ప్లయింగ్ టైగర్స్ దోమలు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ సెంటర్

ప్లయింగ్ టైగర్స్ దోమలు

ఆగస్టు ఇరవైవ తేదీ వరల్డ్ మస్కిటో డే

ఆగస్టు పదవ తేదీ డెంగు ప్రివెన్షన్ డే

 

ప్లయింగ్ టైగర్ అనేది “ఎడన్ ఎజిప్ట్” అనే ఒక దోమ పేరు.అయితే మనం అన్ని రకాల దోమలకు ఆ పేరు పెట్టవచ్చు. ఎందుకంటే మానవుడి రక్తాన్ని పీల్చుకొనే దోమలకుఅది సరైన పేరే. సాయంత్రం ఆరయ్యే సరికల్లా వాటి వేట ప్రారంభమవుతుంది. ఎక్కడా కూర్చోనివ్వవు, నిల్చుకోనివ్వవు, చదువుకోనివ్వవు. మనల్ని కుట్టి రక్తాన్ని పీల్చుకోవటమే వాటి పని. అంత వరకు ఆగితే పర్వాలేదు. అంటువ్యాధి క్రిములను మన శరీరంలోకి ప్రవేశపెట్టడం వాటికి సరదా… మనకు ప్రాణ సంకటం.

దోమకాటు అంటే ముందు మనకు గుర్తొచ్చేది మలేరియా. ఇదే కాదు ఎల్లోఫివర్, డెంగ్యూ ఫివర్, మెదడువాపు వ్యాధుల్ని వ్యాపించచేసేది దోమలే. పైలేరియా (బోధకాలు) కూడా దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధి.

ముఖ్యంగా “ప్లాస్మొడియం ఫాల్సిఫారమ్” అనే సూక్ష్మ జీవి మలేరియా వ్యాధిని కలుగుజేస్తుంది. ఇది పరాన్న జీవి. దోమలలో ఏనాఫిలిస్ అనే ఆడ దోమ లాలా జల గ్రంథులలో ఇది స్థావరం ఏర్పరచుకొంటుంది. ఈ దోమలు మన శరీరం మీద వాలి రెండు మీటర్ల లోతు వరకు తన నోటి బాగంలో ఉండే సూది లాంటి మొనతో గుచ్చుతుంది. ఈ సమయంలో దాని లాలా జల గ్రంథుల్లోంచి లాలాజలం ఊరుతుంది. అది సూది మొనకు లూబ్రికెంట్‌గా ఉపయోగపడుతుంది. అయితే షుమారు బొంభై సెకండ్ల పాటు మన రక్తాన్ని పీల్చుకొనే దానికన్నా అది విడుదల చేసే లాలాజలం మనకు అత్యంత ప్రమాదకరం.

ఎనాఫిలిస్ దోమల లాలాజలంలో ఉండే ఈ ప్లాస్మోడియం పాల్సిపారమ్ అనే ప్రోటోజోషన్ లాలాజలం ద్వారా మనిషి రక్తంలోకి నేరుగా చేరుతుంది. ఇక అక్కడ నుండి దాని ప్రతాపం ప్రారంభమవుతుంది. ముందుగా ఎర్ర రక్త కణాలపై దాడి చేసి క్రమంగా వాటిని క్షీణింపచేసి, రక్తహీనతను కలుగజేస్తుంది. మూర్ఛరోగం కలుగుచేస్తుంది. మూత్ర పిండాలను పాడు చేస్తాయి. తొలిదశలోనే వ్యాధిని కనుగొని చికిత్స చేయకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమే. ఈ మలేరియా వ్యాధి కారకాల్ని కనుగొన్నది భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ శాస్ర్తవేత్త రొనాల్డ్ రాస్. ఆయన ఈ వ్యాధిని కనిపెట్టి 107 సంవత్సరాలు అవుతున్నా దీన్ని రూపు మాపటం మనకు సాధ్యం కావటం లేదు.

పదిహేడువందల యాభైమూడులో మలేరియా అనే పదాన్ని వాడినట్లు తెలుస్తోంది. మలే అంటే గ్రీకు భాషలో చెడు అని అర్థం. దుర్ఘంధం కారణంగా జ్వరం వస్తుందని ఆ వ్యాధికి మలేరియా అని పిలిచేవారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్ల మంది మలేరియా వ్యాధిగ్రస్తులవుతుంటే షుమారు వారిలో పది నుంచి ముఫై లక్షల మంది దాకా చనిపోతున్నారు. మన ప్రాచీన గ్రంథాలయిన అదర్వణ వేదం, చరక సంహితలో దీని ప్రస్తావనవుంది.

మలేరియా సోకినప్పుడు రోగికి తలనొప్పి, చలి జ్వరం వస్తుంది. ఇరవైనాలుగు గంటల లోపు ఈ జ్వరం వస్తూ పోతూ వుంటుంది. మలేరియా అంటువ్యాధి. మలేరియా రోగిని దోమలు కుట్టినప్పుడు ఈ రోగి కారక జీవులుఆ వ్యక్తిలోకి చేరుతాయి. ఈ విధంగా మలేరియా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ నిశాచరి. పగలంతా నిద్రపోయిన  రాత్రి సమయాలలో విజృంభిస్తుంది.

దోమలకు నిలయాలు నీళ్ళు, నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటే అది చిన్న గుంట కావచ్చు, బాత్రూంలో టబ్ కావచ్చు, కాలువల్లో, జలాశయాల్లో, ఎక్కడ నీళ్ళుంటే వాటి స్థావరం అక్కడ. ఫ్లయింగ్ టైగరం అనే దోమ చల్లటి ప్రదేశాలను తన స్థావరంగా చేసుకుంటుంది. ఎయిర్‌ కండీషనర్లు, కూలర్లు, ప్లవర్ వాజ్‌లు, పాత టైర్లు వీటి స్థిర నివాసం.

దోమలలో మొత్తం రెండువేల ఐదు వందల తెగలను గుర్తించారు. వాటిలో వందల తెగలు హానికరమైనవిగా గుర్తించారు. మనిషిరక్తం మీద బతికేవి చాలా తక్కువ. ముఖ్యంగా ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిన్ ఎజిప్టి అనే మూడు జాతులు అత్యఁత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. ఎనాఫిలిస్ ఆడ దోమలు మలేరియా కారకాలైతే, క్యూలెక్స్ దోమలు జపనీసం ఎన్సెఫలైటీస్ (మెదడువాపు వ్యాధి)కి కరకాలు. ఇవి బాతుల్లోను, కొంగల్లోను, పందుల్లోను నివాసం ఏర్పరచుకొని సూక్ష్మ జీవుల్ని మనిషి శరీరంలోకి వ్యాపింపచేస్తాయి. వీటి ముఖ్య స్థావరాలు మురుగు నీరు నిల్వ ఉండే ప్రదేశాలు. ఈ సూక్ష్మ జీవులు మనిషి రక్త కణాల ద్వారా నేరుగా మెదడును చేరుకుంటాయి. మెదడు కణజాలాన్ని నశింపచేసి వాంతులు, జ్వర లక్షణాలతో చివరిగా కోమాలోకి తీసుకెళుతుంది.

ఎడిన్ ఎజిప్ట్ (ఫ్లయింగ్ టైగర్) రిస్టివాలిఫీవర్ (ఎల్లో ఫీవర్)ను వ్యాపింపచేస్తుంది. చిక్ గున్యా అనే వైరస్ ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఇది ఫ్లయింగ్ టైగర్ లాలా జలంలో స్థిర నివాసం ఏర్పరచుకొంటుంది. ఈ దోమ మనిషిని కుట్టిన వెంటనే రక్తంలో ప్రవేశించి జీర్ణాశయాన్ని చేరుకుంటుంది. పచ్చ కామెర్ల వ్యాధిని కలుగజేస్తాయి. క్యూలెక్స్ దోమ పైలేరియా వ్యాధిని వ్యాపింపచేస్తుంది.

దోమలకు చరిత్రలో విశిష్టస్థానముంది. మమ్మీలపై పరిశోధనలలో వాటి శవ పరీక్షలలో మలేరియాతో మరణించిన సంఖ్య ఎక్కువేనని తేలింది. అలెగ్జాండర్ మూడు వందల ఇరైవై మూడులో మార్గ మద్యంలో మరణించటానికి కారణం మలేరియానే కారణమట. పదిహేడు వందల నలభై ఒకటిలో బ్రిటన్ ప్రభుత్వం పెరు మెక్సికోకు దండయాత్రకు ఇరవై ఏడు వేలమంది సైనికులను పంపిందట. అందులో తిరిగి వచ్చినవారు ఏడు వేలమంది. మిగతా ఇరవైవేలమంది యుద్ధంలో చనిపోలేదు. ఎల్లో ఫీవర్తో మరణించారు.

ఇక మనదేశానికి వస్తే  పంతొమ్మిదివందల అరవైఐదు దాకా మలేరియా వ్యాధి అదుపులో వున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత సంవత్సరాలలో చాప క్రింద నీరులాగా ఈ వ్యాధి వ్యాపిస్తూనే వుంది.

ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో దీని వాత పడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వాలు, ప్రజల నిర్లక్ష్యమే. దోమలను నివారించటానికి ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొదటి చర్య.మురికి నీటి గుంటల్లో, కాలువల్లో కిరసనాయులు, డిడిటి లాంటి క్రిమి సంహారక మందులు చల్లటం చేయాలి. దోమ తెరలను కట్టుకోవడం, మస్కిటో రిపెల్లంట్లను వాడటం ముఖ్య చర్యలు.

మన దేశంలో ఎనాఫిలిస్ దోమలు లేని రాష్ర్టం అసలులేదు. శతాబ్ధాల పాటు వానలు కురవని సహారా ఎడారి లాంటి ప్రాంతాలలో కూడా ఎన్ని సంవత్సరాలైన దోమ గుడ్లు చెక్కు చెదరవు. చిరుజల్లు కురవగానే దోమలు వెలువడి విజృంజిస్తాయి.

దోమలు ఒక సెకనులో రెండవందల యాభై నుండి ఐదు వందల సార్లు రెక్కలు కొట్టుకుంటుంది. గంటలకు ఐదు కి.మీ వేగంతో ఎగురుతుంది. షుమారు యాభై-డెబైఐదు మైళ్ళు దూరం వరకు ప్రయాణించగలవు. దోమలు వందల అడుగల ఎత్తు వరకు ఎగరగలవు. మనిషి మీద వాలిన దోమ కొన్ని మిల్లి గ్రాముల రక్తాన్ని పీల్చుకోవటానికి తొంభై సెకండ్ల టైము తీసుకుంటుంది. అదితన శరీర బరువుకంటే రెండు మూడు రెట్లు అధికంగా రక్తాన్ని పీల్చుకుంటుంది.

దోమలుకుట్టినప్పుడు మనకు నొప్పి, దద్దుర్లు, ఎలర్జీ వస్తుంది. దోమ మన శరీరం మీద కుట్టినప్పుడు దోమ తన లాలా జలాన్నిశరీర బాగంలో విడుదల చేస్తుందని తెలుసుకొన్నాం. ఈ లాలా జలంలో యుద్ధం చేయటానికి  మన శరీర జీవకణాలు హిప్టామైన్ అనే రసాయనాన్ని అక్కడ విడుదల చేస్తాయి. రక్తకణాలు అక్కడకు చేరుతాయి. అందువల్ల దోమ కుట్టిన చోట మనకు వాస్తుంది.

అయితే అదృష్టవశాత్తు ఎయిడ్స్ వైరస్ దోమల ద్వార వ్యాపించదు. ఎయిడ్స్ వైరస్ దోమ లాలాజలంలో వృద్ధి చెందే అవకాశం లేదు. ఒక యూనిట్ ఎయిడ్స్ వైరస్ను మానవ శరీరంలో ప్రవేశపెట్టాలంటే అది పది మిలియన్ సార్లు కుట్టాలి. అది అసంభవం.

మగ దోమల జీవిత కాలం సరాసరి ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు.ఆడ దోమల జీవిత కాలం ముపై రోజులు. మగ దోమలు సాధారణంగా మొక్కల నుంచి లభించే రసాయనాలపైనే ఆధారపడతాయి.

మిగతా కొన్ని రకాల కీటకాలులాగా వాసన, స్పర్శజ్ఞానం కలిగించే రెసిస్టార్స్ వుంటాయి. కొన్నింటికి నోటి బాగాలలో, కొన్నింటికి కాళ్ళలో ఈ రిసిస్టార్స్‌లు ఉంటాయి.

దోమల కాళ్ళు మానవ శరీరంపై స్థిరంగా నిలబడి కుట్టటానికి అనుకూలంగా ఉంటాయి. ఆడ దోమ కాళ్ళకు టెన్నీస్ షుస్ లాగా ప్రిక్షన్ పాడ్స్, హుక్స్ ఉంటాయి. ఆ విధంగా స్థిరంగా నిలబడి బోలుగా ఉండే ట్యూబు లాంటి పరికరం సహాయంతో రక్తాన్ని పీల్చుకొంటుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం దోమలు ఎక్కవుగా తెల్లటి గుడ్డలకు, లైట్ కలర్లో ఉండే గుడ్డలకు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని గ్రహించారు. అంతేకాదు. ఎక్కవగా గాలి పీల్చుకొనే వ్యక్తుల మీద కూడా ఆకర్షిస్తున్నాయని తెలియజేస్తున్నాయి.

సాధారణ ఆడ దోమలు నీటి మీద గుడ్లు పెడతాయి. దోమ లార్వా ప్యూపాగా మారి నీటి ఉపరితలానికి చేరుతుంది. ఈ నీటి మీద కిరోసిన్ చల్లటం వల్ల నీటి తలతన్యత తగ్గి లార్వా నీటిలో మునిగి పోతుంది. కాబట్టి ఈ దశలో దోమలను నిర్మూలించటం సులభం.

ఎంటమాలజిస్టుల అంచనాల ప్రకారం పక్షులు కొన్ని రకాల కీటకాలు, చేపలు, కొన్ని రకాల జంతువులు దోమలనే ఆహారంగా కలిగి జీవిస్తున్నాయి. దోమలను పూర్తిగా నిర్మూలించటం కూడా ప్రమాదమే.. ఎందుకంటే ఈ జీవులన్నీ ఆహారం కోసం మానవుణ్ణి చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *