వానపాము
వానపాము ఒక రబ్బరు గొట్టం ఆకారంలో ఉండే అనిలిడా వర్గానికి చెందిన జీవి. ఇవి సాధారణంగా చిత్తడి నెలలో నివశిస్తాయి. వీటి ముఖ్య ఆహారం మట్టిలో ఉండే జీవ, నిర్జీవ సేంద్రయ పదార్థాలు. దీని జీర్ణవ్యవస్థ శరీరం మొత్తం ప్రాకి ఉంటుంది. దీనికి శ్వాశించటానికి ప్రత్యేక అవయవాలు ఉండవు. ఇది తన చర్మంతోనే శ్వాసిస్తుంది. ఇది వాయువులను చర్మము మరియు కాపిల్లరీల ద్వారా గ్రహిస్తుంది. రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను గ్రహించి రక్తంలోని ప్లాస్మాలో కలుస్తుంది. మిగతా కార్బండయాక్సైడ్, నీరు, లవణాలు, చర్మం గుండా బయటకు విసర్జించబడతాయి. వానపాములు షుమారు. 7000కు మించి రకాలు ఉన్నట్లు అంచనా!
ఇవి సాధారణఁగా నేలలో 15,30 సెం.మీ దిగువన నివశిస్తాయి. అయితే వాటిలో 1800 రకాలు మాత్రమే మనకు ఎక్కువగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వీటిలో 40 జాతులు భారతదేశంలో ఉన్నాయి. మనదేశంలోని “ద్రవిడా గ్రాండిస్” అతి పెద్ద వానపాము. ఇవి నేలను సారవంతం చేసి వ్యవసాయానికి ఎంతో సహయపడతాయి. పెరిటిమా జాతికి చెందినవి భారతదేశ వానపాములుగా గుర్తిస్తారు. వీటిలో 13జాతులున్నాయి. వాటిలో పెరిటిమా పోస్తుమా మన దేశపు సాధారణ వానపాము.
ముఖ్యంగా వానపాములను రెండు రకాలుగా విభజించారు.
1) బర్రోయింగ్ రకము
2) నాన్ బర్రోయింగ్ రకము
బర్రోయింగ్ రకముః ఇవి భూమి లోపల పొరలలో ఉంటాయి. ఇవి 90 శాతం మట్టిని, 10 శాతం వ్యర్థాలను ఆహారంగా తీసుకొంటాయి. ఇవి 8-10 అం॥ పొడవు ఉంటాయి. ఇవి నేలలో 3 నుంచి 5 మీటర్లు బొరియలు తవ్వి మట్టిని గుల్లపరుస్తాయి. నీటి ఎద్దడిని తట్టుకొంటాయి. వీటి జీవిత కాలం షుమారు 15 సంవత్సరాలు.
నాన్ బర్రోయింగ్ రకాలుః ఈ రకం వానపాములు భూమి పై పొరలలో తిరుగుతూ 10 శాతం మట్టిని 90 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొంటాయి. వాటిని జీర్ణించుకొని ఎరువును విసర్జిస్తాయి వీటి జీవితకాలం దాదాపు 28 నెలలు.
వానపాములు లేదా ఎరలు తను విసర్జించిన పదార్థాలతో నేల యొక్క భౌతిక, రసాయనికి మరియు జీవన స్వభావాన్ని మారుస్తాయి. భూసారాన్ని పెంపొందిస్తాయి.
వర్మి కంపోస్టుః నాన్ బర్రోయింగ్ వానపాము రకాల నుండి కృత్రిమ పద్దతిలో వర్మి కంపోస్ట్‌ను వాణిజ్య పద్ధతులో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో ఆవుపేడ, ఎండిన ఆకులు, కలుపు మరియు కూరగాయల వ్యర్థపదార్థాలను కుళ్ళనిస్తారు. దీనిపై వానపాములను వదులుతారు. ఈ బెడ్లపై పాత గోనె సంచులతో కప్పి తేమ ఉండే విధంగా చేస్తారు. సాధారణంగా 8 నుంచి 20 వారాలలో కంపోస్టు తయారు అవుతుంది. ఈ కంపోస్టును కుప్పగా పోసి వానపాములు అడుగు భాగానికి వెళ్ళేటట్లు చేస్తారు. ఎరువును జల్లేడ పట్టి గుడ్లను, పిల్లలను వేరుచేస్తారు. వీటిని తేమ లేని సంచులలో నిల్వచేసి వాణిజ్య పరంగా అమ్ముతారు.
శరీర నిర్మాణం వానపాముల శారీరంపై 100 నుంచి 150 కన్నా వలయాకారపు ఖండితాలు ఉంటాయి. పూర్వాంతంలో నోటి రంధ్రం, చివరి ఖండితంలో పాయువు వుంటుంది. దీని శరీరాన్ని గమనిస్తే చిన్న చిన్న రింగులు ఒక దానికి ఒకటి అతికించినట్లుగా వుంటుంది. ఈ విధమైన అమరిక వల్ల శరీరాన్ని సంకోచ, వ్యాకోచాలు జరుపుతూ వానపాములు నేలలో బొరియాలు చేసుకొని సులభంగా వెళ్ళగలుగుతుంది.
నర్వస్ సిస్టమ్ (నాడీ వ్యవస్థ)
వానపాములలో మూడు రకాల నాడీ వ్యవస్థ ఉంటుంది. 1) కేంద్రక నాడీ వ్యవస్థ, 2) పెరిఫిరల్ నర్వస్ సిస్టమ్, 3) సింపాధిటిక్ నాడి వ్యవస్థ. కేంద్రక నాడీ వ్యవస్థకు రెండు తంతులు కలిగిన మెదడు ఉంటుంది.
వానపాములకు కళ్ళు వుండవు. కాని దాని శరీర భాగంలో ప్రక్కన, కిందివైపు ఫోటోసెస్సిటివ్ సెల్స్ ఉంటాయి. వీటి సహాయంతో వెలుతురును,ఉష్ణోగ్రతలను గ్రహిస్తాయి.
ప్రత్యుత్పత్తి వ్యవస్థః
వీటిలో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. నిమ్నజాతి జీవులలో రక్తం ఎరుపు రంగులో ఉండటం మనము వానపాములో మాత్రమే చూస్తాము.
వానపాములలో మగ, ఆడ జీవులు ప్రత్యేకంగా ఉండవు. ఆడ, మగ లైంగిక అంగాలు ఒకే దానిలో ఉంటాయి. ఇవి ఒక దానికి ఒకటి వ్యతిరేక దశలో దగ్గరగా కలిసి సంతానోత్పత్తిని గావిస్తాయి.
వానపాములు దాదాపు కొన్ని కోట్ల సంవత్సరాల నాటి పురాతన జీవుల శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అమెరికాలోని ఆరిజోనా లోయలో 55కోట్ల సంవత్సరాల నాటి శిలాజం లబించింది.దీనిని బట్టి ఇవి ఎంత పురాతన జీవులో మనకు అర్థమవుతుంది. ఇవి 60 నుండి 90 రోజులకు పిల్లలుగా మారుతాయి. పిల్లలు పూర్తిగా పెద్దవిగా మారటానికి సంవత్సరం రోజులు పడుతుంది.
డార్విన్ 1881లో తను చనిపోయే ఆరు నెలల ముందు వానపాములను గూర్చి తన ఆఖరి పుస్తకంలో వివరించారు. డాల్విన్ తన పుస్తకంలో వానపాముల గూర్చి ఇలా వ్రాసుకొన్నారు.
ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల జంతువులు ఎంతో ప్రాముఖ్యాన్ని కల్గినట్లే ఈ చిన్న వాన పాములు ఎట్లా కల్గి ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వానపాములు మట్టితో పాటు జీవ, నిర్జీవ సేంద్రియ పదార్థాలను (ఆకులను, కుళ్ళిన పదార్థాలను) తింటుంది. అలా జీర్ణమైన పదార్థాలు మరలా ఎరువుగా నేలలో విసర్జిస్తుంది. మొక్కలు సేంద్రియ పదార్థాలను వేరుగా గ్రహించలేవు. ఇలా వానపాము విసర్జించిన పదార్థం ఎరువు మొక్కలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేలలో క్రిందకు పైకి తిరుగుతూ నేలను గుల్లబారస్తూ, ఎరువును విసర్జిస్తూ నేలను ఎంతో సారవంతం చేస్తున్నాయి. ఈ విధంగా వానపాములు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి.
వానపాములు నిశాచర జీవులు, అంటే పగలు భూమి పొరల్లో ఉంటూ రాత్రి పూట తమ పనిని ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ జీవులు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేవు. ఈ వానపాములను రెండుగా విభజించవచ్చు. 1) భూమిపై నివశించేవి, 2) నీటిలో నివశించేవి.
సాధారణంగా అన్నీ వానపాములు భూమి పొరల్లో జీవనం సాగిస్తాయి. చైనాలో వానపాములు చెట్లపై మొలకెత్తే మాసస్‌తో సహజీవనం గడుపుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. (పరిటీమా లేసర్ టీనా) ఇవి మట్టిరంగు, ఆకుపచ్చరంగు చారలు కలిగి మాస్ మొక్కలతో కలిసి జీవిస్తున్నాయని తెలుసుకొన్నారు. పెరిటీమా బోంబోపైలా అనే మరో రకం వానపాము వెదురు బొంగు చెట్ల ఆకులు తింటూ వాటిపైనే జీవిస్తుంది. అంతేకాదు ఈ జీవులు మంచు ప్రాంతాలలో కూడా జీవిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
1937లో లభించిన వానపాము పొడవు6,7 మీటర్లు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వానపాముగా గుర్తించబడింది. కీటోగాస్టర్ అన్నాన్ డేలార్ అనే వానపాము 0.048సెం.మీ ఉంటుంది. ఇది ప్రపంచంలో అతి చిన్న వానపాము.
ఈ వానపాము నిమ్మజాతి వెన్నెముకలేని జీవుల వర్గీకరణలో అన్నెలిడా అనే పైతానికి చెందినవి. వానపాములో ప్రత్యేకతలలో ముఖ్యమైనది దీని ద్విలింగత్వం.
మరి వీటిలో సంపర్కం, సంతానోత్పత్తి ఎలా జరుగుతుందనే విషయం శాస్త్రజ్ఞలకు ఆశక్తి కరమైన విషయంగా మారింది.
ఇవి పరస్పరం దగ్గరకు వచ్చినప్పుడు ఒకదానిని ఒకటి తల్లక్రిందులుగా (అంటే ఒకదాని తల ఒకవైపు, ఇంకొకదాని తల ఇంకొక వైపుగా) పెనవేసుకొంటాయి. ఆ సమయంలో దాని శరీరం నుండి జిగురు లాంటి ద్రవం స్రవించి ఆ రెండింటిని పట్టి ఉంచుతుంది. పురుష అవయవం, ఇంకొక వానపాము స్త్రీ అవయంతో కలుస్తుంది. దీని ఫలితంగా ఏకకాలంలో రెండు వానపాములు గర్భాన్ని దాలుస్తాయి. ఫలదీకరణము తర్వాత గుడ్లు ఏర్పడతాయి.
ఫలదీకరణం చెందిన గుడ్లు ఒక పెట్టె ఆకారం గల ‘కాకూన్’ లోకి చేరుతాయి. ఈ కాకూన్ వానపాము శరీరంలో నుంచి బయటకు వచ్చి దాని తలపై షుమారు ఒక నెల రోజులు అతుక్కొని ఉంటుంది. పిల్ల వానపాములు ఈ కాకూన్ నుంచి బయట పడతాయి. సంవత్సరంలో పది నుంచి వందలదాకా పిల్ల వానపాములు బయటకు వస్తాయి.
వీటి విసర్జక మల పదార్థం గట్టిగా అణువుల రూపంలో ఉంటుంది. అందుకే వ్యవసాయానికి ప్రధానమైన జీవిగా రైతు మిత్రునిగా పరిగణిస్తారు. వానపాములు పంట పొలాల్లో సమృద్ధిగా ఉంటే అసలు ఎరువుల అవసరం ఉండదేమో… అందుకే డార్విన్ వానపాములు మీద ప్రత్యేకంగా ఒక పుస్తకంలో వీటిని గూర్చి విపులంగా చర్చించారు.
పునరుత్పత్తిః
వానపాములు ఉభయ లింగ జీవులు. ఆడ, మగ ఎర్రలు వేరుగా ఉండవు. స్త్రీ, పురుష లింగములు ఒకే దానిలో ఉంటాయి. కాని ఇవి ఇతర ఎర్రలతో సంపర్కం జరిపి పరపరాగ సంపర్కంచే ఫలదీకరణ జరుపును. ఆరు వారాల వయసులో ఎర్రలు ప్రత్యుత్పత్తి ప్రక్రియ మొదలుపెట్టి గుడ్లు పెట్టుట (కకూన్లు పెట్టుట) ప్రారంభిస్తాయి.
వానపాముల గుడ్లు 3-7 ఒక సమూహముగా ఒక తొడుగులో పెట్టును. గుడ్లు గల ఒక తొడుగును కకూన్ అంటారు. ఈ కకూన్‌లు ధాన్యాల విత్తు ఆకారముతో అదే పరిమాణములో లేత పసుపు రంగు కలిగి ఉంటాయి. ఇది ఒకవైపు రెండు చిన్న ముండ్లు ఆకారము కలిగి వుంటాయి. రెండు నుండి మూడు వారాలలో కకూన్ నుండి 3-7 పిల్ల ఎర్రలు ఉత్పత్తి అవుతాయి. కకూన్‌లు ఎండు గడ్డి రంగుకు మారుతాయి.
ఈ పిల్ల ఎర్రలు 3-5 మి.మీ. పొడవులో ఉంటాయి. ఈ పిల్లలు ఎదిగి తిరిగి ప్రత్యుత్పత్తికి తయారవుతాయి. ఒక జత ఎర్రలు సుమారు 3-6 మాసములలో 50-100 కకూన్‌లు పెడతాయి.
వానపాముల ప్రత్యుత్పత్తికి అనుకూల కాలమనేది లేనప్పటికి వాతావరణ పరిస్థితులు అనగా ఉష్ణోగ్రత, తేమ, ఆహార లభ్యత మొదలగునవి ప్రభావితము చేస్తాయి. సాధారణంగా వర్షాకాలము, చలికాలములలో వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
అంతే కాదు వానపాములు భూమీలోను, నీటిలోను ఉన్న లోహ పదార్థాలను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇంకొక విచిత్రమైన నిషయం ఏమిటంటే వానపాములు తెగిపోయిన తమ శరీర భాగాలను తిరిగి నిర్మించుకోగలవు. అయితేఅది కొన్ని జాతులలోనే తెగిన భాగం ఎంత వరకు అనే విషయాలను మీద ఆధారపడి ఉంటుంది.
వీటి జీవిత కాలం పొలాల్లో నివశించేవయితే 4 నుంచి 8సం॥రాలు జీవిస్తాయని అదే పూలతోటలలో నివశించేవి.
వానపాముల ఆహారము మరియు పునరుత్పత్తిః
భూమియొక్క భౌతిక స్వరూపము మరియు దానిలో గల సేంద్రియ పదార్థాముల శాతముపై వానపాముల జీవన విధానము ఆధారపడి ఉంటుంది.
వానపాములు చాలా చిన్న, సున్నతమైన జీవులయినప్పటికి వాటి జీర్ణవ్యవస్థ చక్కగా అభివృద్ధి చెంది ఉంటుంది. వివిధ రకముల ఎంజైములు స్రవించడము వలన అనేక రకాల ఆహార సంబంధ పిండి పదార్థములను, ప్రోటీనులను మరియు క్రొవ్వు పదార్థములను జీర్ణించుకోగల శక్తి కలిగి ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థముతో కూడా మట్టిని ఆహార మిశ్రమంగా తీసుకొని అన్నవాహికలో బాగా నమిలి కొంత భాగం (5-10%) జీర్ణించుకొని మిగతాదానిని రోజుకు ఇంచుమించు వాటి శరీర బరువుకు సమానమైన పదార్థమును ‘గుళికలుగా’ విసర్జిస్తాయి. వీటినే వర్మికాస్టింగ్స్ అంటారు. ప్రతి వెయ్యి ఎదిగిన వాపాముల బరువు సుమారు ఒక కిలో ఉంటుంది.
ఎర్రలు వివిధ రకముల వ్యర్థ పదార్థములను ఆహారంగా తీసుకోగలుగుతాయి. కాని వాటి పునరుత్పత్తి మరియు పెరుగుదల అవి తీసుకొన్న ఆహార పదార్థములపై ఆధారపడి ఉంటుంది. ఆహారములో లభించే కార్భన్ మరియు నత్రజని మోతాదులపై ఎర్రల పెరుగుదల మరియు గుడ్లు పెట్టుట ఆధారపడి ఉంటుంది. కుళ్ళుతున్న వ్యవసాయ వ్యర్థపదార్థాలు, పచ్చిరొట్ట, గొఱ్ఱల, పశువుల, గుఱ్ఱాల, మేకల, పందుల పెంట, ఊక, రంపం పొట్టు వంటి వ్యర్థపదార్థములు మరియు ఇతర ఉపయోగపడి ఏవైనా సేంద్రియ పదార్థములు వీటికి ఆహారంగా పనికి వస్తాయి.
ఈ విధమైన సేంద్రియ వ్యర్థపదార్థములను ఆహారముగా తీసుకొని ‘వర్మికాస్టింగ్స్’ను విసర్జించుట ద్వారా ‘వర్మికంపోస్టు’ అనే విలువైన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఈ ఎరుపులో మొక్కలకు కావలసిన పోషక ద్రవ్యాలేకాక అసంఖ్యాకంగా సూక్ష్మజీవులు ఉండటం వలన నేలను సారవంతముగా చేసి పైరు పెరుగుదలకు ఎంతో దోహదపడుతాయి. ఒక కిలో బరువుగల వానపాములు రోజులో సుమారుఐదు కిలోల వ్యవసాయ పదార్థములను ఆహారంగా తీసుకొని 80-90% వర్మికాస్టింగ్‌గా విసర్జిస్తాయి. ఆహరములో లభించే తేమ శాతముపై (50% సుమారు) కూడా ఈ ఎరుపు తయారీ ఆధారపడి ఉంటుంది.
సేంద్రియ ఎరువులలో వర్మికంపోస్టు ఎంతో ముఖ్యమైనది. వానపాముల పెంపకంతో పనికిరాని సేంద్రియ పదార్థాలతో తాయరు చేసే సారవంతమైన ఎరువును వర్మికంపోస్టు అంటారు.
వానపాము ఉనికి – రకములు
వానపాములు రైతున్నలకు అత్యంత ప్రయోజనాన్ని అందించే అల్పజీవులు. వీటిని ప్రకృతికి, రైతులకు స్నేహితులుగా వర్ణిస్తారు. అందువలననే వానపాములను కొన్ని ప్రాంతాలలో మహీలత అని, ఎర్రలు అని పిలుస్తారు.
వానపాముల శరీర నిర్మాణం, వాటి జీవన ప్రక్రియలు, చలనాలు వలన అవి ప్రకృతిని శుభ్రపరిచే కర్మాగారాలుగా చెప్పవచ్చు. ఎర్రల జీవన ప్రక్రియలకు అనుకూలమైన ఉష్ణోగ్రత, తేమ, ఉదజని సూచిక, ఆమ్లజని సాంద్రత ఉన్నప్పుడు వాటి ప్రేగులలో వేల సంఖ్యలో సూక్ష్మాంగ జీవులు ఉంటాయి. ఈ సూక్ష్మాంగ జీవులు ప్రకృతిలో లభ్యమయ్యే వివిధ సహజ, కుళ్ళుతున్న జంతు, వృక్ష సంబంధ వ్యర్థ పదార్థములను ఆహారంగా తీసుకొని బాగా పెరిగి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఎక్కువ చెత్తను ఎరువుగా మార్చగలుగుతాయి.
ఎర్రలు (వానపాములు) నేలను సారవంతం చేయుటలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇవి సాధారణంగా నేలలో 15-30 సెం.మీ దిగువన ఒక మోస్తరు తడి (40-50% పదును) నేలయందు ఉంటాయి. ఎక్కువ తేమ లేదా పొడిగా ఉన్న ప్రదేశముల యందు మరియు నల్లరేగడి నేలలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ జీవులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు భూమిపై పొరలలో తేమ ఆరిన కొద్ది కింది పొరలకు వెళ్ళుతుంటాయి. వీటి ఆహారము ఎక్కువగా ముడి సేంద్రియ పదార్థము కావున ఎక్కువగా అడవి భూములు, సేద్యము చెయ్యని భూములలో, ఉద్యానవనములలో, పశువుల పేడ ఎక్కువగా వేసిన భూములలో , పొలాల గట్లయందు విరివిగా ఉంటాయి.
వ్యవసాయ విశ్వవిద్యాలయము బెంగుళూరు వారు గత 30 సంవత్సరాలుగా జరిపిన పరిశోధనల ఆధారఁగా మిశ్రమ రకాల పెంపకము అనగా ‘యూడ్రిలస్’ యుజెనీ, ఐసీనియా ఫెటిడా, ఫెరియోనిక్స్ ఎక్స్‌కవేటస్ చేపట్టడము ద్వారా త్వరగా ఎరువును తయారు చేయడమేగాక పునరుత్పత్తి కూడా బాగా ఉంటుందని తెలియజేశారు.
ఇవి భూమిలో బొరియలు చేసుకొని జీవిస్తాయి. ఇలా భూమిలో బొరియలు చేయటం వల్ల భూమి లోపల పొరలలోకి సమృద్ధిగా గాలి, నీరు, పోషకాలు చేరుకొంటాయి.
లాటిన్ బాషలో అన్నెలిడా అంటే చిన్న రింగులు కలది అని అర్థము
దీని శరీరం ఖండితాలుగా ఒక్కొక్క ఖండితంలో కండరాలు, సిటే అని పిలవబడే వెంట్రుకల లాంటివి ఉంటాయి. దీని భాగాలు ఒక్కొక్క ఖండితానికి నాలుగు జతల చొప్పున ఉంటాయి. భూమిలో ముందుకు వెనక్కు కదిలేటప్పుడు, ఇవి భూమీని గట్టిగా పట్టుకోవటానికి ఉపయోగపడతాయి. మిగతా భాగాలు ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి.
ఇవి నీరు తక్కువ ఉన్న ప్రాంతంలోను, వాతావరణఁలో అలజడి ఉండే ప్రాంతాలలో ఎక్కువగా జీవించలేవు.
దీని మొదటి ఖండికలో నోరు ఉంటుంది. ఈ నోటి భాగంలో ప్రోస్టోమియ అనే పొర ఉంటుంది. ఇది విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆ పొర నోటిని మూసి ఉంచుతుంది. అయితేఈ పొర చుట్టు పక్కల వాతావరణాన్ని పరిశీలించే స్పర్శాంగంగా కూడా పని చేస్తుంది. అంతేకాదు ఇది భూమిలో బొరియలు చేసే సమయంలో తనకు అడ్డం వచ్చిన ఆకులు, గడ్డి వంటి వాటిని తొలగించుకొంటూ ముందుకు పోతుంది.