చరకుడు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

చరకుడు

ఆయుర్వేద శిఖామణి

ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు కీ.పూ. 8వ శతాబ్ధానికి చెందినవారు. మన పురాణాలలో చరకులు అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత రోగులకి వైద్య అవసరం కోసం క్షవరం అవసరమైనది. ఆ తరువాత కాలములో కొంత మంది చరకులు కాస్తా క్షురకులుగా మార్పుచెందారు. చరకుడు కాశ్మీరానికి సంబంధించినవాడు.

చరకుడూ గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా చరక సంహిత అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించాడు. చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శతాబ్ధాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. చరకసంహిత కీ.శ. 987లో అరబ్, పర్షియన్ బాషల్లోకి అనువదింపబడినది.

శరీరానికి కలిగే వ్యాదులు ముఖ్యంగా వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్లే రోగాలు కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయలతో తయారైనత్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించనదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు.

క్యాన్సర్ కణాలకు, పక్షవాతం, మూర్ఛ, కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.

మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్యశాస్ర్తం ఎన్నడో పేర్కొంది ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న ఆల్టాసోనిక్ వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరణ.

వైద్య సేవలుః

చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నలకు, అతి సామాన్యులకు సమ ప్రాధన్యం ఇస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారతదేశంలోని గ్రామ గ్రామాన విస్తరించి ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు – ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి.

చరకసంహిత

చరక సంహిత క్రీ.శ. 3-2 శతాబ్దాల మధ్యకాలంలో రచించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చరక సంహిత అష్టాంగ స్థానములుగా రచించబడినది. దీని మొత్తం 120 అధ్యాయాలున్నాయి.

సూత్రస్థానం, నిదానస్థానం, విమానస్థానం, శరీరస్థానం, ఇంద్రియస్థానం, చికిత్సస్థానం, కల్పస్థానం, సిద్ధిస్థానం దీనిలో ముఖ్యమైన అధ్యాయాలు. దీనిలో చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు, కల్పస్థానం, సద్ధిస్థానాలు పూర్తిగా క్రీ.శ. వ శతాబ్ధానికి చెందిన ధృవబాల అనే ఆయుర్వేద శాస్త్రవేత్త రచించి కలిపినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.

ఆయుర్వేద విజ్ఞానం

మనిషి ఎప్పుడూ సత్ర్పవర్తన కిలిగి ఉండాలని, శారీరక మానసిక ధృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.

ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహితలోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్య సేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం చరకసంహిత మీద మరిన్ని ఎక్కువ పరిశోధనలు విస్తృతంగా జరగవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *