డాల్ఫిన్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

డాల్ఫిన్

ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే డాల్ఫిన్లకు మానవునితో స్నేహమంటే ప్రాణం. అది ఎందుకో మరి తెలియదు. సాధారణంగా కుక్కలు, పిల్లులాంటి పెండుపు జంవుతులు మనం ఆహారం పెడుతున్నాం కాబట్టి మనల్ని అభిమానిస్తాయి. మనం డాల్ఫిన్లకు ఎటువంటి మేలు చేయకపోయినా అవి మనల్ని అభిమానిస్తాయి.

పూర్వీకులు డాల్ఫిన్లను పర్పాయిస్ అని పిలిచేవారు. రోమన్ కాలంలోనే వాటి ఉనికిని గూర్చి తెలిసిన వుంటుందని చరిత్రకారులు చెబుతారు. 74 బి.సి కాలం నాటి నాణ్యాలపై డాల్ఫిన్ చిహ్నాలు ఉన్నట్లు కనుగొన్నారు.

డాల్ఫిన్ గూర్చి ఒక కవి చెబుతూ “ ప్రెండ్ షిప్ ఫర్ నో అడ్వాంటేజ్ ” అని చెబుతారు. తమ ఆనందం కోసం మనిషితో స్నేహం చేసే జీవి డాల్ఫిన్ ఒక్కటే. ఇవి ఓడల వెంట ప్రయాణిస్తూ అందులోని మనుష్యులతో సంబంధాలు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తాయి. మనిషి ప్రవర్తనను పోలిన డాల్ఫిన్లు మానసికంగా ఎంతో ఎదిగిన జీవిరాశిగా శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.

మనిషి తరువాత అత్యంత తెలివిగల జీవులు డాల్ఫిన్లు అని చెప్పవచ్చు. ఇవి తిమింగళాల కుటుంబానికి చెందినప్పటికీ ఇవి చేపలు మాత్రం కావు. ఇవి పాలిచ్చి పిల్లలను పోషించే క్షీరదాలు. అంతే కాకుండా మిగతా చేపల్లా కాకుండా ఉష్ణ రక్త జంతువులు. ఇవి శ్వాసిస్తాయి. ఇవి సముద్రాలలో, నదులలో కూడా ఉంటాయి. ఇవి ఉన్నట్లుండి పైకి వచ్చి, మళ్ళీ దుముకుతుంటాయి. ఇది సరదా కోసం మాత్రం కాదు. గాలిని పీల్చు కోవటానికి ఇలా చేస్తుంటాయి.

డాల్ఫిన్లలో ఇరవైకి పైగా జాతులున్నాయి. “ డాల్ఫిన్ డే ” జాతిని డాల్ఫిన్ అని పిలుస్తారు. పొడుగు ముక్కు గల డాల్పిన్‌లను “ స్టెనిడి ” అంటారు. నదీ ప్రాంతాలలో జీవించే వాటిని ఫ్లటానిస్టిడ్ లు అంటారు. డాల్ఫిన్ షుమారు ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల పొడవు, షుమారు మూడు వందల పౌండ్ల బరువు వుంటుంది. దీనికి ఒకే ఒక నాసికా రంధ్రం ఉంటుంది. ఇది అర్థ చంద్రాకారంలో తలమీద వుంటుంది. నీటిలో మునిగినప్పుడు ఈ నాసికా రంధ్రం మూసుకుంటుఁది. ఈ రంధ్రం శబ్ధాలకు కూడా తోడ్పడుతుంది. ఇది నీటిలో షుమారు ఆరు నిమిషాలు ఉండగలదు. అంటే ప్రతి ఆరు నిమిషాలకు ఒకసారి పైకి వచ్చి గాలిని పీల్చుకుంటుందన్నమాట.

దీని కళ్ళు నోటికి వెనుక భాగంలో ఉంటాయి. ఇవి దాదాపు మానవుడి కళ్ళను పోలి వుంటాయి. దీనికి మృదువైన లోపలి చెవి వుంటుంది. ఇది చెవిలోని “ పీరియాటిక్ ” అస్తిక సహాయంతో వినగల్గుతుంది. అత్యంత వినికిడి శక్తి కలిగిన జంతువు డాల్ఫిన్‌ ఒక్కటే కావడం విశేషం. దీని పుట్టుకతోనే అత్యంత ఆధునికమైన సోనార్ వ్యవస్థ కలిగివుంది. ఇది తన గొంతులోంచి గాలిని రకరకాల ప్రకంపనలు చేసి శబ్ధాలను స్పష్టిస్తుంది. ఇది ఒకేసారి రెండు రకాల శబ్ధాలను పుట్టించగలదు. డాల్ఫిన్ సృష్టించే మొదటి తరహా శబ్ధాలు భయం వల్ల, ఇతర డాల్ఫిన్లను పిలవడం కోసం, బెదిరించడం వంటి వాటికి ఉపయోగిస్తాయి. రెండో తరహా శబ్ధాలు ధ్వని తరంగాలు. ఈ ధ్వని తరంగాలను అత్యంత ఆధునికమైన రాడార్ (సోనార్) వ్యవస్థతో పోల్చవచ్చు. ధ్వని తరంగాలు నీటిలో ప్రయాణించి అడ్డు తగిలిన వస్తువును తాకి తిరిగి డాల్ఫిన్ చెవికి చేరుతాయి. దీని దారికి అడ్డు తగిలిన వస్తువు ఏదైనా బండరాయా, చేపనా లేక ఇతర ఏదైనా జంతువా అనే విషయాన్ని అంచనా వేయగల్గుతుంది. ఆ వస్తువు ఎంత దూరంలో వుంది, ఏ పరిమాణంలో ఉందో కూడా డాల్ఫిన్ అంచనా వేయగలవు. మానవుడు తయారు చేసిన సోనార్ వ్యవస్థ ఆ వస్తువు ఏదైంది గుర్తింలేదు.

దీని వీపు నల్లగాను, పొట్టభాగం తెల్లగాను వుంటుంది. డాల్ఫిన్ పళ్ళు చాలా పదునుగా వుంటాయి. వీటికి కిల్లర్ వేల్స్ అని పేరు. ఇది సీల్ జంతువులను, షార్క్ లను ఇతర చేపలను ఆహారంగా తింటుంది. షుమారు గంటకు 30 మైళ్ళ వేగంతో డాల్ఫిన్లు నీటిలో ప్రయాణించగలవు. ఇది ఇతర సముద్ర జీవులకంటే వేగంగా నీళ్ళలో ఈదుతుంది. దాని శరీర నిర్మాణం, స్పాంజి లాంటి చర్మం వల్ల ఇది సాధ్యమవుతుందని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. డాల్ఫిన్ శరీర నిర్మాణం సముద్రంలోని అలలకు అనుగుణంగా నీటి ఒత్తిడిని దాదాపు తొంభైశాతం తట్టుకొనే విధంగా ఉంటుంది.

ప్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కెల్లాగ్ డాల్ఫిన్ సమాచార వ్యవస్థ మీద అనేక ప్రయోగాలు నిర్వహించారు. రెండు వేర్వేరు డాల్ఫిన్లను 70 అడుగల దూరంలో వేర్వేరు నీటి కొలనులలో ఉంటారు. హైడ్రోఫోన్స్, స్పెషల్ టేప్ రికార్డ్ ను పెట్టి రెండు డాల్ఫిన్ల మధ్య అనుసంధానం చేశారు. ఈ ప్రతి ధ్వనులను డాల్ఫిన్లు గుర్తించి అర్థం చేసుకొని విశ్లేషించగలుగుతున్నాయని రుజువు చేశారు.

డాక్టరం జాన్ సి. లిల్లి అనే శాస్ర్తవేత్త డాల్పిన్ల మెదడు మీద అనేక ప్రయోగాలు జరిపారు. షుమారు 300 పౌండ్లు ఉండే డాల్ఫిన్ మెదడు 3.7 పౌండ్లు ఉందని అదే 150 పౌండ్లు గల మనిషి మొదడు 3.1 పౌండ్లు వుంటుంది. అంతేకాకుంా డాల్ఫిన్ల మెదడు బాగా అభివృద్ధి చెందినది. డాల్ఫిన్ల మెదడులోని కణాలు మానవునికి లాగానే అదే సంఖ్యలో ఉండటం గమనార్హం.

డాల్ఫిన్లు శబ్ధాలను అనుకరించగలవు. ముఖ్యంగా మానవుడి మాటలను, శబ్ధాలను అనుకరించగలవు. కొంత మంది శాస్ర్తవేత్తలు మానవుని కంటే ఎక్కువ జ్ఞాపకశక్తి డాల్పిన్లకుందని తెలియజేశారు.

డాల్ఫిన్ గనుక శాస్ర్తజ్ఞులు బావించినట్లు అత్యంత తెలివిగల జంతువు అని పరిశోధనలలో తేలితే మానవుడులాగా మొట్టమొదటగా మాట్లాడగల్గే ఒకే జీవి డాల్ఫిన్ అవుతుంది.

సముద్రంలో పడిన మానవులను అవి రక్షిస్తాయిని అనేక కథలున్నాయి. డాల్ఫిన్లు వస్తువులను నెడ్తుండడం ఆటలో ఒక భాగమని, అదేవిధంగా నీటిలో మునిగిన మనుష్యులనుకూడా నెట్టుకుంటూ ఒడ్డుకు చేరుస్తాయని ఆ విధంగా కొంతమందిని కాపాడి ఉండవచ్చని శాస్ర్తవేత్తలు తెలియజేశారు.

డాల్ఫిన్ షోలలో రకరకాల విన్యాసాలు చేయటం మీరు చూసే వుంటారు. బాలుతో ఆడటం, రింగులలో దుమకటం, అనుకరణలను చేయడం చూస్తాయి. ఇవి ఎటువంటి ట్రిక్కులనైనా పసిగట్టి అనుకరించగలవు.

డాల్పిన్ సంఘజీవులు. ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని వందలలో ఒకే ప్రదేశంలో కనిపిస్తాయి.

పిల్ల డాల్ఫిన్లు పెరిగి సొంతంగా ఆహారం సంపాదించుకునేంత వరకు వాటి ఆలన, పాలనతల్లి డాల్ఫిన్లే చూస్తాయి. నీటిలో తల్లి పాలు త్రాగుతూ సంచరించే పిల్ల డాల్ఫిన్లు ఒక్క చుక్క కూడా నీటిని నోటిలోకి పోనీయ్యవు. పుట్టుకతోనే వీటికి ఇంత నైపుణ్యం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పదిహేను, ఇరవై డాల్ఫిన్లు కలిసి జీవిస్తాయి. వేటాడడం కూడా సమిష్టిగా నిర్వహిస్తాయి. డాల్ఫిన్లు చేసే శబ్ధాలు వినేవారికి అరుపులు, కూతలులాగా కాకుండా అదొక భాషలాగా అనిపిస్తుంది. వాటి భాషను విశ్లేషించి అర్థం చేసుకోగలిగితే డాల్ఫిన్ల ద్వరా ఎన్నో సముద్ర రహస్యాలను తెలుసుకోవచ్చనని శాస్ర్తవేత్తలు బావిస్తున్నారు. డాల్ఫిన్ శబ్ధాలను ఎలక్ర్టానిక్ పరికరాల ద్వరా రికార్డు చేసి వాటిపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు.

1888 న్యూజిల్యాండ్ “ పోలారిస్ జాక్ ” అనే డాల్పిన్లు ఓడలను అనుకరించటం గూర్చి తెలుసుకున్నారు. అప్పుడు కొన్ని ఓడలు డాల్పిన్లను అనుసరించి సురక్షితంగా ఒడ్డు చేరుకున్నాయని చరిత్రకారులు చెబుతారు. అప్పటి నుండి అవి సముద్ర ఓడలకు సిపాయిలకు స్నేహ జీవులుగా మారిపోయాయి. ఓడ మోటార్ శబ్ధం వాటికి ఇష్టమైన శబ్ధం. అందువల్ల ఓడ వెంట ప్రయాణిస్తుంటాయని శాస్ర్తజ్ఞుల భావన.

పిల్ల డాల్ఫిన్లు పుట్టిన వెంటనే చూడగల్గుతాయి. వినగల్గుతాయి. తల్లిని గుర్తించగల్గుతాయి. తల్లితో శబ్ధాలతో సంభాషిస్తాయి. పిల్లడాల్ఫిన్లు తన తల్లితోపాటు ప్రక్కనే ఈదుకుంటూ వెళతాయి. అదే సమయంలో దాన్ని కాపాడటానికి ఇంకొక ఆడ డాల్పిన్ దాని ప్రక్కనే అనుసరించి ప్రయాణిస్తుంది. దీనిని “ అసిస్టెంట్ మదర్‌ ” గా శాస్ర్తవేత్తలు చెబుతారు. అది కడుపుతో ఉన్నప్పటి నుంచి కన్న తర్వాతద కొన్ని వారాల వరకు ఈ “ అసిస్టెంట్‌ మదర్ ” ఆ తల్లిని, పిల్లలను కనిపెట్టుకొని వుంటుంది. షార్క్ లాంటి చేపలు దాడి చేయకుండా కాపాడుతాయి. ఒక్కో సమయంలో ఏదైనా షార్క్ వల్ల ఆపద వచ్చినట్లు పసిగడితే ఈ అసిస్టెంట్ మదర్ తన అరుపులతో మిగతా డాల్ఫిన్లను పిలుస్తుంది. అప్పడు మిగతా డాల్ఫిన్లన్నీ కలసి గుంపుగా చేరి షార్క్ తో యుద్ధంచేసి దాన్ని మట్టి కరిపిస్తాయి.

డాల్పిన్లను పట్టుకోవటం చాలా జాగ్రత్తతో కూడిన వ్యవహారం. వలలో పట్టుకొన్న తర్వాత వాటిని ఫ్లాస్టిక్ ఫోమ్ గల బెడ్ల మీద చేర్చుతారు. వాటి చర్మం తడి అరిపోకుండా ఉండేందుకు చల్లని సముద్రపు నీటితో శరీరాన్ని తడుపుతారు. అయితే ఇట్లా పట్టు కొన్నప్పుడు ఇవి ఎటువంటి అల్లరి చేయకుండా ఉండటం విశేషం. కొన్ని సార్లు అవి భయానికి ఆతృతకు రక్తం విషపూరతమయ్యే వ్యాధి సంక్రమిస్తూ వుంటుంది.

అత్యంత తెలిలిగల జీవులు మానవుని స్నేహజీవి అయిన డాల్ఫిన్లు మానవుడు కలిగించే అనేక సమస్యల వల్ల చనిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆహారం కోసం వీటిని వేటాడి చంపుతున్నారు. ప్రమాదవశాత్తు చేపల వలలకు తగులుకొని కొన్ని మరణిస్తున్నాయి. తీర ప్రాంతాలలో కాలుష్యం, రసాయనాల వల్ల డాల్ఫిన్లు అనేక జబ్బులకు గురౌతున్నాయి.

మానవునికి ఎంతో మేలు కలిగించే డాల్ఫిన్లను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిమీద వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *