తేనెటీగలు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

తేనెటీగలు

చీమలలాగే తేనేటీగలు కూడా సంఘజీవులు. ఇవి పూలలోని మకరందాన్ని సేకరించి తియ్యటి తేనెను మనకు అందిస్తున్నాయి. పూల మకరందాన్ని సేకరించటంతోపాటు అవి పూల నుండి పుప్పొడి సేకరిస్తూ మొక్కల ఫలధీకరణానికి ఎంతో దోహదపడుతున్నాయి. తేనేటీగలు ఒక కిలో తేనెను సేకరించాలంటే ఒక లక్షా యాభైవేల తేనె బిందువులను పువ్వుల నుండి సేకరించాలి. ఒక పువ్వు నుంచి ఒక బింధువును సేకరించి “తేనేతెట్టు”లో దాచి పెడుతుంది. ఇలా తేనెను సేకరించటానికి రానుపోను షుమారు మూడు కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఆ లెక్కన ఒక కిలో తేనెను సమకూర్చటానికి అది షుమారు ఐదు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అంతకష్టపడి సేకరించిన తేనెను మనం హాయిగా ఆరగిస్తున్నాం. సంఘ జీవనంలో తేనే టీగలను మించిన జీవులు ఏవి లేవు అంటే అతిశయోక్తి కాదు. ఇవి ఒంటరిగా అసలు జీవించవు. ఒంటరిగా ఎక్కువ కాలం బతకవు.

ఒక తేనెటీగ కాలనీలో ఒక రాణి తేనెటీగ, వేల సంఖ్యలో శ్రామిక తేనెటీగలు ఉంటాయి. ఇవి నివశించటానికి, తేనె సేకరించటానికి గూడు కట్టుకొంటుంది. దీనిదే మనం తేనేతెట్టు లేదా తేనే పట్టు అంటున్నాం. ఇదీ ఈ తేనెతెట్టును ఎక్కడైన పెట్టవచ్చు. చెట్టు కొమ్మలకు, ఇళ్ళ వరండాలలో లేదా ప్యాక్టరీల రేకులకు ఇలా ఎక్కడైనా గూడు కట్టుకొంటాయి. రాణి ఈగ గూడ్లను పెడుతుంది. ఇది షుమారు ఒక రోజుకు 1500 గుడ్లను, సీజనులో 2,50,000 గుడ్లను పెడుతుంది. రాణి ఈగ దాని జీవితకాలంలో షుమారు పది లక్షల గుడ్లు పెడుతుంది. వీటి జీవితకాలం ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇవి గుడ్లను పెట్టడం వరకే వీటి పని. మిగతా సంరక్షణ అంతా శ్రామిక తేనెటీగలు చూసుకొంటాయి. ఇవి పెట్టిన గుడ్లలో కొన్ని రాణి ఈగలుగా, శ్రామిక ఈగలుగా మారుతాయి. మొదట్లో వీటి సమూహం వేలలో ఉంటుంది. దీని గూడు పూరైన పిదప షుమారు. 60,000 తేనెటీగలు ఒక్క గూడులో నివాసముంటాయి.

కొన్ని సీజన్‌లలో అన్నివేల తేనెటీగలు గూడులో క్షణం తీరలేకుండా పనిచేస్తుంటాయి. అయితే ఇన్ని వేల తేనె టీగలలో ఒక క్రమశిక్షణ, తేనేగ పరిశ్రమలో మనం గమనిస్తాం. ప్రతి శ్రామిక తేనెటీగ ఎటువంటి తరిఫీదు (ట్రైనింగ్) లేకుండానే అన్ని రకాల పనులు నిర్వర్తిస్తుంది. మొదట దాని పని ఒక్కొక్క గదిని శుభ్రం చేయటం, పాలిష్ చేయటంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లార్వాలకు ఆహారమందించటం, ఆ తర్వాత బయటకి వెళ్ళి తేనేను సేకరించడం మొదలవుతుంది. ఈ విధంగా అవి పెరిగే కొద్ది ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తు వస్తాయి.

అన్నీ కీటకాలలాగే వీటకిఆరుకాళ్ళు ఉంటాయి. దీని శరీరం మూడు భాగాలుగా ఉంటుంది. తల, మధ్య భాగం, పొట్ట తల భాగంలో రెండు పెద్ద సంయుక్త నేత్రాలు, మూడు సాధారణ నేత్రాలు ఉంటాయి. తల భాగంలోనే రెండు స్పర్శశ్వత్రగాలు కుట్టడానికి ఉపయోగపేడ జాస్‌లు, తేనేను పీల్చు కొనేందుకు ఒక నాలుక ఉంటాయి. థోరాక్స్ భాగంలో మూడు జతల కాళ్ళు, రెండు జతల రెక్కలు ఉంటాయి. అన్ని తేనే టీగ ప్రజాతులలోను కాళ్ళు పువ్వులోని పుప్పొడిని సంగ్రహించటానికి ఉపయోగపడతాయి.అనేక మొక్కలలో తేనెటీగల ద్వారా ఫలదీకరణం జరుగుంది. షుమారు 50 వ్యవసాయ ధార పంటలు తేనెటీగల ద్వారా గ్రహించే పుప్పొడి ద్వారానే ఫలదీకరణం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా తేనెనిస్తు మనకు ఉపకరిస్తు, పరోక్షంగా ఎంతో మేలుచేస్తున్నాయి.

తేనెటీగలు పూలలోని మకరందాన్ని మొక్కలకు తమ ఆహారం కోసమే సేకరిస్తాయి. మొత్తం తేనెటీగ కుటుంబం కోసం అన్నీ కలిసి కష్టపడి తేనెను సేకరిస్తాయి. తేనెతెట్టులో దాచిపెడతాయి. చలికాలంలో తేనెను ఆహారంగా ఉపయోగించుకొంటాయి. తేనెటీగల ఉదరభాగంలో ఒ సంచిలాంటి ప్రత్యేక భాగం ఉంటుంది. దీనికి, దాని ఉదర భాగాన్ని వేరుచేస్తూ ఒక వాల్స్ ఉంటుంది. తేనెటీగలు పూలనుండి మరకరందాన్ని పీల్చుకొనిఈ హోనిసాక్‌లోకి చేరుతుంది. అక్కడ మకరందంలోని చక్కెరలు కొన్ని రసాయన క్రియలకు లోనవుతాయి. ఆ తర్వాత ఈ మకరందాన్ని తేనెతెట్టులో ఉంచినప్పుడు ఈ మకరందంలోని నీరంతా ఆవిరై చిక్కటి తేనే తయారవుతుంది. ఈ తేనె పరిమాణం తేనెటీగలు తేనెతెట్టు పెట్టిన ప్రాంతం లేదా ఆ ప్రాంతంలోని పూలను బట్టి ఉంటుంది. తేనేలోఅమూల్యమైన ఔషధ గుణాలున్నాయి. అందుకేఆయుర్వేదంలో తేనెను విరివిగా వాడతారు. ముఖ్యంగా పిల్లకు మంచి పోషక ఆహారంగా తేనెను వాడుతారు.

తేనెలో ముఖ్యంగా లివులోజ్, డెక్స్ ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఉంటాయి. ఇంకా కొద్ది మొత్తంలో సుక్రోజ్ మాల్టోజ్, డెక్ట్సిన్, ఖనిజ లవణాలు, కొన్ని రకాల ఎంజైములు, విటమిన్లు, కొద్ది మొత్తంలో ప్రోటీన్‌లు, ఆసిడ్‌లు ఉంటాయి. అవి సేకరించిన మకరందాన్ని బట్టి తేనె రంగులోను, రుచిలోని కొద్దిగా తేడాలు ఉంటాయి.

మనదేశంలో తేనె సేకరణ గిరిజన ప్రాంతాలలో ఇది ఒక కుటీర పరిశ్రమగా వెలుగుతో తేనె టీగలను ఫారాలలో పెంచి తేనెటీగల పెంపకం ఒక కుటీర పరిశ్రమ అనేక ప్రాంతాలలో జరుగుతుంది. మన దేశంలో తేనెను విరివిగా వాడుతారు.

వెగల్‌ డాన్స్‌ః తేనెటీగల్లో ఉండే ఒక ప్రత్యేకమైన డాన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. దీనినే వెగల్ డాన్స్ అంటారు. ఇది ప్రకృతిలో వింతైన అరుదైన విషయం. ఈ డాన్స్ తేనెటీగల మధ్య ఒక కమ్యూనికేషన్‌లాగా పనిచేస్తుంది. ఈ డాన్స్‌ను మొట్ట మొదటిగా ఆస్ట్రేలియన్ జంతు శాస్త్రవేత్త కారల్ వాన్ ఫ్రిస్ కనుగొన్నారు. ఇందుకుగాను ఈయనకు 1973లో నోబెల్ బహుమతి లభించింది. ఆహారం కనుగొన్న ప్రాంతం ఎంత దూరంలో ఉంది. అనే విషయాలన్ని ఇతర తేనెటీగలకు తెలియజేసేందుకు ఈ వెగల్ డాన్స్ లేదా రౌండ్ డాన్స్‌ను చేస్తుంది. ఇది గుండ్రంగాను ఎనిమిది ఆకారంలోను క్లాక్‌ వైజ్‌ ఆంటి క్లాక్ వైజ్ నృత్యం చేస్తూ, ఇతర తేనెటీగలకు తన సందేశాన్ని తెలియజేస్తుంది. ఆహారం (పుష్పాలు లేదా మకరందం) కాలనీకి ఎంత దూరంలో ఉంది, ఏ దిక్కున ఉంది, ఎంత శాతం వుంది అనే విషయాలను ఈ వెగల్ డాన్స్ ద్వారా ఇతర తేనెటీగలకు తెలియజేస్తుంది. శ్రామిక తేనెటీగ.

అంతేకాకుండా తన కాళ్ళతో పుప్పొడిని మోసుకొచ్చి ఆయా పుష్పాల మకరందాన్ని కూడా వాటికి తెలియజేస్తుంది. పుట్టిన కొన్ని రోజులకే తేనెటీగలు ఎటువంటి తర్పీదు లేకుండా స్వతహగా ఈ ప్రక్రియను నేర్చుకోవటం విశేషం. గూటిలోని ఇతర తేనెటీగలకు ఒక ప్రత్యేకమైన వాసన ద్వారా ఈ విషయాన్ని అందజేస్తాయి. అంటే వెగల్ డాన్స్ ద్వారా ప్రత్యేక వాసనల ద్వారా అవి ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకొంటాయి. ఈ వెగల్ డాన్స్‌ను అద్భుతంగా వేగంగా చేసిందంటే అధికంగా ఆహారం కనుగొన్నానని అర్థం. ఆహారం షుమారు 100 అడుగల లోపు ఉంటే రౌండ్ డాన్స్‌ను చేస్తుంది. ఆహారం అంతకంటే ఎక్కువ దూరంలో వుంటే 8 ఆకారంలో డాన్స్ చేస్తుంది. దీనినే “టెయిల్ డాన్స్” అని కూడా అంటారు. ఈ టెయిల్ డాన్స్ ద్వారా ఆహారం కోసం ఎంత దూరం వెళ్ళాలి. ఏ దిక్కున వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అది ఒక నిమిషంలో 8 ఆకారంలో ఎన్నిసార్లు డాన్స్ చేస్తుందో అంత దూరంలో ఆహారం ఉన్నట్లు లెక్క. అది 8 ఆకారంలోచేసే డాన్స్ విధానాన్ని బట్టి అవి ఏ దిక్కులో ఉన్నాయో తెలియజేస్తుంది. ఉదాహరణకు అది ఒక నిమిషానికి 8 ఆకారంలో 11సార్లు డాన్స్ చేసిందంటే ఆహారం 2700 మీటర్ల దూరంలో ఉన్నదని లెక్కగట్టారు. 8 ఆకారంలో తిరిగేటప్పుడు, ఆకాశంలో సూర్యుడుండే దిశను బట్టి తన డాన్స్‌లో మార్పులు చేస్తుంది. ఆ విధంగా ఏ దిక్కులో ఆహారం ఉందో ఖచ్చితంగా తెలియజేయగల్గుతుంది.

అయితే మనదేశానికి చెందిన మండ్యమ్ శ్రీనివాసన్ అనే రిసెర్చి స్కాలర్ 1998లో ఈ సిద్ధాంతం తప్పని తన ప్రయోగం ద్వారా తెలియజేశారు. తేనెటీగలు ఎగురుతున్నప్పుడు వాటి పక్కనున్నవస్తువులు, దృశ్యాలు ఎంత వేగంగా కదులుతున్నాయనే ప్రాథమిక సూత్రం ఆధారంగా దూరాన్ని అంచనా వేయగల్గుతాయని ఆయన తెలియజేస్తున్నారు. ఈయన “మైలియోమీటర్” అనే పరికరం ద్వారా పై సిద్ధాంతం తప్పని ఆయన రుజువుచేస్తున్నారు. ఏది ఏమైనా వీటిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

తేనెతెట్టులో రాణి గది కాకుండా రెండు రకాల గదులు ఉంటాయి. కొన్ని చిన్నవి. ఇంకొన్ని పెద్దవి. పెద్ద వాటిలో డ్రోన్స్ లేదా మగ ఈగలకు సంబంధించినవి. అయితే శ్రామిక ఈగల కోసం చిన్న గదులే ఎక్కువగా ఉంటాయి. ఒక పెద్ద గదిలో మగ గుడ్డును, చిన్న గదుల్లో ఆడుగుడ్డును పెడుతుంది. ఈ విధంగా ఆడ మగ గుడ్లను గుర్తించి వేరు చేయటం ప్రకృతిలో వింతైన విషయం.

శ్రామిక ఆడ ఈగలకు, రాణి ఈగకు ఆకారము. కొలతలలో, అది పనిచేసే పనిలోను లేడా ఉంటుంది.అయితే రాణి ఈగను సాధారణ శ్రామిక ఈగ నుంచి ఒక దాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొంటాయి. లార్వా దశలోనే దీనిని రాణి గదిలో ఉంచి ప్రత్యేకంగా ఆహారం అందించటం వల్ల అది రాణి గదిలోకి మారుతుంది. ఈ రాణి ఈగ షుమారు నాలుగు సంవత్సరాలు చురుకుగా ఉంటూ రోజుకు 2000 వరకు గుడ్లు పెట్టగలిగి ఉంటుంది.

పూలు పుష్పించే కాలంలో వీటి జీవిత చక్రం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో అధికంగా కష్టపడి తేనెను సేకరించకపోయినట్లైతే చలికాలంలో అవి భాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఆ రెండు నెలలు బాగా కష్టపడతాయి. ఒక సమూహాంలో ఎక్కువగా ఉన్న యువశ్రామిక ఈగలు వేరే సమూహంగా ఏర్పడి తమ కార్యక్రమాలను కొనసాగిస్తాయి. ఈ విధంగా నిరంతరం తమ సంతతిని పెంచుకుంటూ అనేక మొక్కలకు పంటలకు ఫలదీకరకు సహాయపడుతూ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ మానవునికి ఎంతో మేలు చేస్తున్నాయి తేనెటీగలు.

సూచనః మీ పరిసరాల్లో కనిపించే తేనెటీగలను దూరం నుండి గమనించండి. అవి ఏమొక్కలపై ఎక్కువగా ఆకర్షతమౌతున్నాయో గమనించండి. ఎక్కువగా ఎటువంటి ప్రాంతాలలో తేనె తెట్టును పెడుతున్నాయో గమనించండి. ఏ మాసంలో తేనెతెట్టును పెడుతున్నాయో గమనించి పుస్తకంలో వివరాలు వ్రాసుకోండి. మీ దగ్గరలో తేనెటీగల పెంపక కేంద్రం ఉంటే వానిటి సందర్శించి అక్కడ వాటిని పెంచే విధానాన్ని, తేనె సేకరించే విధానాన్ని గూర్చి తెలుసుకోండి. తేనె తేట్టు నుండి తేనెను ఎలా సేకరిస్తారో తెలుసుకోండి.

 

ఒక కిలో తేనె ఐదు లీటర్ల పాలకు సమానం. ఒకటన్నర కిలోల మాంసానికి సమానం, నలభై బత్తాయి పళ్ళకు సమానం, యాభై కోడిగుడ్లకు సమానం.

 

తేనెతెట్టులో తయారైన మైనం (వాక్స్)ను లోషన్స్, క్రీములలో లిప్‌ స్టిక్, ఆయింట్‌మెంట్‌, పాలిష్‌లు, లూబ్రికెంట్స్‌లు విరివిగా ఉపయోగిస్తారు.

 

పొద్దుతిరుగుడు పంటలు, తేనెటీగల ద్వారా ఇరవై ఐదు శాతం అధిక దిగుబడులు సాధించినట్లు పరిశోధనలో వెల్లడైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *