పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్

ఉపాధ్యాయ లోకం తరగతి గది నిర్వహణ తల్లితండ్రుల లోకం పిల్లల మనస్తత్వ శాస్త్రము బ్లాగ్

పిల్లలు ఎలా నేర్చుకొంటారు? .. జాన్ హోల్ట్

మా పాప ఇంకా ఏడాది దాటని పిల్ల. ఆ పిల్లకు ఒక ప్లాస్టిక్ విజిల్ అంటే చెప్పలేని ఇష్టం. ఎప్పుడూ దాంతో ఆడుకొంటుండేది. ఒక రోజు నేను ఆ విజిల్‌న తీసుకొని మా పాప చూస్తుండగానే దాని రంధ్రాల్ని వేళ్ళతో మూస్తూ తెరస్తూ ఊదసాగాను. మా పాప కూడా ఆ సంగీతం పట్ల ఆసక్తి ఉన్నట్టుగానే అన్పించింది. నావైపే చూస్తూ కూచుంది. ఒకటి రెండు నిమిషాలు ఇలా గడిచాక నేను ఆ విజిల్‌ని మా పాపకిచ్చేశాను. ఎంతఆశ్చర్యంమంటే మాపాప ఆ విజిల్‌ని కోపంతో విసిరికొట్టింది. ఎందుకిలా జరిగినట్టు.?

డానీ అనే రెండున్నరేళ్ళ అబ్బాయికి నేనంటే ఎంతో ఇష్టం. ఒకసారి అతనికోసం ఆటవస్తువు ఏదైనా కొందామనుకొని రంగురంగుల చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్ని కొనుక్కొచ్చాను. వచ్చీరాగానే పెట్టెను నా చేతి నుంచి లాక్కొని వాటితో ఆట మొదలెట్టాడు. నేను వాటితో కలిసి ఆడుకోసాగాను. వాళ్ళ నాన్న కూడా మా ఆటలో చేరాడు. వాటిని ఎత్తి కింద పోశాడు. దొర్లించాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. ఇంతలో నేను వాటిలో కొన్ని తీసుకొని నేల మీద కూచుని ఇల్లులా ఒక ఆకారం వచ్చేలా పేర్చాను. దాన్ని వాడు ఏ భావమూ లేకుండా రెండు నిమిషాలు చూచాడు. అంతే విసురుగా ఆ ఇంటిని పడదోసేశాడు. మళ్ళీ నేను మరో ఆకారంగా పేర్చాను. వాడు మళ్ళా పడగొట్టేవాడు. మూర్ఖంగా కోసంపగా మాటి మాటికీ వాడలాగే చెయ్యసాగాడు ఎందుకని?

పిల్లలకి మనం చాలా నేర్పాలనుకొంటాం. నేర్పడం అంటే వాడితి తెలియంది నేర్పడమే గదా! వాడికంటే మనకు ఎక్కువ తెలిసి ఉండాలి గదా! నిజమే సమస్యల్లా ఎంత నేర్పాలి అనేదే? ఏది నేర్పాలి అనేదే.

పిల్లలు తమకంటే కొంచెం పెద్ద పిల్లల దగ్గర చాలా పనులు, ఆటలు, పాటలు నేర్చుకొంటుంటారు. తల్లిదండ్రుల నుంచీ టీచర్ల నుంచి ఇంతబాగా నేర్చుకోలేరు. ఎందుకని? నేర్చుకోడానికసలు ఇష్టపడరు. ఎందుకని? పెద్ద పిల్లలు తమకంటే కొంచెం తక్కువగా ఉన్న పిల్లలతో చనువుగా వున్నందువల్లా, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నందువ్లా అలా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారని మనం సాధారణంగా విశ్లేషించుకొంటాం. అది సత్యమే గానీ పూర్తి సత్యం మాత్రం గాదు. అసలు విషయం ఏమంటే తమ కంటే కొంచెం పెద్ద పిల్లలు చేసే పనిలో నైపుణ్యం, తమ నైపుణ్యం కంటే ఒక్క మెట్టు ఎక్కువ మాత్రమే ఉంటుంది. తేడా చాలా ఎక్కువ ఉండదు. తాను నేర్చుకొనేందుకు వీలైన, సాధ్యమైన పనిగా నమ్మకం కుదురుతోంది. కాబట్టి దాన్ని నేర్చుకొనేందుకు పిల్లలు ఉత్సాహం ప్రదర్శిస్తారు. మనం చేసే పని వాళ్ళ కసాధ్యంగా కన్పిస్తే వాళ్ళు దూరమైపోతారు.

పై సందర్బాల్లో ఆ పాప విజిల్ పారేసిందంటే అలా ఊదటం తనకు ఏమాత్రం దగ్గరి విషయం కాకపోబట్టే. ఆ అబ్బాయి ఇల్లులా పేర్చిన ప్లాస్టిక్ వస్తువుల్ని కూల్చాడంటే అలా చెయ్యడం తనకేమాత్రం సాధ్యం కాదు కాబట్టే!

కొందరు మానసిక శాస్త్రవేత్తలు పిల్లలకు తాము ఎంత పనినైనా చెయ్యగలమనే అపనమ్మకం ఉంటుందనీ, పెద్దయ్యాక మాత్రమే వాళ్ళకు ఏది చెయ్యగలమో ఏది చెయ్యలేమో అర్తమవుతుందనీ అంటారు గానీ అందులో ఏమాత్రం నిజంలం లేదు. చిన్నపిల్లక్కూడా తామ చెయ్యలేనిదేమిటో తెలుసు. ఆ పాపకు విజిల్ ఊదడం తనకు సాధ్యంగాదని తెలుసు. ఈ అబ్బాయికి ఇల్లులా పేర్చడం తనకు వీలుపడదని తెలుసు.

ఎటొచ్చీ మనమే పెద్దలం ఈ రహస్యాల్ని అర్థం చేసుకోం. ఇదిగో దీన్ని చదువు అంటాం. చదదవలేని పిల్లవాడికి తెలుసు. చదవలేక పోతున్నానని వాడు బయపడుతుంటాడు. అవమానం పాలవుతుంటాడు. అది అతనికి చాలా దూరమైన అంశం. మన అత్యాశ అతని విశ్వాసానికి, ఆసక్తిని దెబ్బతీస్తుంది.

ఒకసారి స్కూల్లో చదవడం నేర్పడం కోసం నేను కొన్ని చార్టులు కొన్నాను. అవి చాలా సులభంగా ఉండే పదాలవి. పిల్లలకు బాగా పరిచయమైన వస్తువుల బొమ్మలు, వాటికింద పేర్లూ ఆ చార్టుల్లో ఉన్నవే. మా ఇంట్లో నాలుగేళ్ళ అమ్మాయి వుంది. వాటిని నేను అల్మారాలో పెట్టాను. అవేమిటి? అని ఆ పాప అడగలేదు. నేనూ చెప్పలేదు. వాటిన్నేను తీసుకెళ్ళడం, తీసుకొని రావడం చూచి ఓ వారం రోజులతర్వాత అవేమిటి అనిందా పాప. అవి పిల్లలు చదివేందుకోసమని చెప్పాను. నాకిస్తావా? అని అడిగిందా పాప. ఓ తీసుకో దానికేం అని ఇచ్చేశాను.

అంతే ఆ పాప వాటిని తిరగేస్తూ కూచుంది. నేను బొమ్మలు చూపించిగానీ, చూపకుండాగానీ ఆ పాపను చదవమని చెప్పలేదు. ఆ పాపే కొన్ని వస్తువుల్ని చూసి వాటి పేర్లు చెప్పింది. కొన్ని పేర్లు చెప్పమని అడిగింది. ఓ నాలుగక్షరాల పదాన్ని పట్టుకొని వాళ్ళ మామయ్యపేరు చదవసాగింది. రాగాలు తీయసాగింది. నిజానికది వాళ్ళ మామయ్యపేరుగాదు. కాకుంటే వాళ్ళ మామయ్యదీ నాలుగక్షరా పేరే! కాని మళ్ళీ నేను పాతప్ధతిలోనే బొమ్మల పదాలు చెప్పిద్ధామని చూచాను. ఒప్పుకొంటేనా? ఆ ఆట పాతదై పోయిందన్నమాట. నేనో ఆ ఆట అప్పటికి కట్టేశాను. దీన్ని బట్టి మళ్ళీ మనకేమి అర్థమవుతోంది.?

సాధారణంగా మనం ఉపాధ్యాయులుగా ఈ అక్షరాలేవో చెప్పమనీ ఈ పదాలేవో చదవమని అడిగితే పిల్లలు తమకు సాధ్యంకాదని అర్థం కాగానే ఆ విషయం మనకర్తమైపోయిందని తెలియగానే జంకిపోతారు. నిరాసక్తంగా మారుతారు. ఆత్మరక్షణలో పడిపోతారు. అలాంటి పరీక్ష తమ నెత్తిన లేనప్పుడు, తమ అసమర్థత వ్యక్తం కావలసిన సందర్భం లేనప్పుడు దాని పట్ల ఉత్సుకత చూపిస్తారు. ఏదో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం నిర్వఘ్నంగా సాగాలంటే ఈ వాతావరణాన్ని పరిస్థితుల్ని మనం కల్పించాలి. ఫలితంగా నేర్చుకొనే క్రమానికి మార్గం సుగమం చేయాలి. మనం ఆ దారిని మూసివేస్తున్నామా విశాలం చేస్తున్నామా అన్నది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *