బర్డ్ వాచింగ్

రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ సెంటర్

బర్డ్ వాచింగ్

పక్షులంటే ఇష్టపడినివారుండరు. ప్రొద్దునే వాటి కిలా కిలా రావాలు వింటుంటే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ఎంతో మంది మొదట దీన్నే హాబీగా ప్రారంభించినా తర్వాత శాస్త్రీయఅవగాహనకు వారి పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయి. మనదేశంలో బర్డ్ వాచింగ్ గూర్చి చెప్పుకోవాలంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది సలీమ్ ఆలి. భారత దేశ ఆర్నితాలజీలో ఫాదర్ ఆఫ్ ఇండియాన్ అర్నితాలజీ అని ఆయనకు పేరు. ఆయన రాసిన ది ఫాల్ ఆప్ ఎస్పారో అనే పుస్తకం బర్డ్ వాచింగ్ హాబీగా గల వారందరిని ఉత్తేజపరిచే పుస్తకం. సలీమ్ ఆలి 1896 నవంబర్ 12న అప్పటి బొంబాయిలని ఖేత్‌వాడిలో జన్మించారు. పక్షులంటే చిన్నప్పటినుండి ఆయనకు ఎంతో ఇష్టం. బొంబాయిలో ఒక బ్రిటిషర్ ప్రారంభించిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి ఆయనకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. చదువులో పెద్దగా రాణించకపోవటం వల్ల బయాజలీలో సెంట్ జేవియర్ కాలేజీలో ఆయనకు సీటు లభించలేదు. వారి సొంత వ్యాపారం కోసం కొన్ని రోజులు బర్మాలో ఉన్నారు. అక్కడ వ్యాపారం కంటే బర్డ్ వాచింగ్కు అధిక ప్రాధాన్యత నిచ్చారు. అందుకని తిరిగి ఇండియాకు వచ్చేశారు. వర్గీకరణ శాస్త్రం (టాక్సానమీ) చదవటానికి బెర్లిన్, జర్మనీలను సందర్శించారు. ఆ తర్వాత భారత దేశం తిరిగి వచ్చిన తర్వాత అప్పటి మహారాజులు కొందరు పక్షులను సర్వే చేసే నిమిత్తం ధనాన్ని, వసతులను కల్పించారు.అప్పటి నుండి ఆయన పక్షుల వీక్షణం ప్రారంభమయ్యింది.

వీవర్ బర్డ్, బేయాస్ పభులు వాటి గూళ్ళలో ఉండే విధానం గూర్చి ఆయన చేసిన పరిశోధనలు ఆర్నితాలజీలో ఒక మైలు రాయని చెప్పవచ్చు. ప్లెమింగ్ సిటిని కనుగొనటానికి ఆయన ముఖ్య కారణం. పక్షులు వ్యవసాయానికి ఎంతో ఉపకరిస్తాయని ఆయన 1930లోనే విశదీకరించారు. గగనతలంలో పక్షులు విహారాన్ని గూర్చి విమానాలకు అడ్డు వచ్చే పక్షుల గూర్చి, పర్యావరణ పరంగా అనేక సూచనలు చేశారు. యస్.థిల్లాన్ రిప్లేతో కలిసి సలీమ్ ఆలి రచించిన 10సంపుటాల హాండ్ బుక్ ఆఫ్ ఇండియాన్ బడ్స్ ఒక కళాఖండంగా మిగిలిపోయింది. ఆయన దాదాపు 50 అవార్డు దాకా అందుకునా్నరు. ముఖ్యంగా జె. పౌల్‌ జెట్టి అవార్డు ఆయనకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు నిచ్చింది. ఈయన 1987 జూన్ ఇరవయ్యావ తేదిన చనిపోయారు. 91 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన 9 ఏళ్ళ పిల్లవానిగా బర్డ్ వాచింగ్‌కు కృషి చేశారు.

బర్డ్ వాచింగ్ ఖర్చులేని ఒక విజ్ఞాన దాయకమైన మంచి హాబి. అయితే ఆ శక్తి కొంత ఓపిక అవసరం. కొన్ని పక్షులకు సంబంధించిన పుస్తకాలు, బైనాక్యులర్స్, పెన్సిల్, నోట్ పుస్తకం ఉంటే చాలు, పక్షులను పరిశీలించాలంటే తెల్లవారు ఝామునలేవటం అలవాటు కావాలి. ఎందుకంటే సూర్యోగానికి కంటే ముందే పక్షలు గుళ్ళ నుండి బయలు దేరుతాయి. కాబట్టి మొదట్లో ఎక్కువదూరం పోకుండా మీ పరిసర ప్రాంతాలలోని పక్షులను గమనించవచ్చు. నీరు ఉండే ప్రాంతాలలో పండ్ల చెట్లు ఉండే ప్రాంతాలలో, పెద్ద పెద్ద చెట్లు ఉండే ప్రాంతాలలో పొలాల దగ్గర పక్షులను గమనించేందుకు ఎక్కువ అవకాశం కల్గుతుంది.

వరుసగా ఆ ప్రాంతాల్లో తరచూ వెళ్ళుతుంటే రక రకాల పక్షులను గమనించే అవకాశం కల్గుతుంది. మొదట్లో కొంత నిరుత్సాహ పరచవచ్చు. మొదట్లో మీకు తెలిసిన మైనా, పావురాలు, పిచ్చుకలను మాత్రమే గుర్తు పట్టవచ్చు. క్రమంగా మిగతా పక్షులను గుర్తించే నేర్పు క్రమంగా కల్గుతుంది.

ముందుగా వాటి అరుపులను వినటం నేర్చుకోవాలి. ఏ అరుపు పక్షిదనే గుర్తింపు తెచ్చుకోవాలి. పక్షులను పరిశీలించేటప్పుడు సున్నితమైన పరిశీలన, వినికిడి శక్తి కావాలి. పక్షులను పరిశీలించటానికి నక్కజిత్తులు కావాలి. ఎందుకంటే పక్షులను దగ్గర నుండి పరిశీలించటం వీలుకాదు. అయితే నక్కలు మాత్రం వాడిని ఒడుపుగా పట్టుకొంటాయి.

పక్షులను పరిశీలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నలుపు, తెలుపు, ముదురు రంగు ఉండే వస్త్రాలను వేసుకోకూడదు. అలాంటి వాటిని పక్షులు గుర్తిస్తాయి. ఎండిన ఆకుల రంగు (బ్రౌన్), లేత ఆకుపచ్చ, ఇంకా లేత రంగులుండే వస్ర్తాలను ధరించాలి. పక్షులు ఊదా (వైలెట్) రంగును గుర్తించలేవు. కాబట్టి ఆ రంగు వేసుకోవచ్చు. చప్పుడు కానటువంటి రబ్బరు చెప్పులు, దుస్తులు వాడాలి. ఎండుటాకులు, పుల్లలుండే ప్రదేశంలో నడవ కూడదు. ఆ చప్పుడుకు ఆవి పారిపోతాయి.

మీరు గమనించాలనుకొ్న్న ప్రదేశంలో చెట్టు, చాటునో, పొదచాటునో, కదలకుండా కూర్చోవాలి. వాటిని గనించేటప్పుడు తల విసురుగా తిప్పకూడదు. అలా జాగ్రత్తలు తీసుకుంటే పక్షులను దగ్గరగా పరిశీలించే అవకాశం కల్గుతుంది.

పక్షులను గుర్తింటానికి వసంత రుతువు, వేసవి కాలం తొలి రోజులు ఆనుకూలమైనవి. జూలై నెలలో పక్షి పిల్లలు తిరుగుతుంటాయి. అందువల్ల జూలై నెల పక్షుల దిన పట్టికలో ముఖ్యమైన నెల.

సూర్యోదయానికి ముందు, సాయంత్రం చాలా చురుకుగా వుంటాయి. కాబట్టి ఆ సమయం పక్షులను పరిశీలించటానికి అనువై సమయం, ఎక్కువగా గాలులుండే రోజు, ఎక్కువ వర్షం రోజులలో ఎక్కడో దాక్కుంటాయి. కాబట్టి మనకు కనిపంచవు. అయితే చిరుజల్లులు సమయంలో మాత్రం చురుకుగా ఉంటాయి. నీటి పక్షులను గమనించేటప్పుడు దూరం నుంచే గమనించాలి.

పరిశీలన

మొదటిగా పరిశీలించేటప్పుడు కూతను గమనించాలి. అది ఏ పభి కూతో గుర్తించాలి. మీ నోట్ పుస్తకంలో వివరాలు స్కెచ్ వేసుకోవాలి. ముందుగా తేది వేసుకోవాలి. ఆ తర్వాత మీరు పరిశీలించే కాలము, వాతావరణ పరిస్థితి, గాలి పరిస్థితి మొదలగు వివరాలు రాసుకోవాలి. మీరు పరిశీలించే ప్రదేశం పేరు. అక్కడి పరిస్థితులు రాసుకోవాలి. పక్షిని గుర్తించటినప్పుడు దాని పరిమాణం రాసుకోవాలి. చిన్నది, మరీ చిన్నది, లేదా చిన్నది ఇలా గుర్తుకు రాసుకోవాలి. అవసరమైతే పిచ్చుక కన్నా పెద్దది లేదా చిన్నది, కాకి కన్నా పెద్దది లాంటి పోలికలతో వ్రాసుకోవచ్చు. లేదా షుమారుగా ఎన్ని సెం.మీ ఉంటాయో వ్రాసుకోవాలి. ఆ తర్వాత దాని ఆకారం – సన్నగా ఉందా, లావుగా వుందా, ఈకలు పొడవుగా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా గుర్తించి వ్రాసుకోవాలి. ఈకలను గమనించేటప్పుడు ముఖ్యంగా అవి ఈకలను పైకి క్రిందకు ఎత్తగలుకుతున్నాయో గమనించాలి.

ఆ తర్వాత దాని ముక్కు ముక్కు పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా. సన్నగా ఉందా వంటివి గమనించి వ్రాసుకోవాలి. అ తర్వాత ముక్కు రంగును వ్రాసుకోవాలి. ముక్కు నిర్మాణాన్ని బట్టి అది ఏ జాతికి చెందినది నిర్థారించవచ్చు.

ఆ తర్వాత కాళ్ళ, కాళ్ళ పరిమాణం, నిర్మాణం గమనించాలి. పొడుగు కాళ్ళా, పొట్టి కాళ్ళా గమనించాలి. కాలివేళ్ళు కలిసి వున్నాయా, కాళ్ళు ఏం రంగులో ఉన్నాయి మొదలగు వివరాలు వ్రాసుకోవాలి. తల మీద ఈకలు కనిపిస్తే దాని రంగు ఆకారం గమనించాలి.

ఆ తర్వాత ఒంటి రంగు, దాని శరీరం ముఖ్యంగా ఏ రంగుల్లో ఉందో వ్రాసుకోవాలి. ఆ తర్వాత రెక్కలు, పొట్ట భాగం ఈకలు ఏ రంగులో ఉన్నాయో గమనించాలి. ముక్కు దగ్గర ఏ రంగుల ఉందో గుర్తించాలి. ఒంటి మీద రెక్కల మీద చారలున్నాయా, పొడలున్నాయా గమనించాలి.

మీరు రేఖా చిత్రాలు వేయగల్గితే ఇంకా మంచిది. మీరు గమించిన ప్రతి విషయాన్ని ఆకారం, ముక్కు తోక, కాళ్ళు మొదలగు వాటిని రేఖా చిత్రాలుగా గీచుకోవచ్చు.

ఆ తర్వాత ఆహారపు అలావాట్లు, అవి తినే పద్ధతులు గమనించాలి. అది ఎక్కువగా ఏ ప్రాంతంలో సంచరిస్తుంది ఉదాహరణకు తోటలు, బురద గుంటల దగ్గర అడవి ప్రాంతం, పొలాల్లో, ఇలా వాటి స్వభావాన్ని గూర్చి రాసుకోవాలి.

కొమ్మ మీద కూర్చుంటున్నప్పుడు అడ్డంగా కూర్చుంటుందా, నిలుగా కూర్చుంటుందా గమనించాలి. నేల మీద ఉంటే దగాని నడక వేగం గమనించాలి. నీటిలో ఉన్నప్పుడు ఈదగల్గుతుందా, మునుగు తుందా మొదలగు వివరాలు గమనించాలి.

ఆ తర్వాత ఎగిరే  ప్రక్రియ, ఎగిరేటప్పుడు రెక్కలను ఆడించే విధానం, వేగంగా ఎగురుతుందా నెమ్మదిగా ఎగురుతుందా, తక్కువ ఎత్తులో ఎగురుతోందా, నిశ్చలంగా గాలిలో నిలవగలుగుతుందా మొదలగు వివరాలను గుర్తించాలి.

ఆ తర్వాత వాటి గుళ్ళను, గుడ్లను పరిశీలించాలి. గుడ్లను పొదగడటం, పిల్లలు పెద్దవి కావటం మొదలగు విషయాలను గమనించాలి. మీ పరిశీలనా శక్తి, పెరిగే కొద్ది అనేక అంశాలను పరిశీలించే అవకాశం కల్గుతుంది.

పక్షుల పరిశీలన గూర్చి అనేక పుస్తకాలు లభిస్తాయి. అనేక సంస్థలు వీటిని అధ్యయనం చేయటానికి వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆ పుస్తకాల పేర్లు, సంస్థల వివరాలు తెలియజేస్తున్నాం. ఆశక్తి ఉన్నవాళ్ళు ఆ సంస్థలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *