అరిటాకు సిద్ధాంతం

బ్లాగ్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

అరిటాకు సిద్ధాంతం

కంప్యూటర్ ఆర్కిటక్చర్లో అత్యంత క్లిష్టమైన విభాగం గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ ఫేజ్ అమెరికన్ కంప్యూటింగ్ మిషనరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కంప్యూటర్ను వాడుకొనే హక్కు ఉండాలని తెలియజేస్తుంది. అంతే గాకుండా వారి సంప్రదాయాలను విశ్వాసాలను కించపరిచే విధంగా ఉండకూడదన్నది వారి లక్ష్యం. కాబట్టి కంప్యూటర్ తయారీ శాస్ర్తవేత్తల దృష్టి ఎప్పుడు అందరినీ ఆకర్షించే కంప్యూటర్లను తయారు చేయటం పైనే ఉంటుంది.

అందుకే అందరికీ ఉపయోగపడే యూజర్ ఇంటర్ ఫేజ్ లపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

మన సంప్రదాయంలో అరిటాకుకు ఎంతో ప్రాధాన్యత వుంది. అరిటాకులో తింటే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని ప్రతీతి. భోజనానికి ముందు శుభ్రమైన అరిటాకులో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వడ్డిస్తారు. వడ్డించే పద్దతి, తినేందుకు పద్ధతులనుకూడా మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముందుగా చక్కెర, అరటి పండు ముక్క, పుప్పుకూర, పచ్చడి, సాంబారం, రసం, మజ్జిగా ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం భోజనం చేసే పద్ధతిని ఒక శాస్త్రీయ దృక్పథంతోటి ఏర్పరిచారు.

అందుకే మన శాస్త్రవేత్త యం.వి.అనంత కృష్ణన్ అరిటాకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. టాటా కన్సల్టెన్సీలో పనిచేసే ఈయన అమెరికాలోని న్యూఓర్లాన్స్లో జరిగిన యూనివర్సల్ ఎఫెక్ట్స్ ఇన్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ సెమినార్లో అరిటాకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మనం ప్రతిపాదించే సిద్ధాంతాలకు మూలం ప్రకృకతే. దీనిని నిశితంగా పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలుడుతాయి. అనేది ఆయన సిద్ధాంతానికి ముఖ్య ప్రేరణ.

ఇంటర్ ఫేజ్ రూపకల్పనలో అరిటాకు సిద్ధాంతం రెండు విధాలుగా విశదీకరిస్తుంది. కంప్యూటర్లో డెస్క్ టాప్ మీద విండోస్ షార్ట్ కట్ రూపంలో ఉంటాయి. దీనివల్ల ఆపరేటర్ సులభంగా తనకు కావల్సిన అప్లికేషన్స్‌ను ఎంచుకొని ఆ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో కూడా తను చేసే ప్రోగ్రామ్స్ లేదా ప్రాజెక్టుకు అవసరమైన టూల్స్ను ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయడం జరుగుతుంది. అదే విధంగా అరిటాకులో ముందు ఆహార పదార్థాలను వడ్డిస్తారు. వడ్డించిన పదార్థాలను గూర్చి మనకు తెలుస్తుంది. మనకు నచ్చిన వాటిని మరలా అడుగుతాం. అరిటాకులో అన్నీ వడ్డిస్తే కంటికి జిహ్వాకు రెండింటికి ఇంపుగా ఉంటుంది. కాబట్టి కంప్యూటర్లోని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ వడ్డించిన అరిటాకులా (విస్తరాకులా) ఉండాలని మన శాస్త్రవేత్త అభిమతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *