కథల కాణాచి……

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం పిల్లల మనస్తత్వ శాస్త్రము

విద్యలో  ముఖ్యమైన అంశాలు 1) సాహిత్యం, 2) కథలు, 3) చిత్రలేఖనం (డ్రాయింగ్), 4) పుస్తక పఠనం. ఈ నాలుగు అంశాలు పిల్లవాని సృజనాత్మకతకు సంబంధించినవి. సాహిత్యం అది ఏ భాషలోనైనాకావచ్చు. మంచి విలువులతో కూడిన సాహిత్యం చదివినపుడు పిల్లల మనోభావాలలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తమను తాము ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. సున్నత భావాలను మనసులో చొప్పించడం జరుగుతుంది. ఒక కవిత ద్వారా ఒక అద్భుత విషయాన్ని గ్రహించవచ్చు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర లేదా సంఘటనలు ద్వారా మనసులో ఒక కొత్త ఆలోచన లేదా నిర్ణయం ఏర్పరుచుకోవచ్చు. కొన్ని సందర్భాలలో పిల్లవాని ప్రవర్తన నడవడి అలవాట్లలో అద్భుత మార్పులు సంబంవించవచ్చు. ఇంత అద్భుతమైన ఈ ప్రక్రియను మనం నిజంగా (ఉపాధ్యాయులమైన మనం) పిల్లలకు ఆ స్థాయిలో బోధించగల్గుతున్నామా?

 

కొత్త ఆలోచనలకు ఊహాశక్తికి స్థానం కల్పించగల్గుచున్నామా? ఊకదంపుడు విధానాలు బట్టి సంస్కృతి నుంచి మనం బయట పడాల్సిన అవసరం లేదా! ఇంత అద్భుతమైన ఈ ప్రక్రియను పిల్లల మనోభావాలపై ప్రభావాలలో మార్పుకు ప్రయత్నించలేమా! మనం ఈ ప్రక్రియను అద్భుతంగ తరగతి గదిలో అధునాత పద్ధతిలో క్రమశిక్షణ గూర్చి, నీతిని గూర్చి, ప్రవర్తన గూర్చివేరే ప్రత్యేక పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందా?

 

కథలుః- ఇక కథల విషయానికి వస్తే పిల్లల ఆలోచనలకు, అనుభూతులకు, ఉద్దేశాలకు, కల్పనలకు కథలు చెప్పడం అద్భుత ప్రక్రియ. ఈనాటి స్పీడు యుగంలో చాక తీరిక లేదు. తల్లిదండ్రులకు తీరక లేదు. ఇక ఉపాధ్యాయులకు అంత తీరిక లేదు, ఓపిక లేదు. కొన్ని అద్భుతమైన కథలు పిల్లవాని మనసుపై ప్రభావం చూపి ఆలోచించటం నేర్చుకుంటాడు.

 

తనకు ఇష్టమైన కథను ఎన్నిసార్లైనా వినేందుకు పిల్లవాడు సిద్ధమౌతాడు. కొన్ని అద్భుత కథలు పిల్లవాని హృదయాన్ని కదిలిస్తాయి. బాధలను తనచుట్టూ ఉన్న ప్రపంచంతో పోల్చుకుంటాడు. తన హృదయ స్పందనలను తన ప్రవర్తనను ప్రశ్నించుకొంటాడు. అయితే అలాంటి కథలను ఏరి గూర్చి పిల్లలకు అందించటంలో మన పాత్ర (ఉపాధ్యాయులకు, రచయితలు) ఎంతో వుంది. కొన్ని కథలు వాస్తవాలు కాదని పిల్లలకే తెలుసు. అయినా వాస్తవానికి విరుద్ధమైన కల్పిక కథళంటే పిల్లలకు ఇష్టం. ఎందుకుంటే ఊహాలోకంలో విహరించమంటే మహా ఇష్టం. అందుకే హరిపోర్టర్ ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాచుర్యాన్ని పొందింది.

 

పిల్లలకు నీతి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏది మంచి, ఏది చెడు అనేది పిల్లలు కథల ద్వారా చక్కగా గ్రహించగల్గుతారు. మన పాఠ్య పుస్తకాల్లో వల్లించే నీతులు, నీతి వాక్యాలు బయటి ప్రపంచాలనికి విరుద్ధంగా ఉంటాయి. కాని కథలు అలా కాదు వాస్తవాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాయి. అందువల్ల కథల ద్వారా బయటి ప్రపంచంలో జరిగే వాస్తవాలను గ్రహించగల్గుతారు. చిన్నతనంలో కథలను ఎక్కువగా విన్నవారు, చదివినవారు ఎప్పుడు మానసిక దుర్భలుగా ఉండరు. పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, వైజ్ఞాన కథలు, పక్షులు, జంతువుల కథలు ఇలా ఎటువంటి ఇతి వృత్తమైన పిల్లలకు ఇష్టమే! టి.విలు, కంప్యూటర్లు వచ్చి పిల్లలు మనో నేత్రాలను మూసివేస్తున్నాయి. పుస్తకం చదువుతున్నంతసేపు పిల్లలు తమ మనోనేత్రంతో అద్భుత ప్రపంచాన్ని చూడగల్గుతారు. టి.విలో చూసే దృశ్యం. వాళ్ళ మనోనేత్రాలను తెరవనీయడు, వైజ్ఞానిక అద్భుతాల్లో కార్టూన్లు ప్రక్రియ ఒటకి అయినప్పటికి పిల్లల మానసిక వికాసానికి ఇలి ఎలాంటి సహయం చేయవు. కార్టూన్లు ప్రపంచంలో వారు కొంతసేపు గడపటంలో తప్పులేదు. కాని దానికే బానిసలై ఒక వ్యసనంగా మారితే మాత్రం కష్టం.

 

భాషాభివృద్ధికి కథలు ఎంతగానో ఉపయోగపడ్తాయి. కథలు చెప్పటం, చదివించటం ఒక ప్రక్రియ అయితే సృజనాత్మక ప్రక్రియకు తోడ్పడే విధంగా కొన్ని బొమ్మలను ఇచ్చి కథలుగా మలచడం, కొన్ని పదాలు వ్యాకాలతో లేదా కొన్ని క్యారెక్టర్లతో కథలు అల్లడం, కథలో వ్రాయమనటం, కథళపై సమీకరణమనటం ఈ కోవలోకివస్తాయి.

 

కథాతోరణం ద్వారా అద్భుతమైన కథల ప్రక్రియలను గూర్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేయటం, కొన్ని అద్భుత పిల్లల పుస్తకాలను పరిచయం చేయటం, కథల సమేక్లలను వ్రాయటం, పిల్లల కథాలారాథకుల అభిప్రాయాలు పంచుకోవటం, పిల్లల కథలను ప్రచురించటం, కథతోరణం యొక్క ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *