పెంగ్విన్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

పెంగ్విన్

పెంగ్విన్ నడక, ప్రవర్తన గమనించినపుడు అవి మర్రుగుజ్జు మనష్యులలాగా మనకు అనిపిస్తాయి. వెనుకవైపు నల్లగా, ముందు వైపు తెల్లగా నీట్‌గా డ్రస్ చేసుకొన్న వ్యక్తిలా కనిపిస్తాయి. అంతేకాకుండా దాని రెక్కలు మనిషి చేతులు లాగా అనిపిస్తాయి. అది నడిచే విధానం కూడా మనిషిని పోలి ఉండడం విశేషం. పెంగ్విన్లు కూడా మనుష్యులను పెద్ద సైజు పెంగ్విన్లుగా భావించి దగ్గరకు చేరిన సందర్భాలు ఉన్నాయిని పరిశోధకులు గమనించారు.

వీటి శాస్ర్తీయ నామం “ఆస్టినోడైటిసం” ఫోస్టేరి ఇవి మొత్తం పదిహేడు జాతులున్నట్లు అంచనా. వీటిలో ఎంపరర్ పెంగ్విన్ అన్ని జాతుల కన్నా పొడవైనవి. ఇవి షుమారు 112-115 సెం.మీ ఎత్తు, ముపై కిలోల బరువు వుంటాయి. అతి చిన్న పెంగ్విన్లు నలభై సెం.మీటర్లు ఎత్తు, రెండు కిలోల బరువు వుంటాయి.

ఇవి ఎక్కవగా అంటార్కిటిక మంచు ఖండంలో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ నలభైఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుంటుంది. అతి తీవ్రమైన శీతల గాలులు వీస్తుంటాయి. అయినా పెంగ్విన్లు మాత్రం గూడు కట్టుకోవు. పెంగ్విన్ శరీరంపై ఈకలు, చర్మం  లోపలి వైపు రెండు మూడు సెం.మీ మందంలో వుండే క్రొవ్వు పొర, ఇవి అతి శీతల వాతావరణానికి తట్టుకొనేట్లు చేస్తాయి. అంటార్కిటికాలో మార్చి నెలలో మంచుకాలం వస్తుంది. అందువల్ల మిగతా జంతువులు, పక్షులు వలస వెళతాయి. అయితే ఎంపరర్ పెంగ్విన్లు ఎక్కడికీ కదలవు. ఆ ప్రాంతంలో అన్నీ జీవులు వసంతకాలంలో గుడ్లను పెట్టి పొదుగుతాయి. దీనికి ఒక ప్రత్యేక కారణం వుంది. పెంగ్విన్ల జీవనమంతా మంచుపైనే కదా.. అంటార్కిటికాలో డిసెంబర్ నెల వచ్చే సరికి మంచు కరగటం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో లో పిల్ల పెంగ్విన్లు చలికి చనిపోయే ప్రమాదం వుంది. అందుకే డిసెంబర్ నాటికి పిల్లలు పెరిగి పెద్దవవుతాయి. కాబట్టి వాటికి భయం లేదు.

ఇతర పెంగ్విన్లు సీజన్లో రెండు మూడు గుడ్లు పెడతాయి. అయితే ఎంపరర్ పెంగ్విన్ మాత్రం ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన వెంటనే దాని సంరక్షణా భారమంతాను మగ పెంగ్విన్ చూసుకొంటుంది. దాన్ని పొదిగే బాధ్యత కూడా మగ పెంగ్విన్ దే. ఈ మగ ఎంపరర్‌ పెంగ్విన్‌లు గుడ్డును తమ కాళ్ళ మీద పెట్టుకొని గుడ్డుకు చలి తగలకుండా తన శరీరానికి కప్పుతుంది. ఎన్ని మంచు తుఫాన్లు వచ్చినా అది కదలకుండా షుమారు ఆరవై ఐదు రోజులపాటు అలాగే ఉండిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే గుడ్డు పిల్లగా మారే వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవు.

ఈ సమయంలో ఇది దాదాపు సగం బరువును కోల్పోతుంది. రెండు నెలల తర్వాత వేటకు వెళ్ళిన ఆడ పెంగ్విన్ తిరిగి వస్తుంది. అప్పుడు పిల్ల బాధ్యత ఆడ పెంగ్విన్‌కు అప్పచెప్పి మగ పెంగ్విన్ వేటకు బయలు దేరుతుంది. పిల్లలు ఐదు నుండి పది రోజుల వయస్సు వచ్చే సరికి స్వతంత్రంగా జీవించగల్గుతాయి.

మూడు ఇంచెలు కల్గిన దీని పాదాలతో ఇది నిమిషానికి ఇరవై అడుగులు వేయగల్గుతుంది. ఇవి పక్కకు నడిచేటప్పుడు దాని రెక్కలు బ్యాలెన్సింగ్ పోల్స్‌లాగా పనిచేస్తాయి. దాని నడక పొట్టి కాళ్ళుగల లావుపాటి మనిషి నడుస్తున్న తీరులో వుంటుంది. ఇవి అలసి పోయినప్పుడు భయపడినప్పుడు లేదా ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు మాత్రం పొట్టను ఆసరా చేసుకొని మంచులో కాళ్ళతో నెట్టుకుంటూ రెండు రెక్కలను తెడ్డులాగా ఉపయోగించుకొని వేగంగా వెళ్ళగల్గుతాయి. ఈ విధంగా గంటకు పది మైళ్ళ వరకు ప్రయాణించగల్గుతాయి. ఇట్లా ఇవి చలికాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి షుమారు ఐదు తొమ్మిది వందల మైళ్ళ దూరం నుండి తిరిగి వస్తాయి.

ఇంగ్లాండ్‌కు చెందిన డాక్టర్ జూలియన్ విన్సెంట్ అనే శాస్ర్తవేత్త పెంగ్విన్లపై విస్తృత పరిశోధనలు జరిపారు. ఆయన పరిశోధనల్లో పెంగ్విన్లు అంతటి తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి కారణం దాని శరీరం మొత్తం మృదువైన ఈకలతో కప్పబడి ఉండటమేనని చెప్పారు. దాదాపు ఎనబైశాతం రక్షణ ఈకల నుండే లభిస్తుంది.

పెంగ్విన్ శరీరంపై ఈకలు పై నుంచి క్రిందకు ఉంటాయి. ఈ ఈకల మధ్యలో చిన్న చిన్న గాలి తిత్తులు ఏర్పడుతాయి. దీని ఈకలు పొడవుగా వుంటాయి. ఇవి పొడవుగా వంపు తిరిగి ఉండడటం వల్ల క్రింద ఉండే రెక్కలు పైకి నెడ్తూ వుంటాయి. ఈ విధంగా ఈకలు మధ్య భాగాలలో గాలితిత్తులు ఏర్పడి శరీర ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతాయి.

డాక్టర్ విన్సెంట్ ఇలాంటి పెంగ్విన్‌కు గల ఇన్సులేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి దుస్తులు తయారు చేయడంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *