హరగోవింద్ ఖొరానా

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

హరగోవింద్ ఖొరానా

హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్ర్తజ్ఞుడు జనవరి 9, 1922న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు. (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నది)

తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. ఐదుగురి సంతానములో చివరివాడు. తొలుత తండ్రి శిక్షణలోను తదుపరి ముల్తాన్‌లో దయానంద్‌ ఆర్య విద్యా ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము. లాహోర్ నుండి 1943లో B.Sc మరియు 1945లో M.Sc పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వవిద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్ర్త పరిశోధనలు చేసి పి.హెచ్డి పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్వీట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో పరిశోధనలు సాగించాడు.

1951-52లో విశ్వ విఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయములో మాంసకృతులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలయములో చేరాడు. అటు పిమ్మట 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు. 1970లో ప్రతిష్టాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్ర్త ఆచార్యునిగా చేరాడు.  2007లో పదవీ విరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగిస్తున్నాడు.

జీవ శాస్ర్తవేత్తలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ప్రశ్న ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టిచడం సాధ్యమేనా?.. ఈ దిశలో వంశపారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహం చేసే కృత్రిమ జీన్‌ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ Genetic Engineering అేనూతన శాస్ర్త అధ్యయానానికి దారి తీసింది.

ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరితో జన్యువులలో పొందుపరచబడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుకొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్ర్తములో ఒక విప్లవము వచ్చింది. 1968లో వైద్యశాస్ర్తములో నోబెల్ బహుమతి లభించింది.

1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ వివాహమాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు జులియా, ఎలిజబెత్ ఎమిలీ యాన్నె, డేవ్ రాయ్.

ఖొరానా నవంబర్ 9, 2011న కంకార్డ్ మసాచుసెట్స్‌లో 89వ ఏట సహజ మరము చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *