మాక్స్ ప్లాంక్ (1858-1947)

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

మాక్స్ ప్లాంక్ (1858-1947)

 జర్మనీలోని మ్యూనిచ్, బెర్లిన్ యూనివర్సిటీల్లో చదివారు. మ్యూనిట్ యూనివర్సిటీ నుంచి 1879లో ఫిజిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ పొందారు.  1889 నుంచి 37 సంవత్సరాలు బెర్లిన్ యూనివర్శిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ థియరీటికల్ ఫిజిక్స్‌కు డైరెక్టర్‌గా చేశారు. 1918లో భౌతిక శాస్ర్తంలో నోబెల్ బహుమతి.

ముఖ్య రచనలు

  1. Introdution to Theoretical Physics: 5 Volumes (1930)
  2. Philosophy of Physics (1930)
  3. Scientific Autobiography and other Papers (1949)

భౌతిక శాస్త్రం సాధించాల్సింది ఇంకేమీ లేదనుకుంటున్న తరుణంలో 20వ శతాబ్ధపు తొలి రోజుల్లో… అంటే 1900 సంవత్సరంలో ఈ శాస్త్రాన్ని మహోన్నత శిఖరాలకు చేర్చిన ఘనత క్వాంటమ్ సిద్ధాంతానిదే. ఈ సిద్ధాంత వైతాళికుడు, నిర్ధేశకుడు – భౌతిక శాస్త్రవేత్త మాక్స్ కారల్ ఎర్నెస్ట్ లుడ్విగ్ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం సృష్టిలో మూలకాలను ఒక వరుస క్రమంలో అమర్చిన ఆవర్తన పట్టిను విపులీకరిస్తుంది. అసలు రసాయనిక చర్యలు ఎందకు జరుగుతాయి… అనే దృగిషయాన్ని వివరిస్తుంది. జీవశాస్త్రంలో DNAకణాల స్థిరత్వాన్ని పరమాు కేంద్రం నుండి అల్ఫా కణఆలు ఎలా బహిర్గతమవుతాయో తెలుపుతుంది. లేజర్ కిరణాలు మైక్రోచిప్స్ ఆవిష్కరణకు దోహదం చేయటమే కాకుండా వాటిని కనుగొనక పూర్వమే అవి ఎలా పనిచేస్తాయో క్వాంటమ్ సిద్ధాంతం కచ్చితంగా ఊహించింది. క్వాంటమ్ సిద్ధాంతం ఈ భౌతిక లోకాన్ని సరికొత్త కోణంలో చూపుతుంది.

క్వాంటమ్:  క్వాంటమ్ అంటే ఏదైనా ఒకదాని పరిమాణాన్ని తెలిపే స్థిరరాశి. శక్తి సంపూర్ణ సంఖ్యల్లో (1,2,3…) మాత్రమే విడివిడి ప్రమాణాల్లో ఉంటుంది. అలాంటి ఒక ప్రమాణాన్ని క్వాంటమ్ అంటారు. కాంతిశక్తి ఒక క్వాంటమ్ను ఫోటనా అంటారు.

కృష్ణ వస్తువు 

 దీనిపై పతనం చెందే విద్యుదయస్కాంత ఉష్ణ కిరణాలను పూర్తిగా తనలోకి గ్రహిస్తుంది.

క్వాంటమ్ సిద్ధాంతం: కృష్ణ వస్తువు నుంచి వెలువడే విద్యుదయస్కాంత ఉష్ణ వికిరణాలను వివరించడానికి పా్లంక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం శక్తి అవిచ్చిన్నంగా కాకుండా విడివిడిగా అతిచిన్న పరిమాణాల్లో ఉంటుంది. ఒక పరిమాణాన్ని ఒక క్వాంటమ్ శక్తి అంటారు.

క్వాంటమ్ సిద్దాంత విజయాలు

ఐన్‌స్టెయిన్ – ఫోటో విద్యుత్ ఫలితం : నగరాల్లోని కొన్ని పెద్ద భవనాల్లోకి ఎవరైనా వెళ్ళినప్పుడు ద్వారంలో ఉన్న పెద్ద తలుపులు ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటవే తెరచుకుంటాయి. వారు ద్వారం దాటిన వెంటనే మళ్ళీ మూసుకుంటాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే ద్వారంలోని మార్గానికి ఒక సన్నని కాంతి పుంజాన్ని గమనించవచ్చు.ఈ కాంతి పుంజానికి అవరోధం కలిగితే అక్కడ అమర్చిన మోటారు తలుపులు తెరుస్తుంది. ఇదే విద్యత్ నేత్రం. ఇది టెలివిజన్ కెమెరాల్లో కూడా ఉంటుంది. కాంతి కిరణాలు ఒక లోహంపై పతనం చెందితే ఎలక్ట్రాన్లు ఉద్భవిస్తాయి. అంటే కాంతిశక్తి నుండి విద్యుచ్చక్తి ఉత్పన్నమవుతుంది. క్వాంటమ్ సిద్దాంతంపై ఆధారపడి ఈ ప్రక్రియను ఫోటో విద్యుచ్చక్తి అంటారు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టెయిన్ సిద్దాంతీకరించారు. విశ్వవిఖ్యాతి చెందిన తన సాపేక్ష సిద్దాంతానికి కాకుండా పోటో విద్యుత్ ఫలితానికి 1921లో ఐన్ స్టెయిన్ నోబెల్ బహుమానం పొందా

నీల్స్‌బోర్ పరమాు నమూనా: మూలకాలను వేడిచేసి ఆ కాంతిని గాజుపట్టకం గుండా ప్రసరింపచేస్తే ఉత్పన్నమయ్యే పరమాు వర్ణపటాన్ని అభివర్ణించటానికి నీల్స్‌బోర్ అనే శాస్ర్తవేత్త క్వాంటమ్ సిద్దాంత మౌలిక సూత్రాలను ఉపయోగించారు. తద్వారా పరమాణు నమూనాను ప్రతిపాదించారు. నీల్స్‌బోర్‌కు 1922లో నోబెల్ బహుమతి లభించడానికి ఆ నమూనాయే కారణం.

క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం: పరమాణు, ఉప పరమాణు పదార్థాల ప్రవర్తనను నియంత్రించే క్వాంటమ్ యాంత్రిక శాస్ర్తానికి క్వాంటమ్ సిద్దాంతమే తొలిమెట్టు. ఈనాడు మానవాళి అనుభవంలోకి వచ్చిన లేజర్ కిరణాలు, అతి వాహకత, కాంపాక్ట్ డిస్క్ (సిడి)లు కంప్యూటర్ రంగానికి మూలాధారమైన మైక్రోచిప్స్. ఈ శాస్ర్త ప్రయోగ ఫలితాలే. క్వాంటమ్ యాంత్రిక శాస్ర్త పరిణామానికి కారకులైన శాస్ర్తజ్ఞులు ఎర్విన్ పైన్‌మన్‌లు నోబెల్ బహుమతుల పంట పండించారు.

ఈ సిద్ధాంత భావనలు ప్రాచ్య వేదాంత ధోరణులను పోలి ఉన్నాయి. వాస్తవికతపై అవగాహన, స్వేచ్ఛా సంకల్పం, సాధారణ స్థితికి అతీతమైన విషయాల మర్మాలను చేదించడానికి ఉపకరిస్తున్నాయి.

ముఖ్యభావనలు

     బౌతిక శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేశారన్న ప్రశ్నకు ప్లాంక్ జవాబు. ఈ సృష్టిలోని పరమ రహస్యాలను, నియమాలను అద్యయనం చేయడం, నాకు మహత్తరమైన శాస్త్రీయ అన్వేషణ అనిపించింది.

 

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *