గబ్బిలం

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

గబ్బిలం

గబ్బిలాలు  మీద కొన్ని అపోలాలున్నాయి. కాని నిజానికి అవన్ని నిజాలు కావు. అవి మనుష్యుల రక్తం తాగుయని, తాంత్రిక విద్యలు తెలుసునని, జబ్బులను వ్యాపింపచేస్తాయననే అపోహలున్నాయి. కాని అవి మిగతా జంతువుల్లా కాక పరిశుభ్రతను పాటిస్తాయని, వాటికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

గబ్బిలాలు పాలిచ్చే జంతువుల (క్షీరదాలు) జాతికి చెందినవి. ఇది ఏకైక ఎగిరే జంతువు. అంతేకాకుండా శరీరం మీద “ఫర్” ఉండే జంతువు. ఇందులో దాదాపు 1,300 రకాల జాతులు ఉన్నాయి. దీని శాస్ర్తీయ నామం చిరోప్టెరా అంటే చేతి రెక్కలుండే జంతువు అని అర్థం. ఇవి నిశాచరులు. సాధారణంగా రాత్రిపూట సంచరించే జీవులలో కళ్ళు అత్యంత అభివృద్థి దశలో వుంటాయి. కాని విచిత్రమేమిటంటే వీటి కళ్ళు కంటే చెవులు బాగా అభివృద్ధి చెంది వుంటాయి. దీని చెవులను అన్ని వైపులకు తిప్పగలదు. ఇది ఒక రకమైన ఆల్ర్టాసోనిక్ శబ్ధం చేస్తూ ఎదురుగా ఉండే వస్తువును వేగంగా గుర్తించగలుతుంది. మన చెవికి వినబడని శబ్ధం చేస్తూ ఆహారాన్ని గుర్తించగల్గుతుంది. ప్రయోగశాలలో శాస్ర్తజ్ఞులు వీటి కదలికలను గుమనించినప్పుడు ముందుగా వీటి కళ్ళకు గంతలు కట్టి వదలినప్పుడు వాటి మార్గంలో గాని. ఎగిరే తీరులోగాని ఎలాంటి మార్పు కన్పించలేదు. ఇది ఒక సెకను కాలంలో ఎదురుగా వున్న అడ్డంకిని గుర్తించి వెంటనే వెనక్కి మరల గల్గుతుంది. కాని వీటి చెవులకు బిరడాలు బిగించి వదిలారు. అప్పుడు మాత్రం అవి గోడలను, స్తంభాలను ఢీ కొటుకుంటూ క్రింద పడడం జరిగింది.

70లౌడ్ స్పీకర్లను ఒక చీకటి గదిలో పెట్టి 28 రకాల అతి సన్నని తీగలను గదిలో అమర్చారు. వాటి శబ్ధ తరంగాల కన్నా 200 రెట్లు ఎక్కువ శబ్ధంతో వాటి శబ్ధ తరంగాలను పోలిన తరంగాలను ప్రసారం చేశారు. అప్పుడు అవి వాటి మార్గంలో తీగలను గుర్తించి మరలడంతో ఎలాంటి మార్పు సంభవించలేదు. బయటి తరంగాలు, వాటి శబ్ధ తరంగాలకు ఎటువంటి అటంకఁ కల్గించలేదు.

ఇది చేసే శబ్ధతరంగాలు ఎదుటి వస్తువు లేదా దాని ఆహారం మీద పడి తిరిగి ఆ శబ్ధ తరంగాలు చెవిని చేరుతాయి. ఆ శబ్ధ తరంగాలను బట్టి అది ఎలాంటి వస్తువు లేదా కీటకమో అని క్షణ కాలంలో గుర్తించగల్గుతుంది.

అంతేకాదు ఈ శబ్ధ తరంగాలతో వస్తువు లేదా దాని ఆహారం ఎంత దూరంలో ఉందో కూడా అంచనా వేయగల్గుతుంది. ఇది ఎగిరే సమయంలో ఆహారం గ్రహించటానికి ఎంతో సహాయ పడుతుంది. అంతేకాదు గబ్బిళాలను గందరగోళ పరచటానికి అది ఎగిరే సమయంలో కొన్ని రాళ్లను పైకి విసిరివేసినప్పుడు అది ఆహారం కాదని కొంత దూరంలోనే గ్రహించి వెనుకకు మరలడం జరిగింది.

శాస్ర్తజ్ఞులకు వీటి మీద ఆసక్తి ఎందుకంటారేమో. వీటి మీద ఆసక్తి ఎందుకంటారేమో.. మానవుడు కనుగొన్న రాడార్‌ లేదా సోనార్ పరికరాల కంటే దీని శబ్ధ తరంగాలు ఒక బిలియన్ రెట్లు శక్తి వంతమైనవిగా గుర్తించారు. అంతేకాదు ఇది తీసుకొనే ఆహారం మొత్తం కొవ్వు పదార్థాలతో ఉండే కీటకాలు. కాని మీటి రక్త కవాటాలను పరిశీలించినప్పుడు ఒక్క సంవత్సరం గబ్బిళాలలోను, ఇరవై సంవత్సరాలు గబ్బిళంలోను ఒకే మాదిరిగా ఉండడం గమినించారు. ఈ పరీక్షలు హృద్రోగ నిపులకు ఎంతో ఉపకరిస్తుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆడజాతి గబ్బిళం శుక్ర కణాన్ని గ్రహించి స్టోర్ చేసి తనకు అనుకూల పరిస్థితులలో మాత్రమే దానిని గ్రహిస్తుంది. ఎండోక్రోనాలజిస్టులు, గైనకాలజిస్టులు అది స్టోర్ చేసే రహస్యాన్ని తెలుసుకోవటానికి కృషి చేస్తున్నారు.

ఇది రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ షుమారు 3000 కీటకాలను ఒక రాత్రిలో తినగలదు. కొన్ని పండు, తేనెను తీసుకొనే రకాలు కూడా ఉన్నాయి. ఇవి మొక్కల ఫలదీకరణానికి ఎంతో ఉపకరిస్తాయి. కొన్ని వందల పండ్లు తినే గబ్బిళాలు. విత్తన వ్యాప్తికి ఎంతో సహకరిస్తాయి.

వీటికి ఎలుకులకు కొంత పోలిక వుంది. కాని ఇవి చాలా పరిశుభ్రతను పాటిస్తాయి. దాని రెక్కలు ఎగిరేందుకు ఎంతో సహకరిస్తాయి. అందువల్ల తన శరీరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొంటుంది. ఇవి మనుష్యుల మీద దాడి చేయడం, కొరకడం వంటివి చేయవు.

ఇంకొక విచిత్రమేమిటంటే ఇవి శీతల ప్రదేశాలలో ఉంచినా వుండగలవు. రీసెర్చి లాబొరేటరీలలో రిఫ్రిజిరేటర్ల్‌కు వేలాడుతూ మనకు కనబడతాయి. ఇవి వాటి హృదయ స్పందనను 180సార్లు నుంచి 3 సార్లకు తగ్గించు కొంటుంది. శ్వాసక్రికయను కూడా సెకండుకు నిమిషానికి 8 సార్లుగా నియంత్రించుకొని నెలల పర్యంతరం కోల్డ్ స్టోరేజిలలో ఉండగల్గుతుంది.

ఎలుకలు ఒక సంవత్సరం, కుక్కలు 12 సంవత్సరాలు, గుర్రాలకు 17 సంవత్సరాల జీవిత కాలమైతే గబ్బిళాలు 15సంవత్సరాలు పైన జీవిస్తాయి. ఇవి చేతి వేళ్లతో ఎగురగలవు. వీటి చేతి నిర్మాణం దాదాపు మనిషి చేతి నిర్మాణాన్ని పోలి వుంటుంది. అయితే ఒక పలుచటి పొరలాంటి మెంబ్రేన్ కప్పబడి వుంటుంది. ఇది పక్షిలాగా వేగవంతంగా ఎగరలేకపోయినా హమ్మింగ్ బర్డ్ కు ఏమీ తీసుపోని విధంగా ఎగురగలుగుతుంది. ఇవి ఎగిరేటప్పుడు తమ బరువుకు రెండురెట్ల బరువును మోయగలవు. వేగవంతంగా ఎగురుతున్నప్పుడు కూడా అవి ఏ కోణంలోనైనా వెంటనే తన మార్గాన్ని మార్చుకొనగలవు. ఈ విధంగా శబ్ధ తరంగాలతో రాత్రిపూట వస్తువుల్ని ఆహారాన్ని గ్రహించటం, క్షణంలో తమ మార్గాన్ని మరల్చుకోవటం వంటి అంశాలను పరిశీలించి ఆ రహస్యాలను కనుక్కోగలికిదే విజ్ఞాన శాస్ర్తంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *