బీర్బల్ సహాని 

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

బీర్బల్ సహాని 

బీర్బల్ సహాని భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష , గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రం లో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీం ఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ!

బాల్యం-విద్యాభ్యాసం 

బీర్బల్ సహాని 1891 సంవత్సరం నవంబరు 14 వ తేదీ పశ్చిమ పంజాబ్ (యిప్పుడు యిది పాకిస్థాన్ లోనిది) రాష్ట్రంలోని షహరాన్ పూర్ జిల్లాలో గల బెహరా పట్టణంలో జన్మించాడు. తండ్రి లాలా రుచిరామ్‌ సహాని రసాయనిక శాస్త్రోధ్యాపకుడు.తల్లి ఈశ్వరీదేవి స్వాతంత్ర్య సమరయోధులైన మోతీలాల్ నెహ్రూ , గోపాలకృష్ణ గోఖలే , సరోజినీ నాయుడు , మదనమోహన మాలవ్యా వంటి వారు బీర్బల్ సహానీ తండ్రికి ముఖ్య స్నేహితులే.

  బీర్బల్ సహాని విద్యాభ్యాసం లాహోర్ లోని భారత ప్రభుత్వ విశ్వవిద్యాలయం కళాశాలలో జరిగింది. 1911 సంవత్సరం వరకూ పంజాబ్ విశ్వవిద్యాలయం లో చదువుకున్నాడు. తండ్రికి బీర్బల్ సహానీ ఐ.ఎ.ఎస్ గానో ఐ.పి.యస్ గానో చూడాలని కోరుకునేవాడు. అయితే బీర్బల్కు మాత్రణ్ వృక్ష శాస్త్రం మీద, మొక్కలు, వాటి శిలాజాల తీరుతెన్నుల మీద అమితమైన ఆసక్తి ఉండేది.

                పంజాబ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రత సాధించిన తర్వాత బ్రిటన్ లోని లండన్ యూనివర్సిటీ నుంచి”డాక్టర్ ఆఫ్ సైన్స్” పట్టాను పొందారు. అది ఆరోజుల్లో కూడా గొప్ప అరుదైన గౌరవం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఒక భారతీయుడు “డాక్టర్ ఆఫ్ సైన్స్” పట్టాను సాధించటం అదే మొదటిసారి. ఆ ఘనత సాధించింది బీర్బల్ సహానీ! బోటనీ ప్రధానాంశంగా బీర్బల్ సహాని సాధించిన ఈ డాక్టరేట్ కు ఎన్.ఆర్.కాశ్యప్, ప్రొఫెసర్ అ.సి. సివార్ట్ వంటి మేదావులు తోడ్పాటు నందించారు. 1936 సంవత్సరంలో బీర్బల్ సహానీ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అయ్యారు.   :   పరిశోధనలు  :  1917 లో ప్రొఫెసర్ సివార్డ్ తో కలసి బీర్బల్ సహానీ భారతీయ గోడ్వానా వృక్షాల మీద విస్తృత పరిశోధనలు చేశారు. భారతీయ వృక్ష జాతుల మీదే కాక పాశ్చాత్య దెశాల్లో పెరిగే వృక్ష జాతుల లక్షనాలమీద కూడా లోతైన అధ్యయనం చేశారు సహనీ. బీహార్ రాష్ట్ర రాజమహల్ పర్వత సానువుల్లో పెరిగే వృక్షాలు,మొక్కలు వాటి వైవిధ్యం, వాటికీ ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నదో తరచి తరచి పరిశోధనలు చేశారు.

                విలియం సోనియా సేవార్డియానా, రాజ్‌మహాలియా వరోదరా, హోమోగ్జ్రెలాల్ రాజ్ మహలెన్స్ వంటి శిలాజాతుల గుట్టువిప్పి ప్రపంచానికి పరిచయం చేసింది బీర్బల్ సహానీయే! సహానీ ఆవిష్కరించిన “పెంటోగ్జైలియా” అనే శిలాజపు జిమ్మెస్పెర్ం ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. శాస్త్రవేత్తల దృష్టి సహానీ పరిశోధనల మీదకు మళ్ళించింది. 1920 వ సంవత్సరం శ్రీమతి సావిత్రి సూరి ని పెండ్లాడారు బీర్బల్ సహాని. అటు పిమ్మట భారత్ వచ్చి కాశీ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వృక్షశాస్త్ర విభాగపు అధిపతిగా నియుక్తులయ్యారు బీర్బల్ సహాని.

                లక్షల సంవత్సరాల క్రితం,. జూరాసిక్ రాక్షసబల్లుల కాలానికి చెందిన ఎన్నో వృక్షశిలాజాలను తన పరిశోధనల ద్వారా నిర్దుష్టంగా లెక్కకట్తి ప్రకటించారు. తన నిరంతర పరిశోధనలతో అనేకానేక శిలాజాలు, మొక్కల యొక్క జీవితకాలాన్ని లెక్కించడమే కాదు, తన గురుత్వంలో శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులచేత దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నో శిలాజాలను సేకరింపజేసి వాటి గుట్టు విప్పార్ బీర్బల్ సహాని. సహాని కృషి ఫలితంగా వృక్షజాతుల,శిలాజాల అధ్యయనం కోసం ప్రత్యేక విభాగమే యేర్పడి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగింది. భారతదేశంలోని మొట్టమొదటి వృక్ష శాస్త్ర శిలాజ పరిశోధనా కేంద్రంగా ఏర్పడింది.

భూగర్భ శాస్త్రవేత్త 

ప్రపంచంలోని ప్రఖ్యాత వృక్ష,జంతు శాస్త్రవేత్తలైన ఎ.అర్నార్డ్ వంటి ఎంతో మంది మేధావులతో బీర్బల్ సహానీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

 బీర్బల్ సహాని కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. భూగర్భ శాస్త్రవేత్త కూడా. బీర్బల్ అధ్యయనాలు భూమి ఒకప్పుడు ఒకే ఖండంగా ఉందనీ, కాలక్రమేణా రోదసీలో చోటు చేసుకున్న అనేక భౌతిక,రసాయన మార్పుల కారణంగా భూమి మధ్య నీరు ఏర్పడి 5 ఖండాలుగా రూపాంతరం చెందిందనీ చెబుతున్నాయి. ఈ ముక్కలైన ఖండాలు నిరంతరం చలనశీలత కలిగి ఉంటాయని సిద్ధాంతీకరించారు సహాని.

భూమి పొరల్లో, వెలుపలా, ఉండే అనేక శిలల వయస్సును ఖచ్చితంగా లెక్కగట్టడం, ఎలాటి అధునాతన సున్నిత పరికరాల సహాయం లేకుండా ఖచ్చితంగా కనుగొనడం ఒక్క బీర్బల్ సహానీకే సాధ్యపడింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని “సాల్ట్‌రేంజ్ శిలల” వయస్సు అప్పతి వరకూ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నట్లు 10 కోట్ల సంవత్సరాలు కాదనీ ఈశిలల వయస్సు 4 లేదా 5 కోట్ల సంవత్సరాల క్రిందవనీ ఆధారాలతో నిరూపించారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్న “దెక్కన్ ట్రాప్స్” వయస్సు 65 కోట్ల సంవత్సరాలని కూడా బీర్బల్ సహానీ పరిశోధనలు చెబుతున్నాయి.

కాల నిర్ణయం   

ప్రాచీన నాణేలను పరిశీలించి వాటి కాలనిర్ణయం నిర్దేశించడం సహానీకి కొట్టిన పిండి. 1936 లో నాణేల మీద బీర్బల్ సహానీపరిశోధనలకు గాను న్యూమిన్ మెట్రిక్స్ సొసైటీ ఈయనకు “నెల్సన్ రైట్స్” మెడల్ ను ప్రదానం చేశారు. నాణేలను స్టాంపులను సేకరించి పరిశోధించడం అంటే బీర్బల్ కు ఎంతో ఆసక్తి. బీర్బల్ సహానీ మంచి చిత్రకారుడు కూడా. మట్టి బొమ్మలను అద్భుత శిల్పాలుగా తీర్చిదిద్దగల దిట్ట.

సత్కారాలు   

లండన్ లోని రాయల్ సొసైటీ 1936 వ సంవత్సరంలో బీర్బల్ సహానీని ఫెలోఆఫ్ రాయల్ సొసైటీ గా ఎంపిక చేసి గౌరవించింది. వృక్ష శాస్త్ర విభాగంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ సాధించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త సహానీ. 1930 – 35 సంవత్సరాల కాలానికి పాలియోబోటనీ విభాగానికి ఉపాధ్యక్షునిగా 5వ మరియు 6వ అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశానికి నియమితులయ్యారు బీర్బల్ సహానీ. 1940 సంవత్సరంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. 1937-39 , 1943-44 నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు అధ్యక్షుడయ్యాడు. 1948 వ సంవత్సరంలో బీర్బల్ సహానీకి అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సభ్యత్వం లభించింది.

పెలనో బోటనీ ఇనిస్టిట్యూట్ 

 బీర్బల్ సహాని మార్గదర్శకత్వంలో లక్నో పట్టణంలో “పేలనీ బోటనీ ఇనిస్టిట్యూట్” భారతదేశంలో మొట్టమొదటి పురావృక్షశాస్త్ర ప్రయోగశాల నెలకొల్పడానికి ప్రతిపాదనలౌ వచ్చాయి. లక్నో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో యిందుకోసం నూతన భవన నిర్మాణానికి 1949 ఏప్రిల్ 3 వ తేదీన అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంఖుస్థాపన చేశరు. బీర్బల్ సహానీ తన కలల సౌధం సాకారం దాల్చుతోందన్న ఆనంద్ంలో తలమునకలయ్యారు. సహ శాస్త్రవేత్తలూ, విద్యార్థులూ, యువ శాస్త్రవేత్తలందరూ ఈ శుభతరుణం కోసం ఎన్నేళ్ళనుండో వేచి ఉన్నారు. వారికి స్వప్నాలు నిజమయ్యే శుభఘడియలు వచ్చేశాయి.

సహాని ఆయన కలల సౌధాన్ని కనులారా చూడకుండానే, ఆయనకు వరించిన అంతర్జాతీయ వృక్ష శాస్త్ర కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిని అలంకరించకుండానే, పెలనోబోటనీ ఇనిస్టిట్యూట్ భవనానికి శంఖుస్థాపన జరిగిన వారం తిరక్కుండానే 1949 , ఏప్రిల్ 10 న ఆకశ్మిక గుండె పోటుతో మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *