జి.డి నాయుడు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

జి.డి నాయుడు

మనదేశంలో జి.డి నాయుడు పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఎందువల్లనంటే జిడి నాయుడు పెన్స్ చాలా రోజులు బహుళ ప్రచారంలో ఉండేవి. ప్రపంచంలో అనేక మంది మేధావులు ఈయనను కొనియాడారు. జి.డి. నాయుడు గురించి మాట్లాడటానికి నా కన్నా గొప్పవారు కావాలి. నేను చాలను మిలియన్లలో ఒకరు ఇటువంటి విచిత్రమైన మేధావి ఉంటారు. అని సి.వి.రామన్ అన్నారు.

ఈయన 1893లో కోయంబత్తూరు దగ్గర కొంగళ్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు గోపాల్ నాయుడు దొరస్వామి నాయుడు. ఆనాటి విద్యావిధానం ఆయనకు నచ్చక టీచర్ల కళ్ళలో ఇసుక కొట్టి స్కూల్ నుంచి పారిపోయేవాడు. అతన్ని చదవు మాన్పించి పొలంలో కాపలాగా పెట్టడం జరిగింది. ఇక్కడ హాయిగా తిరుగుతూ తమిళ పుస్తకాలు చదివి విజ్ఞానం సంపాధించటం ఆరంభించాడు. బలవంతంగా చదివించితే ఎదురు తిరిగేవాడు. తన కిష్టమైన విషయాలను తనే స్వయంగా తెలుసుకొనేవారు. ఒకసారి ఏమవుతుందో చూద్ధామని గడ్డి బండికి నిప్పంటించాడు. తండ్రికి కోపం రావడంతో తొమ్మిదేళ్ళ పొలంలో గడపవలసి వచ్చింది. సర్ మాల్కమ్ కాంప్‌బెల్ అనే బ్రిటీష్ శాస్త్రవేత్త కూడా కేవలం తమాషాగా ఒక అడవికి నిప్పంటిఁచాడు. మీరు కూడా ఇలా చెయ్యమని కాదు. శాస్ర్తవేత్త కంటే కుతూహలం కొద్ది ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా చేస్తే ఏమవుతుంది. అన్న కుతూహలం ఇలాంటి సంఘటనలకు కారణం. ఈయనకు కల్పన అంటే నచ్చేది కాదు. నవలలు, కథలు చదివేవాడు కాదు. ఇతరులు తప్పు చేస్తే అందరి ముందు బయట పెట్టేవారు. తన తప్పుల గూర్చి ఒక పర్సనల్ ఫైన్‌ను తయారు చేసుకొనేవారు.

ఒక బ్రిటీష్ దొర ఆటో సైకిల్‌పై వెళ్ళడం చూసి అలాంటిదే కొనాలని నెలకు మూడు రూపాయల జీతంతో సర్వర్‌గా చేరారు. అందులో నాలుగు వందల రూపాయలు ఆదా చేసి లాంక్ షైర్ అనే ఆఫీసర్ దగ్గర నుంచి మోటార్ సైకిల్ కొన్నారు. కొన్న వెంటనే అన్ని భాగాలను నాలుగు, ఐదు సార్లు విప్పి బిగించి తృప్తి పడ్డారు.

1920లో ఒక బస్సును కొని తానే డ్రైవర్‌గా పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. 1933లో యునైటెడ్ మోటార్స్‌ అనే సంస్థను స్థాపించి 200 బస్సులను 1500మైళ్ళు నడిపారు.

1939లో సర్జ్ జార్జ్ బోగ్ ఎలక్ర్టిక్ మోటర్ల ఫ్యాక్టరీ,1941సర్.ఆర్.కె షణ్ముగం చెట్టి రేడియో ఫ్యాక్టరీని స్థాపించారు. 1932లో యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు గడ్డం గీచుకోవటానికి రెండు షిల్లాంగులు ఖర్చని తెలిసి ఎలక్ర్టిక్ రేజర్‌ను కనిపెట్టరారు.

ప్రతి రోజు వచ్చిన కొత్త ఊహలను పరిశీలించి అవి పనికొస్తాయో లేదో తెలుసుకొనేవారు. ఎన్ని మైళ్ళు వెళ్లినా నీళ్ళు పోయవలసిన అవసరం లేని ఆటోరేడియోటర్‌ను తయారు చేశారు.  1936లో వైబ్రేషన్‌లను పరిక్షించే సాథనాన్ని తయారు చేశారు. అప్పట్లోనే ఆయన తయారు చేసిన ఓట్లు వేసే యంత్రం ఎంతోప్రాచుర్యాన్ని పొందింది. ఇలాంటి దాన్ని థామస్ అల్వా ఎడిసన్ తయారు చేయటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు.

దూరంగా ఉండే దృశ్యాలను ఫోటోలు తీయటానికి లెన్స్‌ను అడ్జస్ట్ చేసుకొనే సాథనాన్ని  (Distace Adjust), పండ్ల రసాలను తీసే జ్యూసర్‌ను కనిపెట్టారు.

ఆయన మొక్కలపై అనేక ్రపోయగాలు చేశారు. బొప్పాయి పండ్లను టమోటాలు మాదిరిగా, పుచ్చకాయలాగా, నారంజిలాగా పండించేవారు. పోకనూరులో తన  40 ఎకరాల పొలంలో ఈ ప్రయోగాలన్ని చేసేవారు. ఆయన ప్రయోగాలను చూసిన కొందరు శాస్త్రవేత్తలు జి.డి.నాయుడు లాంటి శాస్ర్తవేత్తలు కొందరుంటే భారతదేశంలో ఆహార కొరతే ఉండదు అని వ్యాఖ్యానించారు.

1950లో యూరప్ లో పర్యటించి వచ్చి మనదేశంలో స్థాపించగల పరిశ్రమల గూర్చి అనేక మంది స్నేహితులకు సలహాలు ఇచ్చారు. ఇంగ్లాండ్, జర్మనీలలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన సలహాలు వారికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టాయి.

అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే ఆయన సృజనాత్మకశక్తి మన దేశంలో అణచివేయబడింది. మన దేశంలో శాస్త్రజ్ఞులు ఎదుర్కొన్నఅనేక బాధలను ఆయన ఎదుర్కొవాల్సి వచ్చింది.

అనేక ప్రయోగాల కోసం, దేశం కోసం, జీవితాన్ని ధార పోసిన ఆయన 1974లో కన్ను మూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *