ఇ-మెయిల్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్

ఇ-మెయిల్

21వ శతాబ్ధంలో ఇ-మెయిల్ అంత ప్రాచుర్యాన్ని పొందిన వైజ్ఞానికి విషయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం మొత్తానికి క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నది. ఈ-మెయిల్. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రచార సాధనాలు, క్షణాల్లో సమాచారాన్ని అందించగల్గుతున్నారు. తిరిగి అందుకో గల్గుతున్నారు. పెన్ను, కాగితాలు, స్టాంపులు, పోస్టింగ్ ఏవి అవసరం లేకుండా సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా చేరుతుంది. అయితే మీకు పర్సనల్ కంప్యూటర్ అయినా ఉండాలి. లేదా ఇంటర్ నేట్ సెంటర్‌లోనైనా ఈ సేవను పొందవచ్చు.

ఈ ఇ-మెయిల్ వ్యవస్థ 1971లోనే రూపొందింది. అంటే ఇప్పటికి 33 సంవత్సరాలన్నమాట. అయితే మన దేశంలో మాత్రం 1990లో ప్రవేశించింది. ఎలక్ట్రానిక్ మెయిల్ లేదా ఇ-మెయిల్‌ను 1971లో అమెరికన్ ఇంజనీర్ రే- టామ్లమిన్సన్ రూపొందించారు. ఈయన ఇ-మెయిల్ పితామహునిగా పేరొందారు. అయితే అన్ని ఆవిష్కరణలలాగే ఇ-మెయిల్ కూడా మొదట ఆదరణకు నోచుకోలేదు. ఆయన ఆవిష్కరణకు పేటెంట్ ఉంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడై ఉండేవాడు. ఆయన ఆవిష్కరణకు మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ రూపు రేఖలనే మార్చేసింది.

ఇ-మెయిల్ రూపకల్పనకు తాను పెద్ద కష్టపడిందేమి లేదని వినయంగా సమాధానమిస్తారు. టామ్ విన్సన్ తాను కేవలం 200 లైన్ల ప్రోగ్రామ్ కోడ్ తో దీనిని రూపొందించినట్లు ఆయన చెబుతారు. ఇప్పుడు పర్సనల్ నేమ్ ను ఇ-మెయిల్ కోడ్‌లో వేరు చేస్తున్న @ (at)ను కూడా ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఫైళ్ళు బదిలీకి ఒక ప్రోగ్రామ్‌ అవసరం ఏర్పడడం, అస్తవ్యస్థ సమాచార వ్యవస్థ, తన ప్రేరణకు కారణమని ఆయన తెలియజేశారు. మొదట తను రూపొందించిన ప్రోగ్రామ్‌లో సమస్య తలెత్తింది. తాను పంపిన మెసేజ్ను అందుకొనేందుకు అవతలి కంప్యూటర్‌లో మెయిల్ బాక్స్ ఉండాలని అప్పుడే సమాచారం చేరగల్గుతుందని తెలుసుకున్నారు. మొట్ట మొదట యు.యస్ రక్షణ శాఖకు రూపొందించిన ఎ.పి.ఆర్.ఎ.నెట్-ను రూపొందించిన ప్రోగ్రామ్‌ విజయవంతంగా పనిచేసింది. అయితే ఎ.పి.ఆర్.ఎ నెట్ వాడకం దార్లు కేవలం వందల సంఖ్యలో ఉండేవారు. అందువల్ల అంతగా ప్రజాదరణ పొందలేదు. అంతే కాకుండా అప్పటి మోడెమ్ వేగం కూడా 300 బడ్స్ కావటం కూడా అప్పటి వైఫల్యానికి ఒక కారణం.

1972లో అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ రీసెర్చి ప్రాజెక్టును చెందిన లారెన్స్ రాబర్ట్స్ అనే కంప్యూటర్ ఇంజనీరింగ్ మెయిల్స్ అన్నింటిని ఒక క్రమ పద్దతిలో రూపొందిచే విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత అనేక కంెపనీలు వాణిజ్య పరంగా ఇ-మెయిల్‌ను ఉపయోగించుకోవటం ప్రారంభించాయి. మొదట్లో మెయిల్ ద్వారా టెక్ట్స్‌ను మాత్రమే పంపటానికి వీలుండేది. ా తర్వాత ఫోటోలు, వీడియో, ఆడియో, పైల్సును కూడా పంపేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించారు. 1980ల వరకు ARPANET ప్రాజెక్టును నిర్వహించింది. ఆ తర్వాత కూడా టామ్లిన్‌సన్ అదే కంపెనీల ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. 65ఏళ్ళ వయస్సు గల టామ్లిన్‌సన్‌ రోజుకు షుమారు 90మెయిల్స్‌ను వరకు చదివి సమాదానాలిస్తుంటారు.

వాణిజ్యపరంగా ఈ మెయిల్స్‌ను తొలిసారిగా అందించినది కంప్యూ సర్వ్ కంపెనీ. 1989ఈ కంపెని వినియోగదారులు ఐదు లక్షల మంది ఉన్నారు.

ఇప్పుడు 20 రెట్లు వేగంతో (56.6kbps) మోడెమ్లు తయారవుతున్నాయి. 1980లో పర్సనల్ కంప్యూటర్‌లు జనాదరణ పొంమదటంతో ఇ-మెయిల్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. 1990లో వరల్డ్ వైడ్ వెబ్ (www) అందుబాటులో వచ్చాక – ప్రపంచమంతా ఒకే వెబ్ వరల్డ్ క్రిందకు వచ్చింది. ఇంటర్నెట్ వాడకంలో ఇ- మెయిల్ ప్రాధాన్యత పెరిగింది.

మన దేశంలో VSNL ఇంటర్నెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆ తర్వాత అనేక ప్రవేట్ కంపెనీలు వాటి వెబ్ సైట్‌లోలో ఫ్రీ ఇ-మెయిల్ అవకాశాన్ని కల్పించాయి. ఈ రోజు రోజుకు ఎన్ని ఇ-మెయిల్స్ వెళుతున్నాయో లెక్కేలేదు. ఈ సంఖ్య ట్రిలియన్‌లలో ఉంటుందని అంచనా.. అయితే ఇంత ప్రాచుర్యాన్ని ఎంతో మేలు సమకూరుస్తున్న -ఇ- మెయిల్ హాకర్ల చేతిలో పడి విధ్వంసానికి కూడా సృష్టించటం మనం చవి చూశాం. కొత్త టెక్నాలజీ – కొత్త ఆవిష్కరణలు ప్రపంచానికి ఒక పక్క మేలు చేస్తూనే రెండవ వైపు విధ్వంసాన్ని కూడా సృష్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *