ తయారు చేసిన కొన్ని యాంటీబయోటిక్‌లకు సుబ్బామైసిన్, సుబ్బరోమైసిన్ అని పేరు పెట్టుకునా్నరు. సుబ్బారావు మరికొన్నాళ్ళు బతికుంటే కాన్సర్‌ను కూడా మానవాళి కట్టిపడేసేదేమో! మరి కొన్నాళ్ళు దేవుడు చల్లగా చూస్తే మనం మరో వ్యాధిని నివారించగలం అన్న సుబ్బారువు… 1948 ఆగస్టు 9న నిద్రలోనే గుండెపోటుతో శాశ్వతంగా కన్నుమూశారు. ఈ శతాబ్ధపు మేటి వైద్యనిపుణుడిగా… సుబ్బారావును భారతీయ పత్రికలు మాత్రం తగిన గౌరవమివ్వలేదు.

మళ్ళీ ఆయన్ను కలుసుకునే భాగ్యం నాకు లేపోతేపోయింది. నాతో పెళ్ళి కారణంగా ఆయన జీవితలక్ష్యం నెరవేరి, మానవాళికి మహోపకరం జరిగింది. ఇంత కన్నా నాకేం కావాలి! అని తాత్వికంగా మనసు కుదుటుపర్చుకున్నారు శేషగిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *