నక్షత్రాల చరిత్ర

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ సైన్స్ సైన్స్ సెంటర్

నక్షత్రాల చరిత్ర

సుర్యూడు మనకు దగ్గరగాఉన్నఒక నక్షత్రమని మనకందరికీ తెలుసు!.  ఈ అనంత విశ్వంలో కొన్ని వేల సూర్యుడు లాంటి నక్షత్రాలు ఉన్నాయని  కూడా మనం తెలుసుకొన్నాం!..

నక్షత్ర పుట్టుకను మనం చూడలేం! ఎందుకంటే ఒక నక్షత్రం ఏర్పడటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉదారహణకు మన సూర్యుడి లాంటి నక్షత్రం ఏర్పడటానికి అయిదు కోట్ల సంవత్సరాలు పడుతుంది. వీటిని అధ్యనం చేయటానికి మానవుడి జీవిత కాలం చాలదు. అయితే ఈ నాటి ఆధునిక సాంకేతిక పరికరాలతో అనేక విషయాలను మానవుడు ప్రత్యేకంగా చూడగలుగుతున్నాడు. అంచనాలు వేయగల్గుతున్నాడు. పరిశోధనలు చేయగల్గుతున్నాడు. కొత్త సిద్ధాంతాలను రూపొందించగల్గుతున్నాడు.

మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలన్ని తొంభైశాతం వరకు అనంత విశ్వంలో జరిగే ప్రక్రియలే యాభైవేల లక్షల క్రితం పేలిపోయిన నక్షత్ర కూటమి నుంచి వెదజల్లబడిన ఆ శకలాల సమ్మేళిత రూపమే భూమ్మీద ఏర్పడిన జీవరాశి అని ఒక అంచనా.వైరస్లు, బాక్టీయాలు, ఏక కణ జీవులు, వృక్షాలు, జంతుపువు, మానవులు ఇలా వీటి నుండి ఏర్పడ్డవేనని ఒక సిద్ధాంతం.

ఇప్పుడు నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో ఒకసారి పరిశీలిద్ధాం.. శూన్యంలో హైడ్రోజన్ పరమాణువులు అతి పలుచగా దూర దూరంగా ఉన్నవి దగ్గరగా చేరి డార్క్ క్లేడ్‌గా ఏర్పడతాయి. ఈ నల్లమేఘంలోని అణవులు ఒకదానికొకటి దగ్గరౌతున్న కొద్ది గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒకదానొటకి ఒక కేంద్రస్థానం ఏర్పడుతుంది. ఈ అణువులన్ని కేంద్రస్థానం వైపు ప్రయాణించి తీవ్రమైన ఒత్తిడికి గురై అణు విసో్పటనం  (ట్రగ్గరిండ్) జరుగుతుంది. దీనినే న్యూక్లియార్ పూ్యజన్ అంటారు. మనంతయారుచేసే న్యూక్లియర్ బాంబు కూడా ఇదే సిద్ధాంతంతో తయారవుతుంది. అయితే మనం బాంబులతో చేర్చే పదార్ధం చాలా తక్కువ కనుక ఒకేసారి విస్పోటం జరుగుతుంది. ఒక నక్షత్రం లో పేడానికి ఎంతైతే పదార్థం ఖర్చువుతుందో అంతే పదార్థం శూన్యంలో నుంచి దానికి నిరంతరం అందుతూ వుంటుంది. శూన్య పదార్థాన్నే శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు.

అలా విస్పోటనంతో నిరంతరం మండుతున్న అగ్నిగోళంలా వెలుగుతూనే వుంటుంది. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యడిలో కూడా నిరంతరం జరిగే ప్రక్రియ ఇదే. అయితే నక్షత్ర కేంద్రక స్థానంలో విస్పోటనం కలిగించే శక్తి ఏమిటనేది శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా వుంది.

ఈ విధంగా ప్రోటోస్టార్ లేదా పొటాన్షియల్ నక్షత్రం ఏర్పడుతుంది. ఈ ప్రొటోస్టార్‌లో రెండు కోట్ల ఫారన్హీట్ల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఒత్తిడికి హైడ్రోజన్ పరమాణువులు హీలియం పరమాణువులుగా మారుతుంది.అప్పుడది సంపూర్ణ నక్షత్రంగా మారుతుంది. ఈ కొత్త నక్షత్రాలు గుంపులుగా ఏర్పడతాయి. వీటికీ మనం నెబ్యులాస్ అంటున్నాం. శక్తివంతమైన టెలిస్కోప్లలో ఈ నెబ్యులాలు అనేకం దర్శనమిస్తాయి. ఈ నెబ్యులాలన్నీ నక్షత్రాలుగా ఏర్పడతాయి. ఈ నక్షత్రాలు జంటలుగా లేదా గుంపులుగా ఏర్పడి ఒక దాని చుట్టు మరొకటి లేదా వాటి చుట్టు అవి తిరుగుతూ ఉంటాయి. మన సూర్యుడు మాత్రం ఒంటరి నక్షత్రమే.

మన భూమికి ఏడు వేల కాంతి సంవత్సరాల దూరంలో సెర్పెన్స్ నక్షత్ర రాశీలో ఒరియాన్ నెబ్యూలాను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినే కలపురుషమేఘం,కవిపురుష నిహారిక అంటారు. ఈ నెబ్యులా లక్షల సంవత్సరాల నుంచి అలాగే కనిపిస్తున్నది. మరి కొన్ని లక్షల తర్వాత దీనిలో ట్రగ్గరింగ్ జరిగి నక్షత్రాలు ఏర్పడతాయి. ఈ జెయింట్ నెబ్యులా ఎంత పెద్దదంతే దీనిలో కాంతిఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకు ప్రయాణించటానికి వందకాంతి సంవత్సరాలు పడుతుంది.

సూర్యుడి నుంచి వెలువడే కిరణాలే కాక అంతరీక్షం నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వెలువడుతుండటం శాస్త్రజ్ఞులు చాలాకాలం క్రితమే గుర్తించారు. వీటినే కాస్మిక్ కిరణాలు అంటున్నాం. అయితే అవి ఎక్కడ నుంచి ప్రసారమవుతున్నాయి అనే విషయం చాలా రోజుల వరకు శాస్త్రవేత్తలకు సందేహాన్ని కలిగించాయి.ఈ కాస్మక్ కిరణాలు భూమికి కొన్ని వందల కాంతి సంవత్సరాల నుంచి వస్తున్నాయని గుర్తించారు. మన గెలాక్సీలో 1054, 1572, 1605 కాంతి సంవత్సరాల దూరంలో మూడు నక్షత్రాలు సూపర్ నోవాలుగా మారటాన్ని గుర్తించారు. 1987లో ఎన్.ఎస్ 1987-ఎ అనే సూపర్నోవా విసో్పటనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు.

ఈ సూపర్ నోవాలు ఎలా ఏర్పడతాయనేది ఒకసారి పరిశీలిస్తే… కొన్ని నక్షత్రాు అప్పటి వరకు ప్రకాశిస్తున్నా దానికన్నా కొన్ని వేల రెట్లు ప్రకాశవంతంగా వెలుగుతాయి. ఇలా జరిగిన కొన్ని వారాల తర్వాత క్రమంగా వాటి కాంతి క్షిణించిపోతుంది. వీటినే సూపర్ నోవాలు అంటారు. 

ఒక నక్షత్రం అంతరించి పోయే సమయంలో సంభవించే వింతలను హబుల్ అంతరిక్ష టెలిస్కోఫ్ స్పష్టంగా చిత్రీకరించింది. నక్షత్రం అంతరించే సమయంలో వాయువులు గంటకు ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ వాయువులు సమీపంలోని అంతరీక్ష పదార్థాలను ఢీకొని విపరీతమైన వేడి పుడుతుంది. ఇలాంటి వాయు మేఘమొకటి భూమికి నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో .ఏడు కాంతి సంవత్సరాల వ్యాసార్థంలో ఏర్పడి ఉందని శాస్త్రవేత్తలు హబుల్‌గా గుర్తించారు.

సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాలతో వెలువరించే శక్తిని సూపర్ నవాలు కొన్ని రోజులలో విడుదల చేయగలవని శాస్త్రవేత్తలు అంచనా.

రేడియో ధార్మిక శక్తి కలిగిన సూపర్ నోవాలో నిరంతరం కేంద్రక చర్యలుజరుగుతుండడం వల్ల అది వ్యాకోచిస్తుంది. అందులోని కేంద్రకాలు, న్యూట్రాన్‌లను ఢీ కొనటం వల్ల కేంద్రక విచ్చిత్తి జరుగుతుంది. ఫలితంగా అత్యధిక పరమాుభారం శక్తి కలిగిన కేంద్రకాలు,ఆత్పానేట్, గామా కిరణాలు, ఆక్సిజన్, ఐరన్ మూలక కేంద్రాలు వెలువడతాయి. అవి మరలా చిన్న చిన్న పరమాణువులుగా న్యూట్రానులుగా విడిపోతాయి. ఈ మొత్తం ప్రక్రియను ప్రత్యర్మి మెకానిజం అంటారు. ఈ పెర్మి మెకానిజం వల్లనే కాస్మిక కిరణాలు భూమికి దూసుకువస్తున్నాయని ఎర్గీకిన్ ఓల్పెన్‌డెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు.

అత్యంత శక్తి కలిగిన పరమాణు కణాలు, కేంద్రకాలు ఎంతో వేగంతో అంతరిక్షఁలోకి దూసుకువస్తాయి. వీటిని ప్రధమ కాస్మిక్ కిరణాలు అంటారు. దాదాపు కాంతివేగంతో సమానమైన ఈ కిరణాలు అన్ని వేపుల నుంచి భూ వాతారణంలోకి ప్రవేశిస్తాయి. ఇవి భూ వాతారణంలోని అణువున్ని, పరమాణువుల్ని ఢీ కొని చిన్న చిన్న పరమాణువులుగా విడిపోతాయి. వీటిని ద్వితీయ కాస్మకి కిరణాలు అంటారు. వీటినే కాస్మిక్ షవర్స్ లేదా కాస్‌కేడ్ షవర్స్ అంటారు. వీటి సంఖ్య కొన్ని వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా… వీటిశక్తి 109 ఎలక్ర్టాన్ ఓల్టుల నుంచి 1021 ఓల్టుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు లెక్కించారు.

మనకు మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక సూపర్ నోవా నుంచి ఈ కాస్మిక కిరణాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు. అంటే నక్షత్రం తన జీవితాన్ని ఒక మేఘంలాగా ఆరంభిస్తుంది.

విశ్వంలోని శూన్యంలో కనిపించే విశ్వవాయువులలోని అణువులన్నీ కోట్లాది సంవత్సరాల క్రితం జన్మించి వెలిగి తిరిగి నశించిన నక్షత్రాల అవశేషాలే నక్షత్రాలు సూపర్ నోవాలుగా పేలిపోయి వాటి అవశేషాలను విశ్వం నలుమూలకు వెదజల్లబడతాయి. గురుత్వాకర్షణశక్తికి మళ్ళీ ఈ పదార్థాలని దగ్గరకకు చేరి నక్షత్రాలుగా మారుతున్నాయి.

మనం ముందు చెపుపకొన్నట్లుగా ఈ మార్పులను ఒక తరం కాదు కాదా వందల తరాలు కూడా ప్రత్యక్షంగా చూడటం వీలుపడదు. నక్షత్రం ఏర్పడటం, వెలగటం, నశించటం కొన్ని కోట్ల సంవత్సరాల ప్రక్రియ. మనకు కోట్ల సంవత్సరాలైన విశ్వం సమయంతో పోలిస్తే అది చాలా తక్కువేమో.

2002 సంవత్సరం వయస్సులో చిన్నదైన ఓక యువ నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపేరు కెహెచ్15డి (kh15d). దీని వయస్సు ముప్పై లక్షల సంవత్సరాలు. ఇతర నక్షత్రాలతో పోలిస్తే దీని వయసుచలా తక్కువు. ఇది భూమి నుంచి రెండువేల నాలుగు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గురుగ్రహంలాగా పూర్తిగా వాయువులోత నిండి వుంది. దీని చుట్టు ధూళి, శిలాపదార్థాలు పరిభ్రమిస్తున్నాయి. పెద్దవైన గ్రహశకలాల వల్లె గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. అయితే ఈ నక్షత్రం నాలుగు, మూడు రోజులకొకసారి కనిపించకుండా అధృశ్యమవుతుంది. మధ్యలో ఏకైక గ్రహంగాని, ఉపగ్రహంకాని, నక్షత్రంగాని అడ్డు రావటం వల్ల కనిపించకుండా పోతోందని విలియం హెస్ట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో సూర్యుడి వయసు తక్కువగా ఉన్నప్పుడే గ్రహలు ఏర్పడతాయని భావిస్తున్నారు. హెచ్కె నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహ శకలాలు, గ్రహలుగా రూపుదిద్దుకోవటానికి మూలమని హెస్ట్ బావిస్తునా్నరు. ఈ నక్షత్రంపై విస్పృత పరిశోదన వల్ల గ్రహాల పుట్టుకను గుర్చి సమాచారం లభించే అవకాశం ఉంది. మన సూర్యుడు కూడా ధర్మో న్యూక్లియర్ బాంబే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *