మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962)

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962)

సుప్రద్ధ ఇంజనీర్‌గా, “బృందావన్ గార్డెన్స్” రూపకర్తగా మనందరికీ తెలిసినవారు “మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ఈయన 1860 కోలార్ జిల్లాలోని మద్దెనహళ్ళి గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా సిద్దమూరు మోక్షగుండం గ్రామం నుండి వలస వెళ్లారు. కేవలం ఇంజనీరింగ్ రంగంలోనే కాక, విద్యారంగంలో, నీటి పారుదల రంగంలో, పారిశ్రమిక, ప్రణాళికా రంగాలలో ఆయన విశేష కృషి చేశారు.

గంగా, సింధూ, మహానంది, మూసీ, కావేరి, తుంగభద్రా నదుల నియంత్రణకు ఆయన విశేష కృషి చేశారు. 1884లో బొంబాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరుగా మొట్ట మొదటగా ఆయన చేరారు. 1908దాకా ఆయన అక్కడ పనిచేశారు. మూసీ నది నుండి సుక్కర్ మున్సిపాలిటీకి త్రాగునీరు అందించేందుకు ఆయన చేసిన కృషి దేశ, విదేశాలలో ఆయనకు గుర్తింపునిచ్చింది. డామ్‌లలో నీరు నిల్వ ఉండేందుకు ఆటోమ్యాటిక్ గేట్స్‌ను విశ్వేశ్వరయ్య రూపకల్పన చేశారు. నిజామ్ ప్రభుత్వ ఆహ్వానంపై ఆయన 1909, హైదరాబాద్‌లో చీఫ్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. వరదలను నివారించేందుకు మూసీనది, దాని ఉపనదులపై ఆనకట్టలు నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. నది చుట్టూ గట్టును పెంచి, నడిచే బాటలు, ఉద్యానవనాలు పెంచాలని ప్రతిపాదించారు. సిటీ మొత్తానికి ఆధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. డ్రైనేజీ నీరు వ్యవసాయ భూములకు చేరేటట్లు ఆయన రూపకల్పన చేశారు. మూసీ, దాని ఉపనదిపై నిర్మించిన ఆనకట్టలను హిమయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ అని పిలుస్తున్నాము.

ఆ తర్వాత 1909 నవంబర్‌లో మైసూరులో చీఫ్ ఇంజనీర్‌గా చేశారు. ఆ తర్వాత మైసూరు రాష్ర్ట దివానుగా నియమింపబడ్డారు. రైతుల కోసం కన్నడ భాషలో షార్ట్ టర్మ్ కోర్సులను ఏర్పాటు చేశారు. వ్యాపారస్తుల కోసం అకౌంటింగ్, బ్యాంకింగ్‌లో శిక్షణ ఏరా్పటు చేశారు. ప్రజలను చైతన్యులను చేసేందుకు వ్యాపారస్తులలో సాంఘీక జీవితంలో విలువను కాపాడేందుకు వివిధ కోర్సులను ఏర్పాటు చేశారు. వ్యవసాయ పాఠశాలలు, ఎక్స్‌పరమెంటల్ ఫామ్స్‌ను స్థాపించారు. క్రాఫ్ట్ స్కూళ్ళను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించారు. టెక్నికల్ ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్‌ను మైసూరులో స్థాపించారు. మైసూరు, బెంగుళూరులలో ప్రజా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామాలలో మొబైల్ లైబ్రరీలను ఏర్పాటు చేయించారు. కన్నడ సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేసి సైన్సులో కన్నడ భాషలో చిన్న చిన్న పుస్తకాలు ప్రచురితమయ్యేందుకు కృషి చేశారు. మైసూరు విశ్వ విదా్యలయం స్థాపనకు విశేష కృషి చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు స్థాపనలో ఆయన ఎంతో కృషి చేశారు. తొమ్మిది సంవత్సరాలు ఆయన ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు. గ్రామీణ పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని ఆయన గాంధీకి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో డైరెక్టర్‌గా 28 సంవత్సరాలు పనిచేశారు. ఐరన్, స్టీల్ పరిశ్రమ నిర్వాహణకు ఆయన విశేష కృషి చేశారు. బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద్వారా వ్యాపారస్తులకు కుటీర పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆయన దివానుగా ఉన్న కాలంలో ప్రభుత్వ సోప్ ఫ్యాక్టరీ, శాండల్ ఆయిల్ ఫ్యాక్టరీ, టైక్స్‌టైల్ మిల్స్, మెటల్ ఫ్యాక్టరీ, భద్రావతిలో మైనింగ్ ఇతర కర్మాగారాలు ఏర్పడేందుకు విశేష కృషి చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం 1922లో ఢిల్లీని రాజధానిగా చేస్తున్నప్పుడు అసెంబ్లీ భవనము, వైస్రాయ్ భవనము, ఇతర ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు నియమించిన కమిటీలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కూడా ఒకరు.

1923 లక్నోలో జరిగిన ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్కు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను భారత రత్న బిరుదుతో సత్కరించింది. ఈయన ఏప్రెల్ 12, 1962లో తన 102వ ఏట మరణించారు. అనేక రంగాలలో విశేష ప్రతిభ చూపిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *