మా గురించి

మా గురించి

మాస్టారు”- విద్య, విజ్ఞాన సమాచార వేదిక. ఈ వేదిక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యా సంస్థల నిర్వాహకులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాము. తెలుగులో విద్యకు సంబంధించి, విజ్ఞానికి సంబంధించి అంతర్ఝాలంలో లేకపోవటం మా ప్రేరణకు ముఖ్య కారణం. విద్యార్థులు వైజ్ఞానిక విషయాలు తెలుసుకొని, విజ్ఞానం పట్ల మక్కువ పెంచుకొనే విధంగా మాస్టారును రూపొందిస్తున్నాము. అలాగే భాషపట్ల మక్కువ పెంచుకొనేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నాము.

ఈనాడు విద్యకు సంబంధించి అనేక పుస్తకాలు తెలుగులోనికి అనువదింపబడుతున్నాయి. కాని దురదృష్టవశాత్తు అవి అందుబాటులో లేకపోవటమో లేదా వాటిని గూర్చి తెలుసుకోకపోవటమో జరుగుతోంది. పిల్లల మనస్థత్వ శాస్త్రము, తరగతి నిర్వహణ, కరిక్యలమ్ డిజైనింగ్ వంటి అంశాలను సంక్షిప్త రూపంలో అందించి ఉపాధ్యాయులు గ్రహించే విధంగా చేయాలని మా ప్రయత్నం.

ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఎన్నో మార్పులు, ప్రణాళికలు అమలు అవుతున్నాయి. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా విద్యారంగంలో సమూల మార్పులను తేలేకపోయింది. ఏవో కొన్ని మార్పులు వచ్చినప్పటికి ప్రాథమిక విద్యా విధానంలోనూ, మాథ్యమిక పాఠశాల విద్యా విధానంలోని మన దృక్పందంలో ఎలాంటి మార్పులు రాలేదు.

ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో జరుగుతున్న మార్పులను ప్రణాళికలను తెలుసుకొంటూ మనకంటూ భారతీయతత్వానికి, ప్రపంచ ఉనికికి మనకంటూ ఒక విద్యా విధానాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉంది.

దీనికి అందరి తోట్పాటు అవసరం ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల అధితులు, తల్లిదండ్రులు, వీరందరూ కలసి ఒక ఉద్యమంలా ముందుకు పోతే మనం మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని రాగలం. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల దృక్పందంలో సమూల మార్పులు రావల్సిన అవసరం వుంది.

ఇప్పటి ఈ వ్యవస్థ వల్ల విద్యార్థులు పూర్తి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భయం, పోటీతత్వం, మార్కులు, ర్యాంకులు, తల్లిదండ్రుల వత్తిడులు, ఉపాధ్యాయుల, పాఠశాల, కళాశాల యాజమాన్యాల వత్తిడిలకు విద్యార్థులు గురవుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు సంవత్సరానికి లక్షమంది యువకులు వివిధ మానసిక ఒత్తిడులకు లోనై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. మన విద్యా వ్యవస్థ వారందరికీ ఎటువంటి మానసిక ధైర్యాన్ని ఇవ్వకపోవటం దురదృష్టకరం.

మన ఈ విద్యా విధానంలో ప్రకృతికి దూరమవుతున్నారు. ప్రయోగం, పరిశీలనలకు దూరమవుతున్నారు. అనేక వైజ్ఞానికి విషయాలు ప్రకృతి నుండే మన బట్టి పట్టే విధానం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం ఉండటం లేదు. పరిశీలనాజ్ఞానం కొరవడుతోంది. మానసిక ఒత్తిడులకులోనై, నైతిక విలువలు విద్యార్థులు మర్చిపోతున్నారు. మానవతా విలువలు కోల్పోతున్నారు.

తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి, విద్యా సంస్థల నుంచి, ప్రోత్సహం, ప్రేమాభిమానాలు కరువై విద్యార్థులు అలమటిస్తున్నారు.

భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, సమాజం వారి ఆశలను, ఆశయాలను నిర్వీర్యం చేస్తున్నాయి.

ఇలా సమస్యల వలలో కొట్టుకుపోతున్న ఈ విద్యావ్యవస్థలో ఎంతో కొంత మార్పుకు దోహదపడాలని మా ఈ చిన్న ప్రయత్నం.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యులు, విద్యావేత్తలు మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.